Pallavi Prashanth రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అక్రమం.. నాగార్జునపై కేసు పెట్టండి.. ఛీఫ్ జస్టిస్‌కు లేఖ
బిగ్‌బాస్ తెలుగు 7 విజేత పల్లవి ప్రశాంత్ అరెస్ట్ సంచలనం రేపింది. గ్రాండ్ ఫినాలే తర్వాత కొందరు అల్లరి మూకలు జరిగిన దాడిలో ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగిన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో సీపీఐ సీనియర్ నేత నారాయణ స్పందించారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ గురించి మాట్లాడుతూ..
Recommended Video

బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షో పేరుతో పేదవాళ్లకు నిర్వాహకులు చాలా అన్యాయం చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ అనే రైతుబిడ్డను ఈ షోకు సెలెక్ట్ చేసి ఇంట్లో పెట్టారు. ఈ షోలో బాగా ఆడినందుకు విజేతగా ప్రకటించారు. ఆయనను విన్నర్‌గా ప్రకటించడం కూడా ఉద్దేశపూర్వకమే. రైతులను ఆకట్టుకోవడం కోసం ఈ ప్లాన్ చేస్తే చేసుకోనివ్వండి అని సీపీఐ నేత నారాయణ అభిప్రాయపడ్డారు.

డిసెంబర్ 17వ తేదీన జరిగిన గ్రాండ్ ఫినాలే తర్వాత పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చిన క్రమంలో ఊరేగింపు చేశారు. ఆ సందర్భంగా కొన్ని గొడవలు, బస్సులపై రాళ్లు రువ్వారు. ఆ సంఘటన నేపథ్యంలో ప్రశాంత్‌పై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అక్రమం అని ఆయన ఖండించారు.
బిగ్‌బాస్ తెలుగు 7 ఫినాలే తర్వాత జరిగిన సంఘటన తర్వాత బిగ్‌బాస్ నిర్వాహకులు, హోస్ట్ అక్కినేని నాగార్జునపై కేసులు పెట్టకుండా పల్లవి ప్రశాంత్‌పై కేసు పెట్టడం ముమ్మాటికి తప్పు. పోలీసులు కూడా బిగ్‌బాస్ నిర్వాహకులకు ఏజెంట్‌గా పనిచేస్తున్నారు సీపీఐ నారాయణ ఆరోపించారు.
చంచల్‌గూడ్ జైల్లో ఉన్న పల్లవి ప్రశాంత్‌ను వెంటనే విడుదల చేయాలి. బిగ్‌బాస్ నిర్వాహకులు, నాగార్జునపై కేసు నమోదు చేయాలి అని తెలంగాణ చీఫ్ జస్టిస్‌కు లేఖ రాశారు. బిగ్‌బాస్ షో వెనుక చాలా దురాగతాలు ఉన్నాయి. రైతుబిడ్డ అన్యాయం అయ్యారు. రైతు బిడ్డకు అందరూ అండగా నిలువాల్సిన బాధ్యత ఉంది. ప్రశాంత్ విడుదల కోసం మనమంతా ఫైట్ చేయాలని పిలుపు నిచ్చారు.

ఇదిలా ఉండగా, తెలుగు బిగ్‌బాస్ స్టార్ట్ అయినప్పటి నుంచి సీపీఐ నారాయణ తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. గత ఏడేళ్లుగా అనేక మార్లు ఈ షోపై ఫిర్యాదుల చేశారు. మీ ఇంట్లో పిల్లలను ఈ షోకు పంపిస్తారా? అంటూ హోస్ట్ నాగార్జునపై ఘాటుగా స్పందించిన దాఖలాలు ఉన్నాయి. తాజాగా పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ను ఖండిస్తూ లేఖ రాశారు.


Click it and Unblock the Notifications











