Bigg Boss Telugu 7: వైల్డ్ కార్డ్ ఎంట్రీలు నక్కతోక తొక్కేశారుగా.. ఆట ఆడకపోయినా ఆ విషయంలో ఫుల్ సపోర్ట్!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో అద్భుతంగా సాగుతోంది. ఇప్పటికే విజయవంతంగా 12 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో.. మరికొన్ని రోజుల్లో ముగియనుంది. అయితే ఈ షో ప్రారంభం అయిన మొదటి వారంలో 14 మంది కంటెస్టెంట్లను ఇంట్లోకి పంపారు. సెప్టెంబర్ 3వ తేదీన గ్రాండ్ గా శివాజీ, ఆట సందీప్, శోభా శెట్టి, అమర్ దీప్, శుభ శ్రీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక జైన్, గౌతమ్ కృష్ణ, టేస్టి తేజ, కిరణ్ రాథోడ్, షకీలా, ధామిని, రతికా రోజ్ లు ఇంట్లోకి అడుగు పెట్టారు. మొదటి నాలుగు వారాల్లో.. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్ లు ఇంట్లోంచి ఎలిమినేట్ అయిపోయారు.
ఆ తర్వాత రోజు గౌతమ్ కృష్ణను ఎలమినేట్ చేస్తున్నట్లు చెప్పి సీక్రెట్ రూంలో పంపించారు. ఈక్రమంలోనే ఐదుగురు వైల్డ్ కార్డ్ ఎంట్రీలోను ఐదో వారంలో లోపలికి తీసుకు వచ్చారు. వీరితో పాటు ముందు వారంలో ఎలిమినేట్ అయిన రతికా రోజ్ ను కూడా లోపలికి తీసుకువచ్చారు. గౌతమ్ కృష్ణ కూడా సీక్రెట్ రూంలోంచి ఇంట్లో చేరిపోయాడు. ఇలా మొత్తం ఇంట్లో 16 మంది అయ్యారు. ఇక్కడి నుంచి ఆట మరింత రసవత్తరంగా సాగుతూ వస్తోంది. అయితే ఐదో వారంలో ఇంట్లో అడుగు పెట్టిన వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఓ రకంగా అదృష్ట వంతులు కాగా మరో రకంగా దురదృష్ట వంతులు అని చెప్పొచ్చు.

ముందు నాలుగు వారాలు గేమ్ ఆడి కొనసాగుతూ వస్తున్న వాళ్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా లోపలికి వచ్చిన వాళ్లనే నామినేట్ చేయడం.. కొత్త వాళ్లను ప్రేక్షకులు కూడా త్వరగా అభిమానించారు. ఇలా వీళ్లకి పెద్ద స్థాయిలో నష్టం జరుగుతుంది. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలు లోపలికి వచ్చిన మొదటి రెండు వారాలు వాళ్లే ఎలిమినేట్ అయ్యారు. ముందుగా నయని పావని, ఆ తర్వాత పూజా మూర్తి ఇంటిని వదిలి పెట్టి వెళ్లిపోయారు. ఆ తర్వాత భోలె షవాళి కూడా బయటకు వచ్చాడు. త్వరగానే బయటకు వచ్చినా బిగ్ బాస్ మాత్రం వీళ్లకు స్పెషల్ సర్ ప్రైజ్ ఇచ్చారు.
ఎవరూ ఊహించని స్థాయిలో పేమెంట్లు (రెమ్యునరేషన్ అందజేశారు. మామూలుగా అయితే బిగ్ బాస్ లో ఉన్న వాళ్లకి ఎన్ని వారాలు ఉంటే అంత పేమెంట్ ఇస్తారు. ముందుగానే వారానికి ఇంత అని వాళ్లు మాట్లాడుకొని ఉండారు, ఎప్పుడు ఎలిమినేట్ అవుతారో తెలియదు కాబట్టి అలా ఫిక్స్ చేసుకుంటారు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ఇంట్లోకి వచ్చిన వాళ్లకు మాత్రం.. మొదటి వారం నుంచే పేమెంట్ ఇస్తామని ముందుగానే చెప్పారు. ముందు నాలుగు వారాలు వాళ్లు బయట ఉన్నప్పటికీ పేమెంట్ మాత్రం అందింది.
మొదటి నాలుగు వారాలు వీళ్లు ఆట ఆడకపోయినా పేమెంట్ మాత్రం ఫుల్లుగా ఇవ్వడంతోనే.. ఈ ఐదుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ఎంట్రీలుగా ఇంట్లోకి అడుగు పెట్టేందుకు ఓకే చెప్పారట. ఈ విషయాన్ని నేరుగా బిగ్ బాస్ ఎక్స్ కంటెస్టెంట్ భోలె షవాళియే చెప్పారు. తాజాగా అశ్విని కూడా ఎలిమినేట్ అవ్వడంతో ఈ వార్త మరోసారి వైరల్ గా మారింది. ఏది ఏమైనా ముందు ఇంట్లోకి వచ్చిన వాళ్లకంటే కూడా వీళ్లే పేమెంట్ ఎక్కువగా తీసుకున్నారు. ఇది మాత్రం వీళ్లకు ప్లస్సే.


Click it and Unblock the Notifications











