Bigg Boss Telugu 7 Winner ఈ విజయం నాది కాదు.. అతడి త్యాగం వల్లే.. పల్లవి ప్రశాంత్

బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో కామన్ మేన్ ప్రశాంత్ సంచలనం సృష్టించాడు. ఇంటిలోకి అనామకుడిగా ప్రవేశించిన పల్లవి ప్రశాంత్ వారం వారం తన క్రేజ్‌ను పెంచుకొన్నాడు. 105 రోజుల్లో విశేషంగా అభిమానులను సంపాదించుకొన్నాడు. చివరకు శివాజీ సహకారంతో విన్నర్‌గా నిలిచాడు. విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్.. బిగ్‌బాస్ బజ్‌లో మాట్లాడుతూ..

హోస్ట్ నాగార్జున అక్కినేని నా చేయ్యి పైకి ఎత్తినప్పుడు నన్ను నేను కంట్రోల్ చేసుకోవడం కష్టమైంది. ఆ క్షణం తమాయించుకోవడం కష్టంగా మారింది. అమ్మో నేనే గెలిచానా? నేనే విన్నర్ అనేది ఊహించుకోలేకపోయాను. మాటలు రాలేదు. ఈ విజయం నాది కాదు. నాకు ఓటేసిన ప్రతీ ఒక్కరిది అంటూ పల్లవి ప్రశాంత్ కామెంట్ చేశాడు.

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Grand finale moments after Nagarjuna Declares trophy

నాతో క్లోజ్‌గా ఉంటూనే రతిక రోజ్ నన్ను నామినేట్ చేయడం నాకు నచ్చలేదు. ఇంటిలో జరిగిన విషయాలు కాకుండా బయట పాయింట్ తీసుకొచ్చి నన్ను నామినేట్ చేసింది. మా మధ్య క్లోజ్‌నెస్ పెరిగింది. అయితే తనను అక్క అని పిలువమని రతికనే చెప్పింది. దాంతో నేను అక్కా అని పిలిచాను. ఒక్కసారి అక్క అంటే అక్కే అని పల్లవి ప్రశాంత్ వివరణ ఇచ్చాడు.

రతికను అక్కా అని పిలవడం మొదలు పెట్టిన తర్వాత మళ్లీ వద్దు అన్నది. కానీ నేను అక్కా అనడం ఆపలేదు. ఒక్కసారి అక్కా అని పిలిచిన తర్వాత ఆపడం నా వల్ల కాదు. రతికతో కొన్ని గొడవలు జరిగాయి. కానీ వాటిని నేను పట్టించుకోలేదు అని పల్లవి ప్రశాంత్ చెప్పాడు.

శివాజీ సపోర్ట్ లేకపోతే ఇంతంటి విజయం దక్కేదో లేదో తెలియదు. కానీ ఆయన మాటలు నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. భజం తట్టి ప్రోత్సహించాడు. ఆయన భార్య నుంచి వచ్చిన లెటర్‌ను నా కోసం త్యాగం చేశాడు. కామన్ మ్యాన్‌గా ఇంటిలోకి వచ్చావు. కప్ కొట్టాలని చెప్పాడు. నా జీవితంలో ఎవరైనా త్యాగం చేశారంటే అది శివన్ననే. కామన్ మ్యాన్ పవర్ చూపించాలి అన్నప్పుడల్లా నాకు ధైర్యం లభించింది అని పల్లవి ప్రశాంత్ చెప్పాడు.

బిగ్‌బాస్ తెలుగు 7 విజేతగా నిలిచి ట్రోఫి పట్టుకొని వచ్చిన తర్వాత బిగ్‌బాస్ బజ్ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఆ వేదికపై తన తల్లిదండ్రులతో కలిసి కేక్ కట్ చేశాడు. విజయంతో ఆనందంలో మునుగుతూ కంటతడి పెట్టుకొన్నాడు. ఈ విజయం ముమ్మాటికి ప్రజలదే అని అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X