వైల్డ్ కార్డుతో రీ ఎంట్రీ ఇస్తా.. ఆ ఇద్దరే వెన్నుపోటు పొడిచారు.. ఆట సందీప్
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 8వ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తయింది. టాప్ కంటెస్టెంట్‌గా భావించిన ఆట సందీప్ అనూహ్య పరిస్థితుల్లో ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇప్పటి వరకు 7 వారాలుగా నామినేట్ కాకుండా ఉన్న సందీప్.. 8వ వారంలో నామినేట్ అవ్వడం, అదే వారం ఎలిమినేట్ కావడం ఆసక్తికరంగా మారింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆట సందీప్ మీడియాతో మాట్లాడుతూ..
నేను 7 వారాలు నామినేషన్‌లో లేకపోవడమే నా ఎలిమినేషన్ కారణం. ఇంటిలోకి వెళ్లిన తర్వాత బిగ్‌బాస్ నాకు 5 వారాలపాటు ఇమ్యునిటీ ఇచ్చారు. బిగ్‌బాస్ హిస్టరీలోనే అది రికార్డు. 6వ వారం నుంచి నేను నిజాయితీగా ఆడాను. ఇంటిలో అందరితో కలిసి మెలిసి ఉన్నాను. సిట్యుయేషన్ బట్టి ఇంటి సభ్యుల మధ్య గొడవలు ఏర్పడుతున్నాయి అని ఆట సందీప్ అన్నాడు.

ఇంటిలో ఉండటానికి అర్హత లేని వారి గురించి మాట్లాడుతూ.. భోలే షవాలే, రతిక రోజ్ గురించి ఫైర్ అయ్యాడు. హీరో అనుకొంటున్న భోలే షవాలే పెద్ద జీరో అంటూ కామెంట్ చేశారు. రతిక రోజ్ వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి వచ్చినా పెద్దగా ఆడటంత లేదు. అలాగే శివాజీ కూడా ఏమీ ఆడటం లేదు అని ఆట సందీప్ చెప్పాడు.
ఇక అమర్ దీప్, అర్జున్ అంబటిని నావాళ్లు అనుకొన్నాను. కానీ వారిద్దరూ నాకు ద్రోహం చేశారు. నాతో ఉంటూ నా వెనుక దొంగటా ఆడారు. నేను వారిని నమ్మడం వల్ల ఇంటి నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఆ ఇద్దరి ద్వారా నేను వెన్నుపోటుకు గురయ్యాను. వారిని నమ్ముకోకుండా ఉండాల్సింది అని సందీప్ అన్నాడు.
రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ఫేక్, రియల్ అనే విషయాన్ని చెప్పలేను. ప్రశాంత్ వంద శాతం ఆట ఆడుతున్నాడు. ఇంటిలో తన వంతు ఆటను బాగా ఆడుతున్నాడు. ఫేక్ కాదు.. రియల్ అనే విషయం కాదు. నా కొడుకా అంటూ పల్లవి ప్రశాంత్‌ను అమరదీప్ అనడం సరికాదని చెప్పాను.
ఇంటిలో ఉన్న వాళ్లలో టాప్ 3 కంటెస్టెంట్లుగా ఉండే వారిలో ప్రియాంక జైన్, ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్ అని ఆట సందీప్ జోస్యం చెప్పారు. ప్రియాంక నిజాయితీగా గేమ్ ఆడుతున్నది. మైండ్ గేమ్‌తోపాటు ఫిజికల్ గేమ్స్ కూడా చక్కగా ఆడుతున్నది అని ఆట సందీప్ చెప్పారు.
బిగ్‌బాస్ తెలుగు 7 ఉల్టా పుల్టా సీజన్. ఎవరు ఎప్పుడు ఉంటారో.. ఎవరు ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో తెలియదు. నేను మళ్లీ ఇంటిలోకి వెళ్లడానికి అవకాశం ఉంది. త్వరలోనే నేను వెళ్లినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. నా వంతు ఆటను నేను ఆడాను. మీరు ప్రేమగా ఓట్లు వేసి నన్ను బయటకు రప్పించుకొన్నారు అని ఆట సందీప్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











