Bigg Boss Telugu 7 Winner: ఆ ఒక్క మిస్టేక్‌తో అమర్​దీప్ గ్రాఫ్ డౌన్... విన్నర్ కన్మార్మ్.. రన్నర్ ఎవరంటే?

బిగ్ బాస్ తెలుగు 7 మరో 9రోజుల్లో ముగియనుంది. ఇక చివరి దశకు వచ్చేసింది. ఇక విన్నర్ ఓటింగ్ కూడా మొదలు అయింది. అయితే ఈసారి సీజన్ విన్నర్ రేసులో అమర్ దీప్, శివాజీ, ప్రశాంత్ పోటీపడుతున్నాయి. అయితే అమర్ దీప్ కెప్టెన్ అయ్యాకా చేసిన ఆ మిస్టేక్స్.. ఆయన్నీ కెప్టెన్సీ రేసు నుంచి తప్పించేశాయి. ఇక ఈసారి సీజన్ విన్నర్ ఎవరు... ఎవరికి ఓటింగ్ బాగుంది.. ఇక రన్నరప్ ఎవరు కానున్నారు అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 ఆసక్తి పెంచుతోంది. ఇక మరో 9 రోజుల్లో ఈ సీజన్ కు ఎండ్ కార్డ్ పడనుంది. ఇక ఈ సీజన్ సెప్టెంబర్ 3న ప్రారంభం అయి.. డిసెంబర్ 17న ముగియనుంది. ఇక ఈ సీజన్ లో మొదట 14 మంది కంటెస్టెంట్స్ లోపలకి వెళ్లారు. ఇక ఐదో వారంలో మరో ఐదుగురు కంటెస్టెంట్స్ వెళ్లారు. మొత్తం హౌస్ లోకి 19 మంది కంటెస్టెంట్స్ వెళ్లగా.. ప్రస్తుతం 7 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక వీరిలో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్ అనేది ఆసక్తిగా మారింది.

Bigg Boss Telugu 7 Winner And Runner Confirm and Amardeep Graph Day by Day Down Full Details Here

ఇక ఇప్పటి వరకు హౌస్ నుంచి కిరణ్ రాథోడ్, షకీలా, దామిని, రతికా రోజ్, శుభ శ్రీ, నయని పవని, పూజా మూర్తి ఇలా వరుసగా 7వారాలు ఫీమేల్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఇక 8వ వారంలో మొదటి సారిగా మేల్ కంటెస్టెంట్ ఆట సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ఇక ఆ తర్వాత టేస్టీ తేజ, బోలే షవాలి, రతికా రోజ్, అశ్వినీ శ్రీలు ఎలిమినేట్ అయ్యారు. ఇక 13వ వారం గౌతమ్ ఎలిమినేట్ అవ్వగా హౌస్ లో 7మంది మిగిలారు.

హౌస్ లో ప్రస్తుతం అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి, శివాజీ, యావర్, ప్రశాంత్, అర్జున్ అంబటి ఉన్నాడు. ఇక ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ కానున్నారని తెలుస్తోంది. విన్నర్ ఓటింగ్ లైన్స్ మొదలు అయ్యాయి. ఇక విన్నర్ ఓటింగ్ ఒకసారి చూస్తే.. మొదటి ప్లేస్ లో ప్రశాంత్, రెండో ప్లేస్ లో శివాజీ, మూడో ప్లేస్ లో అమర్దీప్ ఉన్నాడు. ఇక నాలుగవ ప్లేస్ లో యావర్, ఐదో ప్లేస్ లో ప్రియాంక ఉండగా.. ఆరో ప్లేస్ లో అర్జున్ అంబటి, ఏడో ప్లేస్ లో శోభా శెట్ట ఉంది.

ఇక ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ కానుందని తెలుస్తోంది. ఇక ఆ విషయం పక్కన పెడితే.. గత వారం అమర్ దీప్ కు నాగార్జున కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించాడు. ఇక ఆ కెప్టెన్సీ రావడంతోనే అమర్ లో చాలా మార్పులు వచ్చాయని.. పిచ్చిగా ప్రవర్తిస్తున్నడని అంటున్నారు. అమర్ దీప్... మళ్లీ ప్రశాంత్ తో గొడవ పడటం వల్లే ఆయన గ్రాఫ్ తగ్గినట్లు తెలుస్తోంది. విన్నర్ అవుదామని వచ్చిన అమర్ కు ప్రశాంత్ తో గొడవతో ఆయన్ని కిందకు దిగజార్చింది.

మళ్లీ ఫినాలేకి ముందు ప్రశాంత్ తో అమర్ గొడవ.. మళ్లీ ఆయన విన్నర్ రేసు నుంచి ఔట్ అయ్యేలా చేసింది.ఇక ఈ సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ అయ్యే చాన్స్ కనిపిస్తుండగా.. రన్నరప్ శివాజీ అయ్యే అవకాశం ఉంది. ఇక అమర్ దీప్ మూడో స్థానానికి పరిమితం కానున్నారు. ఆయన ప్రవర్తన ఫినాలేకి ముందు ఇలా చేంజ్ అవుతుందని ఎవరు ఊహించనిది. చూడాలి మరి ఏం జరగనుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X