Pallavi Prashanth: పేరు మార్చుకున్న బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్.. ఎందుకో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ విజేతగా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ గెలిచిన సంగతి తెలిసిందే. అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రశాంత్ ఫ్యాన్స్ రచ్చ చేయడంతో.. పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే తాజాగా ప్రశాంత్ కు బెయిల్ కూడా వచ్చింది. ఈరోజు ఆయన రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే పల్లవి ప్రశాంత్ తన పేరును మార్చుకున్నారు. ఎందుకు ఏమిటి అనేది స్టోరీలో తెలుసుకుందాం.

బిగ్ బాస్ తెలుగు 7 ముగిసిన వివాదాలు మాత్రం ముగియడం లేదు. ఇక ఈ సీజన్ విన్నర్ గా నిలిచిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. పబ్లిక్ న్యూసెన్స్ కింద పోలీసులు పల్లవి ప్రశాంత్ ను అరెస్టు చేశారు. బిగ్‌ బాస్‌ గ్రాంఢ్ ఫైనల్‌ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడి చేశారు. పల్లవి ప్రశాంత్ ను హెచ్చరించినా.. వినకుండా ర్యాలీ తీయడంపై ఆయన్ని పోలీసులు అరెస్టు చేశారు.

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Change His Name in Instagram Full Details Here

ఇక ఈ ఘటనకు సంబంధించి జూబ్లిహిల్స్ పోలీసులు ప్రశాంత్ పై సుమోటోగా కేసు బుక్ చేయగా.... పల్లవి ప్రశాంత్ అభిమానులపై కూడా కేసులు పెట్టారు. 147, 148,290,253,427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేసులను పోలీసులు నమోదు చేశారు. బిగ్ బాస్ ఫినాలే సందర్భంగా జరిగిన రచ్చలో ప్రభుత్వ ఆస్తులకు, ప్రైవేట్ వ్యక్తుల ఆస్తులకు నష్టం కలగడంతో విన్నర్ పల్లవి ప్రశాంత్‌ ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా వెల్లడించారు.

పల్లవి ప్రశాంత్.. అతని సోదరుడికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఇక ఇదిలా ఉంటే.. పల్లవి ప్రశాంత్ న్యాయవాది నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ వేయగా.. కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసింది. డిసెంబర్‌ 23న చంచల్‌ గూడ జైలు నుంచి ఆయన విడుదల కావచ్చని తెలుస్తోంది. అయితే పల్లవి ప్రశాంత్ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, ఎవరితో ఈ కేసు గురించి చర్చించ కూడదని కోర్టు పలు కండిషన్స్ పెట్టింది.

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Change His Name in Instagram Full Details Here

ఇక ఇదిలా ఉంటే.. తాజాగా పల్లవి ప్రశాంత్‌ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ లో పేరు మార్చుకున్నాడు. అందులో తన పేరు, బయోను మార్పు చేసినట్లు తెలుస్తోంది. MALLA OCHINA, SPY Team Winner అని కొత్తగా తన ఇన్‌ స్టాగ్రామ్‌ ఐడీకి చేర్చుకున్నాడు రైతు బిడ్డ. ప్రశాంత్‌ సూచన మేరకు అతని మరో​ సోదరుడు ఈ మార్పులు చేసినట్లు సమాచారం. తన విజయంలో SPY బ్యాచ్‌ పాత్ర ఎంతగానో ఉందని ప్రశాంత్‌ గుర్తించినట్లు.. అందుకే ఆయన పేరు మార్చుకున్నారని ప్రశాంత్ ఫ్యాన్స్ అంటున్నారు.

బిగ్‌ బాస్‌ వల్ల పల్లవి ప్రశాంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్ కు భారీగా ఫాలోవర్లు వచ్చారు. ప్రస్తుతం ప్రశాంత్‌ 1 మిలియన్‌ కు పైగానే ఫాలోవర్లను కలిగిఉన్నాడు. ఒకప్పుడు మల్లొచ్చినా అంటూ వీడియోలు చేసుకునే ప్రశాంత్.. రైతు బిడ్డగా సామాన్యుడిగా బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాడు. వచ్చి విజేతగా నిలిచాడు కానీ.. ఈ కేసులో ఇరుక్కోవడంతో.. ఆయన పేరెంట్స్ తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఇక పల్లవి ప్రశాంత్ పేరు మార్పు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X