Bigg Boss Telugu 7 Nominations శివాజీపై విరుచుకుపడ్డ శోభాశెట్టి..భోలేను టార్గెట్ చేసిన ప్రియాంక జైన్

బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షో రంజుగా సాగుతున్నది. ఉల్టా పుల్టాగా పేర్కొంటున్న ఈ షో అనేక ట్విస్టులతో కొనసాగుతూ 8వ వారంలోకి ప్రవేశించింది. 7వ వారం ఎలిమినేషన్ తర్వాత మరోసారి నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ వారం నామినేషన్‌లో శోభాశెట్టి, ప్రియాంక జైన్‌కు శివాజీ, భోలే షవాలేకి మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. నామినేషన్ ప్రక్రియలో వారి మధ్య జరిగిన సంభాషణ వివరాల్లోకి వెళితే...

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో వరుసగా లేడీ కంటెస్టెంట్లు ఎలిమినేట్ అవుతున్నారు. గత ఏడు వారాల్లో 7 గురు లేడీ కంటెస్టెంట్లు ఇంటి నుంచి బయటకు వెళ్లారు. బిగ్‌బాస్ చరిత్రలో వరుసగా ఏడుగురు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం చర్చనీయాంశవుతున్నది. తాజాగా వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి వచ్చిన పూజా మూర్తి ఎలిమినేట్ కావడం జరిగింది.

Bigg Boss Telugu 7 Week 8th Nominations: Heavy fight between Shivaji, Shobha Shetty and Bhole Shavale

ఇంటిలో నామినేషన్ల ప్రక్రియను ప్రారంభిస్తూ.. హౌస్‌లో ఉండటానికి అర్హత లేని ఇద్దరు వ్యక్తుల ఫోటోలను మంటల్లో వేసి నామినేట్ చేయమని బిగ్ బాస్ చూపించారు. ఈ నేపథ్యంలో ఇంటిలో నామినేషన్ల సందర్భంగా గతవారం ప్రియాంక, శోభాశెట్టికి భోలే షవాలేకి మధ్య జరిగిన గొడవ ప్రధాన పాయింట్‌గా మారింది. కంటెస్టెంట్లు వాదనలతో నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది.

నామినేషన్ ప్రక్రియ సందర్భంగా శోభాశెట్టిని ఉద్దేశించి శివాజీ మాట్లాడుతూ.. భోలే షవాలే భూతులతో తప్పుగా మాట్లాడారు. అది 200 శాతం తప్పే. వెంటనే ఆయన సర్దుకొని క్షమించమని అడిగాడు. మన తోటి మనిషే కదా.. క్షమిస్తే ఏమౌతుంది అని శివాజీ అంటే.. మీకు క్షమించే మనసు ఇచ్చారు. నాకు క్షమించే మనసు ఇవ్వలేదు అని శోభాశెట్టి అంది. దాంతో నీవు మారమనే హక్కు గానీ. మార్చాలన్న కోరిక గానీ నాకు లేదు అంటూ శోభాను శివాజీ నామినేట్ చేశారు.

Bigg Boss Telugu 7 Week 8th Nominations: Heavy fight between Shivaji, Shobha Shetty and Bhole Shavale

ఇక నామినేషన్‌లో భాగంగా గౌతమ్ కృష్ణ, పల్లవి ప్రశాంత్ మధ్య గొడవ భారీగానే జరిగింది. పూజా ఏమన్నది.. ఒకసారి కెప్టెన్ అయ్యావు కదా అని గౌతమ్ ఏదో చెప్పబోతే.. బుక్‌లో ఏముందో చదివావా? అంటూ ప్రశాంత్ ప్రశ్నించాడు. నీవు నా ఫోటోను మంటలో వేశావే కాదా.. కానీ నా గుండెలో మంట మాత్రం వెలుగుతూనే ఉంటుంది అని ప్రశాంత్ అనడం కనిపించింది.

Bigg Boss Telugu 7 Week 8th Nominations: Heavy fight between Shivaji, Shobha Shetty and Bhole Shavale

నామినేషన్ల ప్రక్రియలో ప్రియాంక జైన్, భోలే షవాలే మధ్య వాగ్వాదం జరిగింది. గౌతమ్ అలా చేయి.. ఇలా చేయి అనడం సరికాదు. అలా అనడం నాకు రాదు అని ప్రియాంక సైగలు చేస్తూ అంటే.. నా బాడీ లాంగ్వేజ్ అలానే ఉంటుందని భోలే సమాధానం చెప్పారు. అయితే కంటెండర్ షిప్‌ అనేది చాలా పెద్దది.. దానిని నీవు పక్కన పడేశావు అని అంటే.. మీకు పాజిటివ్ యాటిట్యూబ్ ఇక రాదు అంటూ భోలే షవాలీ అనడం కనిపించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X