Bigg Boss Telugu 7: షాకింగ్ ట్విస్ట్... ఉల్టా పుల్టాగా మారిన ఓటింగ్... ఈసారి ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆసక్తిగా సాగుతోంది. గత సీజన్ల కంటే.. ఈ సీజన్ ఉల్టా పుల్టాగా సాగుతోంది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా.. ప్రేక్షకులకు షాక్ లు, ట్విస్టులు ఇస్తూ.. బిగ్ బాస్ షో ఎంటర్ టైన్ చేస్తోంది. ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న కంటెస్టెంట్స్... ఓటింగ్ రిజల్ట్స్ బయటకు వచ్చాయి. మరి అందులో డేంజర్ జోన్ లో ఉన్నది ఎవరు.. సేఫ్ జోన్ లో ఉన్నది ఎవరు.. ఇక ఎలిమినేట్ అయ్యేది ఎవరో ఈ స్టోరీలో చూద్దాం.
బిగ్ బాస్ తెలుగు 7 రియాలిటీ షో 8వ వారంలోకి ఎంటర్ అయి సక్సెస్ ఫుల్ గా సాగుతోంది. అంతే కాదు.... 7 వారాల పాటు కొనసాగిన ఈ షో... ప్రస్తుతం రెండో చివరి దశకు విజయవంతంగా చేరుకుంది. ఇక 100 రోజుల గేమ్ షోలో 50 రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకోగా... ఇక గత 7 వారాల్లో కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక రోజ్, నయని పవని, పూజా మూర్తి ఈ షో నుంచిఎలిమినేట్ అయ్యారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ కు నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తి అయిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ తెలుగు 7 హౌస్ లో 8వ వారం నామినేషన్స్ ప్రేక్షకులకు హీటెక్కించాయి. కంటెస్టెంట్ల మధ్య పెద్ద గొడవలు... జరగ్గా ఒకరి తప్పులను మరొకరు ఎత్తిచూపుకున్నారు. ముఖ్యంగా బోలేషవాలి, శోభా శెట్టి మధ్య పెద్ద గొడవే తలెత్తింది. ఇక మొత్తానికి 8వ వారం నామినేషన్ ప్రక్రియ హాట్ హాట్ గా సాగింది. బిగ్ బాస్ సీజన్ 7... 8వ వారం నామినేషన్‌లో మొత్తం 8 మంది కంటెస్టెంట్స్ ఉన్న సంగతి తెలిసిందే. వారిలో శివాజీ, అమర్ దీప్, ప్రియాంక జైన్, శోభాశెట్టి, భోలే షవాలే, అశ్వినీ శ్రీ, ఆట సందీప్ నామినేట్ అయ్యారు. దాంతో ఈ వారం ఇంటిలోని టాప్ కంటెస్టెంట్లందరూ నామినేట్ కావడం ఆసక్తి కలిగిస్తోంది.
ఇక 8వ వారం నామినేషన్లో ఉన్న వారిలో టాప్ రేంజ్ లో సీనియర్ హీరో శివాజీ ఉన్నారు. సీరియల్ హీరో అమర్ దీప్, డాక్టర్ గౌతమ్ కృష్ణ నిలిచారు. ఇక ప్రియాంక జైన్ తదుపరి స్థానంలో ఉంది. అయితే ఈ వారం బోలే షవాలి ఎలిమినేట్ అవుతాడు అనుకంటే... ఆయనకు షాకింగ్ ఓటింగ్ పడుతోంది. ప్రస్తుతం బోలే షవాలి 5వ స్థానంలో సేఫ్ జోన్ లోనే ఉన్నారు. ఒకనొక స్టేజ్ లో ఆయన రెండో స్థానంలో ఉండి అందరికీ షాక్ ఇచ్చాడు. బోలేకి ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అనే రేంజులో ఓటింగ్ పడింది.

బోలే స్థానం తర్వాత ఆట సందీప్ ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు నామినేషన్స్ కి రాకుండా ఆటను ఆడుతున్నాడు. గత 7వారాలుగా ఆయన నామినేషన్స్ లోకి అడుగుపెట్టకుండా కొత్త రికార్డు సృష్టించాడు. ఇప్పుడు 8వ వారంలో ఆయన నామినేట్ అయ్యాడు. ఇక ఆయన ఆరో స్థానంలో ఉన్నారు. ఇక డేంజర్ జోన్ లో మాత్రం ఇద్దరు బ్యూటీలు ఉన్నారు. అందులో టాప్ కంటెస్టెంట్ శోభా శెట్టి ఉండటం మరోవైపు షాకింగ్ గా అనిపిస్తుంది.
ఇక ఈ వారం శోభా శెట్టి తర్వాత చివరి స్థానంలో అశ్విని శ్రీ ఉంది. ఈ బ్యూటీ ఈవారం ఎలిమినేట్ అవ్వనుందని అంటున్నారు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ 7 వారాలుగా ఫీమేల్ కంటెస్టెంట్స్ ను ఎలిమినేట్ చేస్తూ వస్తున్న బిగ్ బాస్.. ఈ వారం కూడా మరో ఫీమేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











