Pallavi Prashanth Arrested బిగ్‌బాస్ తెలుగు 7 విజేత అరెస్ట్.. ఎక్కడ? ఎందుకంటే?
సంచలనంగా మారిన బిగ్‌బాస్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయ్యాడు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొల్గూరులోని అతని నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అన్నపూర్ణ స్టూడియో దగ్గర జరిగిన గొడవ కేసులో అతన్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. బిగ్ బాస్ ఫినాలే రోజున జూబ్లీహిల్స్‌లో ప్రశాంత్ అభిమానులు బీభత్సం సృష్టించారు. బరితెగించి చేసిన దాడుల్లో పలువురు పోలీసులకు గాయాలు కాగా కొన్ని ప్రయివేటు వాహనాలు సహా పోలీసు వాహనాలు, ఆర్టీసీ బస్సులు ధ్వంసం అయ్యాయి. ఈ క్రమంలో పల్లవి ప్రశాంత్‌పై 9 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయగా ఇప్పుడు అదే కేసుల నేపథ్యంలో ప్రశాంత్‌తో పాటు అతని సోదరుడు రవిరాజులను అరెస్ట్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే....
బిగ్ బాస్ తెలుగు 7 విజేత పల్లవి ప్రశాంత్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతున్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ట్రోఫీ గెలుచుకున్న అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయట ర్యాలీగా రావడం.. లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు హెచ్చరించారు. అయినప్పటికీ నేను రైతు బిడ్డను... ఇలా ఒక కప్పు గెలిచిన తర్వాత తనను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదంటూ పోలీసులతో గొడవకు దిగాడు. ఇక అలా పోలీసుల మాట కాదని ప్రశాంత్ రోడ్డు మీద ర్యాలీగా వెళ్లాడు.

మరోవైపు పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అంటూ చెప్పుకున్న కొంతమంది అమర్ దీప్, గీతూ రాయల్, అశ్విని శ్రీ వంటి కంటెస్టెంట్స్ కార్లను డామేజ్ చేయడమే కాకుండా అక్కడ ఉన్న టీఎస్ఆర్టీసీ బస్సులను సైతం ధ్వంసం చేశారు. ఇక పోలీసులు చెబుతున్నా వినకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడంతో అతని మీద పలు సెక్షన్ల కింద సుమోటగా కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో A4, A5గా ఉన్న పల్లవి ప్రశాంత్ కారు డ్రైవర్లను మంగళవారామే పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.
ఇక పల్లవి ప్రశాంత్ ను సైతం అరెస్టు చేయనున్న నేపథ్యంలో అతను నిన్నటి నుంచి పరారీలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. ఇక సోషల్ మీడియాలో కథనాలు రావడంతో.. తాను ఎక్కడికి పోలేదని... ఇంట్లోనే ఉన్నట్లు లైవ్ లో ఓ వీడియో తీసి.. సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. తాను ఊర్లోనే ఉన్నట్లు.. ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు క్లారిటీ ఇస్తూ వీడియోలో చెప్పుకువచ్చాడు.
ఇక ఈ రోజు గజ్వేల్ లోని కొల్గూరులో తన నివాసంలో ఉన్న పల్లవి ప్రశాంత్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచి రిమాండ్ కు తరలించనున్నారు. ప్రశాంత్ తో పాటు అతని సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక పల్లవి ప్రశాంత్ పై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయినట్లు తెలుస్తోంది. బెయిల్ వచ్చే అవకాశం కూడా లేదని సమాచారం.

ఇక బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్‌పై కక్షసాధింపు చర్యలు తగవని హైకోర్టు న్యాయవాది డాక్టర్ కే రాజేశ్‌కుమార్ తన అభిప్రాయాన్ని తెలిపారు. ప్రశాంత్ తల్లిదండ్రులు గొడుగు సత్యనారాయణ, విజయమ్మలతో కలిసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రెస్‌క్లబ్‌లో మాట్లడిన ఆయన.... హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో ప్రశాంత్‌పై వివిధ సెక్షన్లతో కేసు నమోదైనట్లు వార్తలు వచ్చినా... ఇంకా ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి ఆన్‌లైన్‌లో పెట్టలేదని వెల్లడించారు.


Click it and Unblock the Notifications











