Don't Miss!
- News కేసీఆర్‌కు ఎన్నికల సంఘం నోటీసులు
- Sports KKR vs RR: ఈ ఓటమి బాధ వర్ణాతీతం.. మాటలు రావడం లేదు: శ్రేయస్ అయ్యర్
- Lifestyle 30 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకునే వారు ఈ విషయాలు తప్పక గుర్తుంచుకోవాల్సిన విషయాలు
- Automobiles ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. ఇకపై ఓలా, ఉబర్, ర్యాపిడో యాప్‌ల్లో ఈ ఆప్షన్ ఉండదు.!!
- Technology ఎలోన్ మస్క్ StarLink ఇంటర్నెట్ ఇండియా లాంచ్ త్వరలోనే! ప్రభుత్వం ఆమోదించింది
- Travel Ramanarayanam Temple: విజయనగరంలోని ఈ రాములవారి ఆలయ ప్రత్యేకతలెన్నో..!
- Finance Market Closing: సెన్సెక్స్-నిఫ్టీ ఢమాల్.. మూడోరోజూ కొనసాగిన అమ్మకాల ఒత్తిడి..
హారిక లూజ్ అంటూ అవినాష్.. షటప్ అంటూ అభిజిత్‌పై అరిచిన హారిక.. అరియానా కంటతడి
బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో 43వ రోజున భావోద్వేగంతోపాటు కొంత గందరగోళంగా సాగింది. నామినేషన్ల ప్రక్రియ విషయంలో బిగ్‌బాస్ తన మార్కు చాటడంతో ఇంటి సభ్యుల మధ్య ఎమోషనల్ వాతావరణం నెలకొన్నది. ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ ఎలా సాగిందంటే..
హారిక లూజ్ అంటూ అవినాష్ కామెంట్
లూజుగా
ఉండే
టీషర్ట్
ధరించిన
లాస్యను
అవినాష్
ఆటపట్టించడం
ఫన్
క్రియేట్
చేసింది.
ఎక్కడ
కొన్నావు?
ఆఫర్ల
వచ్చిందా
అంటూ
అవినాస్
టీజింగ్
చేశాడు.
అయితే
టీషర్ట్
పొడుగ్గా
ఉందంటూ
కామెంట్
చేసింది.
పొడుగుగా
లేదు
అది
లూజ్‌గా
ఉందంటూ
అవినాష్
మరింత
ఆటపట్టించాడు.
అవినాష్‌కు
తోడుగా
సోహైల్,
అఖిల్
ఉండటంతో
టీజింగ్
మరింత
ఘాటుగా
మారింది.
నామినేషన్ల ప్రక్రియ ఇలా..
ఇక ఇంటిలో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఇద్దరేసి సభ్యులను స్టాండ్ వద్ద నిలబెట్టి వారిలో ఒకరు నామినేట్ అయ్యేలా.. మరొకరు సేవ్ అయ్యేలా నిర్ణయం తీసుకోవాలని చెప్పాడు. అలా అఖిల్, మోనాల్ ఒక జంటగా, అవినాష్-సోహైల్, అభిజిత్- హారిక, లాస్య- దివి వద్యా, అరియానా- మెహబూబ్ జంటలుగా స్టాండ్ వద్ద నిలబెట్టారు. నామినేట్ అయిన వ్యక్తిని రంగుతో ముంచెత్తాలి అంటూ నామినేషన్ రూల్స్ చెప్పారు.
అఖిల్ కోసం మోనాల్ నామినేషన్
అఖిల్ నేను స్ట్రాంగ్‌గా ఆడుతున్నాను కాబట్టి నీవే నామినేట్ కావాలని మోనాల్‌కు సూచించాడు. దాంతో మోనాల్ నామినేట్ అవ్వడానికి సిద్ధమైంది. ఇక అవినాష్, సోహైల్ మధ్య ఎక్కువ సేపు వాదన జరిగిన తర్వాత చివరకు అవినాష్ తనకు తాను నామినేట్ అవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇక లాస్య కోసం దివి నామినేట్ అయ్యింది.
అఖిల్, హారిక మధ్య వాగ్వాదం
అఖిల్, హారిక మధ్య నామినేషన్ విషయంపై ఇద్దరు చాలా సేపు చర్చించుకొన్నారు. ఇద్దరిలో ఒకరిని నామినేట్ కావాలని చెప్పడం సరికాదు అంటూ హారిక ఎమోషనల్ అయ్యాడు. అబిజిత్ ఏదో మాట్లాడబోతే షటప్ అంటూ అరిచింది. చివరగా అభిజిత్ నామినేట్ కావడానికి డిసైడ్ కావడంతో హారిక ఎమోషనల్ అయింది. నాకు ఇది నచ్చలేదు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అరియా, మెహబూబ్ మధ్య గొడవ
ఆ తర్వాత మెహబూబ్‌కు అరియానాకు మధ్య తానంటే తాను అని వాదించుకొన్నారు. అరియానాకు, మెహబూబ్‌కు మధ్య చాలా సేపు గొడవ జరిగింది. చివరకు మెహబూబ్‌పై సింపతి చూపించింది. మెహబూబ్ సహాయం కోరిన నేపథ్యంలో ఆయనకు హెల్ప్ చేయడానికి నేను నామినేట్ అవుతున్నానని అరియానా ప్రకటించింది.
అరియానాకు ఓదార్పు
అరియానా తనకు తాను నామినేట్ కావడం ఇంటి ఎమోషనల్‌గా మారింది. మెహబూబ్ తప్ప ఇంటి సభ్యులందరూ వచ్చి అరియానాను ఓదార్చారు. నీవు స్ట్రాంగ్ అంటూ అఖిల్, సోహైల్ అండగా నిలిచారు. లాస్య, మోనాల్ కూడా అరియానాకు సోపోర్టుగా ఉన్నారు. ఇలా ఇంటి సభ్యుల మధ్య నామినేషన్ ప్రక్రియ ఎమోషనల్గామారింది.