Don't Miss!
- Sports RCB vs KKR: 500 టీ20 మ్యాచ్ ఆడబోతున్న ఐపీఎల్ స్టార్.. మ్యాన్ ఆఫ్ మెయిడెన్ ఓవర్స్
- News వైసీపీకి చిక్కిన లోకేష్ ట్వీట్..ఆ వెంటనే ఏం చేశారంటే..?
- Finance Gold Rate Today: బంగారం ప్రియులకు షాక్.. పెరిగిన ధర..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
- Automobiles రూ. 10 లక్షల ధరలో టాటా నెక్సాన్ AMT కొత్త వేరియంట్లు విడుదల.. వివరాలివే.!!
- Lifestyle Lok Sabha Election 2024:మరో 3 నెలల్లో పట్టాభిషేకం ఎవరికి? జ్యోతిష్యం ఏ పార్టీకి స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తోంది
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
బిగ్‌బాస్ సెలబ్రిటీలను కంటతడి పెట్టించిన సమంత.. ముప్పు నుంచి తప్పించుకొన్న అరియానా
బిగ్‌బాస్ తెలుగు హౌస్‌లో ఇంటిలో హోస్ట్‌గా సమంత అక్కినేని ప్రేక్షకుల మనసులను గెలుచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. అద్భుతంగా షోను ప్రజెంట్ చేయడంలో సమంత ఆకట్టుకొన్నారు. ఇంటి సభ్యులతో మాట,ముచ్చట కలిపేసి..వారికి చేరువయ్యారు. వారిలోని ఎమోషన్స్ బయట పెట్టేందుకు తనదైన శైలిలో రాణించారు. ఇంటిలో స్వయంవరం గేమ్‌ను కంటెస్టెంట్లతో ఆడిస్తూ..
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్
బిగ్‌బాస్ కంటెస్టెంట్‌లోని అమ్మాయిలకు స్వయంవరం నిర్వహించారు. మోనాల్, దివి, అరియానా, హారికను పెళ్లికూతుళ్లుగా, వారికి తండ్రిగా అమ్మా రాజశేఖర్, పెళ్లిళ్ల పేరయ్యగా లాస్యను నటించాలని కోరారు. ఇంటిలోని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్స్ ఆ నలుగురిని ఇంప్రెస్ చేయాలని చెప్పారు.
అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా
అఖిల్, అవినాస్, సోహైల్, అభిజిత్, మెహబూబ్ తమదైన రీతిలో మోనాల్, దివి, అరియానా, హారికను ఆకట్టుకొనేందుకు ప్రయత్నించారు. పాటలు, డైలాగ్స్, డ్యాన్సు ల్లాంటి తమ ప్రతిభను చాటుకొన్నారు. ఈ స్వయంవరంలో అఖిల్‌ను నలుగురు అమ్మాయిలు ఇప్టపడ్డారు. దాంతో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఎన్నికయ్యాడు
కంటతడి పెట్టిన అఖిల్ సార్థక్
మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌గా ఎన్నికైన అఖిల్‌కు బిగ్‌బాస్ గిఫ్టు ఇచ్చారు. అఖిల్‌కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశాన్ని కల్పించారు. తల్లిదండ్రులు చెప్పిన వీడియోను చూసి అఖిల్ ఎమోషనల్ అయ్యారు. భోరున ఏడ్చేస్తుండటంతో లాస్య, మోనాల్ వచ్చి ఓదార్చారు.
మోనాల్, నోయల్ తమ ఇంటి సభ్యులతో
ఇక అదే విధంగా మోనాల్, నోయల్‌కు ఇంటి సభ్యులతో మాట్లాడే అవకాశం లభించింది. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ వారు భవోద్వేగానికి గురయ్యారు. మోనాల్ తల్లి, చెల్లెలితో మాట్లాడారు. నోయల్ తన సోదరుడు, తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.
Recommended Video
ఎలిమినేషన్ నుంచి అరియానా సేఫ్
ఇక ఇంటిలో ఈ వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లను సేవ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఓ కంటి బొమ్మను రెండు ముక్కలు చేసి ఆ రెండు ముక్కలు కచ్చితంగా సరిపోతే వారు ఎలిమినేషన్ సేవ్ అవుతారు అని చెప్పారు. నామినేషన్లో ప్రతీ ఒక్కరు వచ్చి ట్రై చేశారు. చివరకు అరియానా బొమ్మ మ్యాచ్ కావడంతో ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు.