Pallavi Prashanth: శివాజికి పల్లవి ప్రశాంత్ బిగ్ సర్‌ప్రైజ్.. ఏం చేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే!
బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత నుంచి జరిగిన అనేక సంఘటనలు చాలా మందికి తెలిసే ఉంటుంది. పల్లవి ప్రశాంత్ అభిమానులం అని చెప్పుకుంటూ చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్ల కార్లపై దాడులు చేశారు. అమర్ దీప్ తో పాటు గీతూ రాయల్, అశ్విని శ్రీ కార్లను పగులగొట్టారు. అయితే ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ ను అరెస్ట్ చేయడం తాజాగా ఆయన బెయిల్ పై విడుదల అవ్వడం కూడా అందరికీ తెలిసిందే. అయితే ఈ కేసులోంచి తాజాగా బయట పడిన అతడు అందరితో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా హైదరాబాద్ కు వెళ్లిన అతడు శివాజికి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉండగా... శివాజి రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు ఎంతగా సపోర్ట్ చేశాడో అందరికీ తెలిసిందే. రైతుబిడ్డ అంత కాలం ఇంట్లో ఉండడానికి పరోక్షంగా శివాజియే కారణం. ఒక్క రైతుబిడ్డ మాత్రమే కాదు ప్రిన్స్ యావర్ కూడా ఇంట్లో కొనసాగడానికి శివాజియే కారణం అని షోను ప్రతిరోజూ ఫాలో అయిన ప్రతీ ఒక్కరికీ తెలుసు. హౌస్ లో ఉండగా స్పై బ్యాచ్ అంటే ప్రిన్స్ యావర్, పల్లవి ప్రశాంత్, శివాజిల మధ్య చాలా బాండింగ్ ఏర్పడింది. వాళ్లంతా కలిసి ఓచోట చేరి మరీ అందరినీ తెగ అలరించారు. అయితే పల్లవి ప్రశాంత్ బయటకు వచ్చాక అరెస్ట్ కావడంతో శివాజి స్పందించలేదు.

ముందుగా స్పందించకపోవడంపై అంతా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన నేరుగా అతడికి సాయం చేయకపోయినప్పటికీ... తరచుగా ఫోన్ లో టచ్ లోనే ఉన్నారని.. చేయాల్సిన సాయం అంతా చేస్తూనే ఉన్నారని ఆ తర్వాత తెలిసింది. మరోవైపు ప్రిన్స్ యావర్ తో పాటు భోలె షవాళి, టేస్టీ తేజ, సందీప్ మాస్టర్ లు కూడా జైలుకు వెళ్లడం, లాయర్లతో మాట్లాడడం ప్రశాంత్ కు సపోర్ట్ గా నిలవడం అందరి మనసులను దోచుకుంది. అయితే తాజాగా జైలునుంచి బయటకు వచ్చిన పల్లవి ప్రశాంత్ తన పెద్ద అన్న శివాజికి అదిరిపోయే గిఫ్టు ఇచ్చాడు. అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
హైదరాబాద్ కు వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్.. శివాజిని కలుస్తానని చెప్పాడట. అయితే తాను ఉన్న చోటుకు రమ్మని కూడా లొకేషన్ పెట్టాడట పల్లవి ప్రశాంత్. అయితే అంతలోపు శివాజి ఓ వీడియో తీసుకోవాలని.. లైవ్ ఇవ్వాలని భావించడంతో ఆ తర్వాత వెళ్లాలని అనుకున్నారట. ఈక్రమంలోనే శివాజి ఓ లైవ్ వీడియో చేశాడు. కానీ మధ్యలో ఉండగానే పల్లవి ప్రశాంత్ శివాజి ఇంటికి వచ్చేశాడు. తన ఇంట్లో పల్లవి ప్రశాంత్ ను చూసిన శివాజి నిజంగా షాకయ్యాడు. వెంటనే హత్తుకుని తెగ మురిసిపోయాడు.

ఇదేంట్రా నేనే వస్తాను అనుకునేలోపే నువ్వే వచ్చేశావు అంటూ ప్రేమను కురిపించాడు శివాజి. సర్ ప్రైజ్ ఇవ్వాలనే తాను అలా వచ్చినట్లు చెప్పుకొచ్చాడు పల్లవి ప్రశాంత్. మరోవైపు యావర్ కూడా వస్తానని చెప్పాడని.. కానీ మరి ఎందుకు ఆలస్యం అయిందో తెలియట్లేదని శివాజి చెప్పుకొచ్చాడు. ఈక్రమంలోనే వీరిద్దరూ స్టార్ మాతో పాటు హోస్ట్ నాగార్జునకు కూడా పెద్ద ఎత్తున థాంక్స్ చెప్పారు. గేమ్ ను గేమ్ లాగే చూస్తున్నామని.. ఇంతకాలం సపోర్ట్ చేయడం తమకు చాలా సంతోషంగా ఉందని.. స్పై బ్యాచ్ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉంటుందని శివాజి చెప్పడం అందరినీ మంత్రముగ్ధులను చేస్తోంది.


Click it and Unblock the Notifications











