Bigg Boss Telugu 7 Week 8th Elimination గురూజీకి ఓటింగ్ వార్ వన్‌సైడ్, టాప్ 5 కంటెస్టెంట్లపై ఎలిమినేషన్ కత్తి!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో 8వ వారం ఎలిమినేషన్ మోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా మారబోతున్నదనే విషయం తాజాగా జరుగుతున్న ఓటింగ్ ద్వారా స్పష్టమవుతున్నది. ఇప్పటి వరకు అంతా లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతున్నారని అనుమానాలు వ్యక్తం చేసిన వారికి బిగ్‌బాస్ జవాబు ఇవ్వబోతున్నారా? అనే విధంగా ఓటింగ్ జరుగుతున్నది. ఈ వారం టాప్ 5లో ఉంటారని భావించిన కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుట్ ఖాయమని అభిప్రాయం, సర్వేలు వ్యక్తమవుతున్నాయి. 8వ వారం ఎలిమినేషన్‌కు సంబంధించిన 3వ రోజు ఓటింగ్ వివరాల్లోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో 8వ వారం ఎన్నడూ లేని విధంగా టాప్ కంటెస్టెంట్లు నామినేట్ అయ్యారు. ప్రస్తుత వారంలో మొత్తం 8 మంది నామినేట్ అయ్యారు. నామినేషన్‌లో ఉన్న వారిలో శివాజీ, భోలే షవాలే, అమర్ దీప్, అశ్వినీ, గౌతమ్ కృష్ణ, ప్రియాంక జైన్, శోభా శెట్టి, ఆట సందీప్ ఉన్నారు.

బిగ్‌బాస్ తెలుగు 8వ వారం నామినేషన్స్ ముగిసిన వెంటనే భారీగా ఓటింగ్ నమోదైంది. వార్ వన్‌సైడ్ అనే విధంగా శివాజీకి భారీగా ఓటింగ్ జరుగుతున్నది. శివాజీ ఒక్కడికే ఓటింగ్‌లో 50 శాతం ఓట్లు పడితే.. మిగితా వారందరూ 50 శాతం ఓట్ల కోసం పోటీ పడుతున్నారు. శివాజీకీ భారీ ఓటింగ్ జరగడం వెనుక అనేక కారణాలు వినిపిస్తున్నాయి.
శివాజీ తర్వాత రెండోస్థానంలో భోలే షవాలే ఓ మోస్తారు ఓటింగ్‌తో ఆకట్టుకొంటున్నారు. భోలే షవాలే గతవారం కూడా బెటర్ ఓటింగ్ సాధించడం తెలిసిందే. ఈ వారం భోలే షవాలే 16 శాతం ఓటింగ్‌ను సాధించారు. ఇక మూడో స్థానంలో అమర్ దీప్ 13 శాతం, అశ్వినీ శ్రీ 7 శాతం, గౌతమ్ యావర్ 6 శాతం, ప్రియాంక జైన్ 5 శాతం, శోభా శెట్టి 5 శాతం, ఆట సందీప్ 4 శాతం ఓటింగ్‌తో చివరి స్థానంలో నిలిచారు.

శివాజీకి భారీగా ఓటింగ్ జరగడం వెనుక గల కారణాల్లోకి వెళితే.. టాప్ కంటెస్టెంట్లు యావర్, పల్లవి ప్రశాంత్ నామినేషన్స్‌లో లేకపోవడమే. ఈ ఇద్దరి ఓట్లు శివాజీకి పడుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అంతేకాకుండా కొంత భోలే షవాలే కూడా కొంత సాయం చేస్తున్నట్టు తెలుస్తున్నది.
బిగ్‌బాస్ తెలుగులో 7వ సీజన్‌లో ఇప్పటి వరకు 7 గురు లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఆట సందీప్ చివరి స్థానంలో ఉండటంతో ఈ సీజన్‌లో తొలిసారి మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారా? అనే అభిప్రాయం కలుగుతున్నది. ఒకవేళ చివరి రోజు ఏదైనా బెటర్‌గా ఓటింగ్ జరిగితే సందీప్ సేఫ్ జోన్‌లోకి వెళ్లి శోభా శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.


Click it and Unblock the Notifications











