Bigg Boss Telugu 7 Eliminations ఉల్టాపల్టా ఓటింగ్.. డేంజర్ జోన్‌లో టాప్ 5 కంటెస్టెంట్.. మ్యాజిక్ జరిగితే కానీ!
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో అత్యంత కీలకమైన రెండో ఘట్టంలో సంచలన విషయాలు, ఆసక్తికరమైన, వినోదాత్మక సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. అయితే 8వ వారంలో స్ట్రాంగ్ కంటెస్టెంట్ నామినేట్ అయిన తర్వాత ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ ఇంట్రెస్టింగ్ సాగింది. అయితే ఈ వారం ఇంటిలోని స్ట్రాంగ్ కంటెస్టెంట్లు నామినేట్ కావడంతో 9వ వారం ఎవరు నామినేట్ అవుతారనే ఆసక్తి నెలకొన్నది. ప్రస్తుతం వారంలో ఎవరెవరు నామినేట్ అయ్యారు? ఎవరు డేంజర్ జోన్‌లోకి వెళ్లారనే విషయంలోకి వెళితే..
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 8వ వారం తొలిసారి మేల్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కావడం ట్విస్టుగా మారింది. ఇప్పటి వరకు 7 వారాల్లో ఏడుగురు లేడీ కంటెస్టెంట్లు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో ఈ సారి కూడా శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందా? అనే అనుమానం కలిగింది. అయితే బలమైన కంటెస్టెంట్ ఆట సందీప్ ఎలిమినేట్ కావడం అభిమానులను నిరాశకు గురిచేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో ప్రారంభమైన నామినేషన్ ప్రక్రియ గొడవ గొడవగా ముగిసింది. ఒకరికొకరు ఆగ్రహావేశాలతో నామినేట్ చేసుకొన్నారు. మొత్తం 8 మంది నామినేట్ అయినట్టు బిగ్‌బాస్ ప్రకటించారు. 9వ వారం అమర్ దీప్, శోభాశెట్టి, ప్రియాంక జైన్, రతిక రోజ్, అర్జున్ అంబటి, టేస్టీ తేజ, భోలే షవాలే, ప్రిన్స్ యావర్ నామినేట్ అయ్యారు. దాంతో ఈ వారం ఓటింగ్ ఆసక్తికరంగా మారింది.

ఇక నామినేషన్ ప్రక్రియ అధికారికంగా ముగియగానే ఓటింగ్ భారీగా కొనసాగుతూ కనిపించింది. ఈ వారం నామినేషన్‌లో ఉన్న వారిలో ప్రిన్స్ యావర్‌కు అత్యధికంగా ఓట్లు నమోదు అవుతున్నాయి. యావర్కు 23 శాతం, ఆ తర్వాత భోలే షవాలేకు 19 శాతం ఓటింగ్, అమర్ దీప్‌కు 17 శాతం, రతిక రోజ్ 11 శాతం, అంబటి అర్జున్‌కు 10 శాతం, ప్రియాంక జైన్‌కు 9 శాతం, టేస్టీ తేజాకు 8 శాతం, శోభాశెట్టికి 5 శాతం ఓటింగ్ నమోదైంది.

బిగ్‌బాస్ తెలుగు 7 సీజన్‌లో 8వ వారంలో శోభా శెట్టి ఎలిమినేట్ అయినంత పని జరిగింది. ఇంటిలో ఉండే అనర్హత లేదనే విషయం నుంచి తృటిలో తప్పించుకొన్నది. కానీ 9వ వారంలో కూడా శోభా శెట్టిపైనే ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నది. అయితే ఏదో ఒక మ్యాజిక్ జరిగితే కానీ ఆ కంటెస్టెంట్ ఎలిమినేషన్ నుంచి తప్పించుకోవడం కష్టం అని బిగ్‌బాస్ అభిమానులు పేర్కొంటున్నారు.


Click it and Unblock the Notifications











