పల్లవి ప్రశాంత్‌కు సినిమా ఆఫర్లు.. సూపర్ కాంబోలే ఛాన్స్ కొట్టేసిన రైతుబిడ్డ.. లీక్ చేసిన బిగ్‌బాస్ కంటెస్టెంట

బిగ్ బాస్ తెలుగు 7 షో గురించి అందులో విన్నర్ గా నిలిచిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక కామన్ మాన్ గా హౌస్ లో అడుగు పెట్టిన అతడు విన్నర్ గా నిలుస్తాడని ఎవరూ అనుకోలేదు. ముఖ్యంగా మొదటి వారం హౌస్ లో అడుగు పెట్టిన అతడు.. మొదట్లో చాలా భయపడుతూ గేమ్ ఆడాడు. ముఖ్యంగా సీరియల్ హీరో అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ పై కోప్పడడం.. విపరీతమైన డైలాగ్ లు కొడుతూ రచ్చ చేయడంతో పల్లవి ప్రశాంత్ కు సింపథీ వచ్చేసింది. ఆ తర్వాత నుంచి పల్లవి ప్రశాంత్ కు అభిమానులు విపరీతంగా పెరిగిపోయారు.

అప్పటి వరకూ అంతా అమర్ దీప్ యే బిగ్ బాస్ తెలుగు 7 విన్నర్ గా నిలుస్తాడని అనుకోగా.. రెండో వారం నామినేషన్స్ ప్రక్రియలో అతడు చేసిన రచ్చతో తీవ్రమైన నెగిటివిటీ వచ్చింది. ఇదే సమయంలో రైతుబిడ్డకు అండగా నిలబడ్డ శివాజికి ఆయనతో పాటు పల్లవి ప్రశాంత్ కు క్రేజ్ పెరిగింది. ముఖ్యంగా పల్లవి ప్రశాంత్ గేమ్ కూడా చక్కగా ఆడడంతో మరింత మంది లైక్ చేశారు. ఇలా రోజురోజుకూ ఆటను మెరుగుపరుచుకుంటూ ప్యాన్స్ ను పెంచుకుంటూ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచారు. అయితే ఆ తర్వాత ఆయన ఫ్యాన్స్ చేసిన రచ్చకు అరెస్ట్ అయ్యారు.

 Bigg Boss Telugu 7 Winner Pallavi prashanth Get Movie Chances Check Details

విన్నర్ గా నిలిచి ఫుల్ ఎంజాయ్ చేయాల్సిన సమయంలోనే అరెస్ట్ అవడంతో విపరీతమైన బాధలోకి వెళ్లిపోయారు. అనేక మంది సపోర్ట్ తో చివరగా బయటకు వచ్చారు. ఇలా సమస్యల నుంచి తప్పించుకుని వచ్చిన అతడి గురించి భోలె షవాళి షాకింగ్ కామెంట్లు చేశారు. మనకు తెలియని ఎన్నెన్నో సీక్రెట్ ల గురించి రివీల్ చేశారు. రైతుబిడ్డ విన్నర్ గా నిలిచిన తర్వాత తనకు ఎంతో మంది ఫోన్లు చేశారని... తాము కూడా గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలని అనుకున్నట్లు వెల్లడించారు. పార్టీ ఇవ్వాలని వెళ్తుంటే రైతుబిడ్డను అరెస్ట్ చేసి అందరికీ షాకిచ్చారని చెప్పుకొచ్చారు.

అయితే పల్లవి ప్రశాంత్ కు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయని.. అయితే అతడు హౌస్ నుంచి బయటకు రాకముందే అతడికి సినిమాల్లో ఛాన్సులు రావడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని అసలు విషయం చెప్పుకొచ్చాడు పాట బిడ్డ. కేవలం అతడికి అవకాశాలు మాత్రమే కాకుండా తమ కాంబోలో అంటే రైతుబిడ్డ హీరోగా పాటబిడ్డ మ్యూజిక్ కంపోజర్ గా వస్తే సినిమాలు చేస్తామంటూ చాలా మంది తనను అప్రోచ్ అయ్యారని వివరించారు. విన్నర్ గా నిలిచి బయటకు రాగానే ఈ గుడ్ న్యూస్ అతడికి చెప్పాలనుకుంటే అరెస్ట్ అయి లోపలికి వెళ్లడం.. ఇదంతా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశాడు.

 Bigg Boss Telugu 7 Winner Pallavi prashanth Get Movie Chances Check Details

రైతుబిడ్డ పల్లవి ప్రశఆంత్ కు ఇప్పటికైనా సినిమాల్లో అవకాశాలు వస్తాయని.. అయితే అతడు నటిస్తాడా నటించడా అన్న దాని గురించి తాను ఇంకా అతడితో చర్చించలేదని భోలె షవాళి చెప్పుకొచ్చాడు. అవకాశాలు మాత్రం బాగానే వస్తున్నాయని.. అతడు ఇష్టపడితే సినిమాల్లో చూడడానికి కూడా ఎక్కువ కాలం పట్టదంటూ బోలె షవాళి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చూడాలి మరి రైతుబిడ్డ హీరోగా మారతాడా లేక రైతుగానే తన జీవితం గడుపుతాడా అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X