Bigg Boss Winner: ఈ సీజన్ విన్నర్ అతడే.. ఓటింగ్‌లో ఊహించని మలుపు.. కిందకు పడిపోయిన టాప్ ప్లేయర్

తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల కార్యక్రమాలు ప్రసారం అవుతున్నాయి. కానీ, అందులో కొన్ని షోలు మాత్రమే చరిత్ర సృష్టించే విధంగా సూపర్ సక్సెస్ అయ్యాయి. అలాంటి వాటిలో బిగ్ బాస్ ఒకటి. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ కార్యక్రమానికి భారీ రెస్పాన్స్ రావడంతో దేశంలో ఏ షోకూ రాని రేటింగ్ లభించింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను నడుపుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో సీజన్ ప్రసారం చేస్తున్నారు. ఇక, ఇందులో విజేతను నిర్ణయించే ఫినాలే ఓటింగ్ వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

ఉల్టా పుల్టా కావడం వల్లే: బిగ్ బాస్ ఆరో సీజన్ చప్పగా సాగడంతో ఏడో దాన్ని ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. పేరుకు తగ్గట్లుగానే ఇందులో అన్నీ ఊహించని సంఘటలనే చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రతి టాస్కులోనూ వైవిధ్యాన్ని చూపించడంతో పాటు ఎన్నో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌‌లను ఇస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్ అనుకున్న దానికంటే ఎక్కువగానే రేటింగ్ రాబడుతూ దూసుకుపోతోంది.

Bigg Boss Telugu 7 Winner

ఎవరు వెళ్లిపోయారంటే: తాజా సీజన్‌లోకి మొత్తంగా 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో ఫస్ట్ వీక్ కిరణ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారంలో నయని, 7వ వారంలో పూజా, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. 12వ వారం అశ్విని, రతిక, 13వ వారం గౌతమ్‌లు వెళ్లిపోయారు.

ఎలిమినేషన్ జోన్‌లోనే: బిగ్ బాస్ ఏడో సీజన్‌లో నామినేషన్స్ ప్రక్రియల్లో వైవిధ్యాన్ని చూపిస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ సీజన్‌లో ఎన్నో రకాల గొడవలు కూడా జరుగుతున్నాయి. ఇక, ఫినాలే ముందు 14వ వారానికి సంబంధించిన ప్రక్రియ కూడా రంజుగా సాగింది. ఈ టాస్కులో శివాజి, పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అమర్‌దీప్ చౌదరి, శోభా శెట్టిలు ఎలిమినేషన్‌ జోన్‌లోకి వచ్చారు.

విన్నర్‌ను నిర్ణయిస్తూ: గతంలో వచ్చిన ప్రతి సీజన్‌లోనూ బిగ్ బాస్ విన్నర్‌ను నిర్ణయించే ఓటింగ్ చివరి వారంలోనే జరుగుతుంది. కానీ, ఇప్పుడు మాత్రం 14వ వారంలోనే దీన్ని మొదలు పెట్టారు. అందుకే ఫైనల్ అస్త్ర గెలుచుకున్న అర్జున్‌ను కూడా ఇందులో యాడ్ చేశారు. ఈ వారంలో తక్కువ ఓట్లు వచ్చిన వాళ్లు ఎలిమినేట్ అవగా.. మిగిలిన వాళ్లంతా ఫినాలేకు చేరుకుంటారని బిగ్ బాస్ చెప్పాడు.

Pallavi Prashanth Gets Huge Votes and Top In Winner Race

రైతు బిడ్డకే భారీ ఓట్లు: బిగ్ బాస్ షో చివరి స్టేజ్‌కు వచ్చినప్పుడే ఆ సీజన్ విన్నర్ ఎవరు అనేది సుస్పష్టం అవుతుంది. అందుకు తగ్గట్లుగానే ఏడో సీజన్‌లోనూ విన్నర్‌ను నిర్ణయించే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇందులో అందరి కంటే ఎక్కువ ఓటింగ్‌తో పల్లవి ప్రశాంత్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. వచ్చే వారం కూడా ఇదే కంటిన్యూ అయితే ఈ సీజన్ విన్నర్ అతడే అవుతాడని చెప్పొచ్చు.

రెండు నుంచి మూడు: ఏడో సీజన్‌లో 14వ వారానికి జరుగుతున్న ఓటింగ్‌లో పల్లవి ప్రశాంత్ తర్వాత శివాజి ఉన్నాడు. కానీ, ఆ తర్వాత అమర్‌దీప్ చౌదరి పుంజుకుని టాప్ 2కు చేరుకున్నాడు. అయితే, గత ఎపిసోడ్‌లో అతడి మెంటల్ బిహేవియర్ కారణంగా ఓటింగ్ తగ్గిపోయింది. ఫలితంగా అమర్‌దీప్ చౌదరి మూడో స్థానానికి పడిపోయినట్లు తెలిసింది. దీంతో శివాజినే ఇప్పుడు సెకెండ్ ప్లేస్‌లో ఉన్నాడట.

టాప్ 5గా ఎవరెవరంటే: ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్‌ను బట్టి చూస్తే.. ఇప్పటికే అంబటి అర్జున్ ఫైనల్ అస్త్ర గెలుచుకుని టాప్‌ 5లోకి చేరుకున్నాడు. ఇప్పుడు ఓటింగ్ ద్వారా పల్లవి ప్రశాంత్, శివాజి, అమర్‌దీప్ చౌదరి స్థానాలు కూడా కన్ఫార్మ్ అయిపోయాయి. మరో ప్లేస్ కోసం ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, శోభా శెట్టిలు పోటీ పడుతున్నారు. అయితే, ఈ ఇద్దరిలో ప్రియాంకనే టాప్ 5కి చేరే ఛాన్స్ కనిపిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X