Pallavi Prashanth: రాజకీయాల్లోకి రైతుబిడ్డ.. శివాజీ ముందే రివీల్ చేసిన పల్లవి ప్రశాంత్!

బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన ఆట తీరుతో అందరినీ ఆకట్టుకున్న ఈయన తాజాగా సెన్సేషనల్ కామెంట్లు చేశాడు. ముఖ్యంగా అందరి ఆశీర్వాదంతో బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన ఇతను... ఇప్పుడు రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించాడు. ముఖ్యంగా తనకు ఎప్పుడూ అండగా విన్న శివాజిని పక్కన పెట్టుకుని ఈ కామెంట్లు చేశాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

టిక్ టాక్ లో వీడియోలు చేసుకునే రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్.. అది బ్యాన్ అవ్వడంతో యూట్యూబ్ లోకి ఎంట్రీ ఇఛ్చాడు. వ్యవసాయ పనులు, రైతులు పడుతున్న కష్టాలతో పాటు పిచ్చి పిచ్చి వీడియోలన్నీ చేసి పాపులారిటీ సంపాధించుకున్నాడు. అలా వచ్చిన కొద్దో గొప్పో గుర్తింపుతోనే బిగ్ బాస్ తెలుగు 7 షోకు వెళ్లాడు. అక్కడ అమాయకుడిగా అడుగు పెట్టి ఆ తర్వాత తన విశ్వరూపాన్ని చూపించాడు. ముఖ్యంగా నామినేషన్స్ సమయంలో మరింత రెచ్చిపోయేవాడు.

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Enters Politics Check Details

శివాజి, ప్రిన్స్ యావర్ లతో సాయంతో ముఖ్యంగా రతికా రోజ్, అమర్ దీప్ ల గొడవలతో పల్లవి ప్రశాంత్ పై మరింత సింపథీ పెరిగిందే అదే కంటిన్యూ అవడం.. అందులో ఓ సామాన్యుడు రైతుబిడ్డ కావడంతో అందరూ ఈయనను గెలిపించారు. ఇలా బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ గా నిలిచిన ఈయన అక్కడ వచ్చిన డబ్బును రైతులకు ఇస్తానంటూ ప్రకటించాడు. ముఖ్యంగా గ్రాండ్ ఫినాలే తర్వాత రైతులకు డబ్బులు ఇస్తారా అంటే నేనేమైనా రాజకీయ నాయకుడినా అంటూ కామెంట్లు చేశాడు. కానీ తాజాగా ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ప్రకటించాడు.

ముఖ్యంగా ప్రిన్స్ యావర్ చేసిన ఓ సినిమా ప్రమోషన్ లో భాగంగా అక్కడకు వెళ్లిన పల్లవి ప్రశాంత్ సినిమా గురించి, యావర్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత మీ అందరి సహకారం వల్లే నేను బిగ్ బాస్ విన్నర్ గా నిలిచాను.. ఇక మీదట కూడా జీవితంలో అన్నింట్లలో గెలుస్తూ వెళ్తానని చెప్పగా... శివాజీ వెంటనే మైక్ లాక్కొని పార్లమెంట్ కు కూడా పోతాడు వీడని చెప్పాడు. ఇక ఆ తర్వాత మైక్ తీసుకున్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అవనని క్లారిటీ ఇచ్చాడు.

బిగ్ బాస్ లో ఉన్నప్పుడు ఇచ్చినట్లుగానే ఇప్పుడు సపోర్ట్ చేస్తే రాజకీయాల్లో కూడా గెలుస్తానని.. తన ఎంట్రీపై క్లారిటీ ఇచ్చాడు. యువత మేలుకోవాలి, యువతనే ముందడుగు వేయాలి.. యువతనే మేలుకుంటేనే.. ఇప్పుడు కాపాడుకోవచ్చంటూ కామెంట్లు చేశాడు. రైతుబిడ్డ ఓవైపు మాట్లాడుతుండగానే.. శివాజీ తెగ ముసిరిపోతూ కనిపించాడు. ఇదంతా చూస్తుంటే... శివాజీ సారథ్యంలోనే పల్లవి ప్రశాంత్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడని అనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరగనుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X