Bigg Boss Winner: మిస్‌డ్ కాల్ ఓటింగ్‌లో మోసం.. శివాజి, ప్రశాంత్‌కు బిగ్ షాక్.. ఆ తప్పు జరుగుతుందా!

తెలుగు బుల్లితెరపైకి వచ్చిన చాలా తక్కువ సమయంలోనే నెంబర్ వన్‌గా మారిన ఏకైక షోనే బిగ్ బాస్. అంతలా ఈ రియాలిటీ కార్యక్రమం ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొని సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఇందులో విభిన్నమైన కంటెంట్‌ను చూపిస్తూ నిర్వహకులు మజాను పంచుతున్నారు.

ఫలితంగా ఇది సూపర్ డూపర్ సక్సెస్‌ఫుల్‌గా సాగిపోతోంది. ఈ ఉత్సాహంతోనే ఇప్పుడు ఏడో సీజన్‌ను నడుపుతున్నారు. ఇది ఫినాలే వీక్‌కు చేరడంతో విన్నర్ ఎవరు అవుతారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా మిస్‌డ్ కాల్ ఓటింగ్ లీక్ అయింది. ఆ వివరాలు మీకోసమే!

Bigg Boss Telugu 7 Winner: Amardeep Chowdary Getting Huge Missed Call Votes in Finale Week

ఏడో సీజన్ విభిన్నంగా: బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు రావడంతో దీనిపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగానే దీన్ని కొత్త కంటెంట్‌తో నడుపుతూ వచ్చారు. ఫలితంగా ఇందులో ఎన్నో రకాల ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను ఇచ్చారు. ఫలితంగా దీనికి భారీ స్థాయిలో స్పందన లభించింది. దీంతో ఈ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది.

వాళ్లు అందరూ అవుట్: 7వ సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో ఫస్ట్ వీక్ కిరణ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారంలో నయని, 7వ వారంలో పూజా, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. 12వ వారం అశ్విని, రతిక, 13వ వారం గౌతమ్‌, 14వ వారం శోభాలు వెళ్లారు.

టాప్ 6.. 14వ వారంలో: ఏడో సీజన్‌లో భాగంగా బిగ్ బాస్ హౌస్‌లోకి వచ్చిన వారిలో 13 మంది ఎలిమినేట్ అయ్యారు. ఫలితంగా 14వ వారం ముగిసే సమయానికి ఆరుగురు మిగిలారు. వీళ్లను ఫైనలిస్టులుగా ప్రకటించారు. ఇక వీళ్లలో విజేతను నిర్ణయించడం కోసం 14వ వారం నుంచే ఫినాలే ఓటింగ్‌ను మొదలు పెట్టారు. అందులో తక్కువ ఓట్లు వచ్చిన శోభాను ఎలిమినేట్ చేసిన సంగతి తెలిసిందే.

హాట్‌స్టార్ ఓట్లలో టాప్: బిగ్ బాస్ ఏడో సీజన్‌ విన్నర్‌ను నిర్ణయించే ఓటింగ్ 14వ వారంలోనే మొదలైంది. ఇందులో ఆ వారంలో పల్లవి ప్రశాంత్ టాప్‌లో ఉన్నాడు. కానీ, 15వ వారం మొదలయ్యే సమయానికి శివాజి మొదటి స్థానానికి చేరినట్లు తెలిసింది. అయితే, ఇదంతా హాట్‌స్టార్ ఓట్లలోనే జరుగుతున్నట్లు సమాచారం. అంటే వీళ్లిద్దరిలోనే ఒకరు విన్నర్ అవుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

మిస్‌డ్ కాల్స్ మరోలా: హాట్‌స్టార్‌లో జరుగుతున్న ఓటింగ్ వివరాలు దాదాపుగా బయటకు వస్తున్నాయి. కానీ, మిస్‌డ్ కాల్స్ పోలింగ్ వివరాలు మాత్రం సస్పెన్స్‌గా మారాయి. దీంతో ఏం జరగబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ పరిస్థితుల్లో తాజాగా మిస్‌డ్ కాల్ ఓటింగ్ వివరాలు లీక్ అయ్యాయి. ఇందులో అమర్‌దీప్ చౌదరికి భారీగా ఓటింగ్ నమోదు అవుతున్నట్లు ఓ న్యూస్ బయటకొచ్చింది.

Bigg Boss Telugu 7 Winner: Amardeep Chowdary Getting Huge Missed Call Votes in Finale Week

ప్రశాంత్, శివాజికి షాక్: ఏడో సీజన్‌లో విజేతను నిర్ణయించే ఓటింగ్‌లో మిస్‌డ్ కాల్స్ కూడా చాలా ముఖ్యం. కానీ, ఇందులో పల్లవి ప్రశాంత్, శివాజికి చాలా తక్కువ ఓటింగ్ నమోదు అవుతున్నట్లు తెలిసింది. దీనికి కారణం వీళ్లిద్దరి నెంబర్స్‌ సరిగా కలవకపోవడమే అని సమాచారం. కాల్స్ ద్వారా ఒక ఓటే వేయాలని తెలియని చాలా మంది పదే పదే కాల్ చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.

వాళ్లిద్దరికీ బాగా తక్కువ: ప్రస్తుత మిస్‌డ్ కాల్ ఓటింగ్ ట్రెండ్‌ను బట్టి చూస్తే.. అమర్‌దీప్ చౌదరి టాప్‌లో ఉన్నాడని ఆ తర్వాత శివాజి రెండో స్థానంలో కొనసాగుతున్నాడని తెలిసింది. ఇక, ఇందులో పల్లవి ప్రశాంత్ మూడో స్థానంలోనూ, ప్రిన్స్ యావర్ నాలుగో స్థానంలోనూ, అంబటి అర్జున్ ఐదో స్థానంలోనూ, ప్రియాంక జైన్ ఆరో స్థానంలో ఉన్నట్లు బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X