Bigg Boss Telugu 7 week 8th Elimination డేంజర్ జోన్‌లో ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్.. అతడికి సూపర్ ఓటింగ్!

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో 8వ వారంలోకి ప్రవేశించింది. 7 వారాలపాటు కొనసాగిన షో ప్రస్తుతం రెండో చివరి దశకు చేరుకొన్నది. 100 రోజుల గేమ్ షోలో 50 రోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకొన్నది. అయితే 8వ వారం ఎలిమినేషన్ కోసం బిగ్‌బాస్ హౌస్ సిద్దమైంది. ఈ వారం ఎలిమినేషన్ కోసం నామినేషన్ ప్రక్రియ తీవ్ర గందరగోళాల మధ్య ముగిసింది. అయితే తొలి రోజు నుంచి భారీగా ఓటింగ్ నమోదు అవుతున్నది. ఈ ఓటింగ్ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 7లో ఎలిమినేషన్ ప్రక్రియ అత్యంత చర్చనీయాంశమవుతున్నది. గత 7 వారాల్లో ఎలిమినేట్ అయిన వారిలో అందరూ లేడీ కంటెస్టెంట్స్ కావడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. తొలి వారం కిరణ్ రాథోడ్, షకీలా, సింగర్ దామిని, రతిక రోజ్, నయని పవని, పూజా మూర్తి ఎలిమినేట్ అయ్యారు.

Bigg Boss Telugu 7 Week 8th Eliminations

బిగ్‌బాస్ తెలుగు 7 ఇంటిలో 8వ వారం నామినేషన్ ప్రక్రియ కంటెస్టెంట్ల మధ్య తీవ్ర వాగ్వాదం మధ్య జరిగింది. ముఖ్యంగా భోలే షవాలే, ప్రియాంక జైన్, శోభా శెట్టి మధ్య జరిగిన సంభాషణ ఇంటిని వేడెక్కించింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌తో మరికొందరి ఇంటి సభ్యుల వాదన నామినేషన్ ప్రక్రియను మరింత హీటెక్కించింది.

కంటెస్టెంట్ల ఆరోపణలు, విమర్శలు, ప్రత్యారోపణలు మధ్య 8వ వారం నామినేషన్ ప్రక్రియ ముగిసింది. 8వ వారం నామినేషన్‌లో మొత్తం 8 మంది మెంబర్స్ నామినేట్ అయ్యారు. శివాజీ, అమర్ దీప్ చౌదరీ, ప్రియాంక జైన్, శోభాశెట్టి, భోలే షవాలే, అశ్వినీ శ్రీ, ఆట సందీప్ నామినేషన్‌లో ఉన్నారు. దాంతో ఈ వారం ఇంటిలోని టాప్ కంటెస్టెంట్లందరూ నామినేట్ కావడం ఆసక్తికరంగా మారింది.

Ashwini Sree, Shobha Shetty, Aata Sandeep in danger zone

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో 8వవారం నామినేషన్ ఓటింగ్ హాట్ హాట్‌గా మొదలైంది. అత్యధికంగా శివాజీ టాప్ రేంజ్‌లో 50 శాతం ఓటింగ్ నమోదు చేసుకొన్నారు. ఆ తర్వాత భోలే షవాలే రెండో స్థానంలో 15 శాతానికిపైగా ఓటింగ్ తెచ్చుకొన్నారు. ఆ తర్వాత అమర్ దీప్ 10 శాతం, గౌతమ్ కృష్ణ 6 శాతానికిపైగా, ప్రియాంక జైన్ ఆరు శాతం, అశ్వీని శ్రీ 6 శాతం, శోభా శెట్టి 4 శాతం, ఆట సందీప్ 2 శాతం ఓటింగ్‌తో కొనసాగుతున్నారు.

బిగ్‌బాస్ తెలుగు 7 షోలో తొలిసారి ఆట సందీప్ నామినేషన్‌లోకి వచ్చారు. పవర్ అస్త్రను సొంతం చేసుకొని దాదాపు 5 వారాలు సేఫ్ జోన్‌లో ఉన్నారు. ఆ తర్వాత కెప్టెన్సీతో నామినేషన్‌లో లేకుండా పోయారు. దాంతో ఆయన ఓట్లు వేసే ఫాలోవర్స్ లేకుండా పోయారు. తాజాగా తొలిసారి నామినేట్ అయ్యారు. దాంతో ఆయనకు ఓటింగ్ అతితక్కువగా ఓటింగ్ జరుగుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X