Bigg Boss Telugu 7: ఈ సీజన్ విన్నర్ ఒకరు.. ప్రైజ్ మనీ మరొకరికి.. ఇది కదా అసలైన ఉల్టాపుల్టా అంటే?
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షో ఏ ముహూర్తాన ప్రారంభం అయిందో తెలియదు కానీ... అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకెళ్తోంది. ఉల్టాపుల్టా కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సీజన్.. బుల్లితెర ప్రేక్షకులను అలరించడంలో ముందుంటుంది. రాత్రి 9 గంటలు అయిందంటే చాలు బిగ్ బాస్ షో ప్రియులు అంతా టీవీల ముందు వాలిపోతున్నారు. నామినేషన్లు, ఎలిమినేషన్లను ఎవరూ మిస్ కాకుండా చూస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ విన్నర్ ఎవరు అనే దానిపై ఒక్కో వారం ఒక్కో పేరు వినిపిస్తోంది. ఫ్యామిలీ వీక్ కు ముందు శివాజి విన్నర్ గా నిలుస్తాడని అంతా అనుకున్నారు.
కానీ ఆ తర్వాత వారం నుంచి అంతా అమర్ దీప్ గెలుస్తాడని భావించారు. రోజురోజుకూ ఆయన గ్రాఫ్ పెరగడంతో అంతా అదే నిజమని అనుకున్నారు. ముఖ్యంగా రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను కార్నర్ చేసిన విపరీతంగా ఆర్గుమెంట్ చేసిన అమర్ దీప్ కు విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. అలాగే పల్లవి ప్రశాంత్ కు సపోర్టింగ్ గా నిలిచిన శివాజి అంటే అందరూ ఇష్ట పడడం ప్రారంభించారు. ఇక అప్పటి నుంచి అందరితో చక్కగా ఉంటూ ఏవైనా తప్పులు చేస్తుంటే చెప్పిన శివాజి ఇంటికి పెద్దన్నలా మారిపోయాడు.

కానీ ఫ్యామిలీ వీక్ తర్వాతి వారం ఆయనకు విపరీతమైన నెగిటివిటీ వచ్చింది. కావాలనే బిగ్ బాస్ ఆయనను నెగిటివ్ చేస్తున్నారనే టాక్ కూడా నడిచింది. అమర్ దీప్ కు కెప్టెన్సీ ఇవ్వకపోవడం.. ఆయన విపరీతంగా ఏడవడంతో శివాజికి మరింత నెగిటివిటీ వచ్చింది. కానీ ఈ వారం నామినేషన్స్ టాస్క్ తో మాత్రం మరోసారి అమర్ దీప్ గ్రాఫ్ పడిపోయింది. అందుకు కారణం కూడా.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ ను మరోసారి నామినేట్ చేయడం. అందుకు కారణం కూడా చాలా సిల్లీగా ఉండడం. శివాజి అన్న చెబితే వినడం సరికాదంటూ ఆయన చెప్పిన మాటలను ప్రేక్షకులకు అంతగా తీసుకోలేకపోయారు.
ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ వాళ్లు అందకూ శివాజిని టార్గెట్ చేయడంతో మరోసారి ఆయన అభిమానులు ఓటింగ్ ను పెంచేశారు. ఎప్పటి లాగే పల్లవి ప్రశాంత్ టాప్ లో ఉండగా.. శివాజి రెండో స్థానంలో ఉన్నాడు. కానీ ఈసారి సీజన్ విన్నర్ మాత్రం శివాజియే అవుతాడని అంతా అనుకుంటున్నారు. అలాగే రైతుబిడ్డ రన్నరప్ గా నిలవగా.. అమర్ దీప్ మూడో స్థానంలోనే ఉంటాడని తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో ఇంటి నుంచి ఎలిమినేట్ అయిపోయిన సందీప్ మాస్టర్ ఓ షాకింగ్ విషయం చెప్పాడు.

ఈ సీజన్ విన్నర్ గా శివాజి గెలుస్తారని అలాగే రన్నరప్ గా పల్లవి ప్రశాంత్ ఉంటాడని తెలిపారు. ఇదంతా మీకెలా తెలుసంటే.. నాకన్నీ అలా తెలిసిపోతాయంటూ సందీప్ మాస్టర్ తప్పించుకున్నారు. అలాగే ఈ సీజన్ విన్నర్ గా శివాజి గెలుస్తాడని.. కానీ ప్రైజ్ మనీ మాత్రం పల్లవి ప్రశాంత్ సొంతం అవుతుందని అన్నాడు. ఇదెలా అవుతుందని అడగ్గా.. రైతుబిడ్డ కష్టం శివాజి అన్నకు తెలుసని.. కాబట్టి ఆయన ఆ ప్రైజ్ మనీని అతడికే ఇచ్చేస్తాడంటూ విరించాడు. మరి ఏం జరగనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











