Bigg Boss Telugu 7: బయటపడ్డ మిస్‌డ్ కాల్ మోసం.. ప్రశాంత్‌ను ఓడించే ప్లాన్.. ఆధారాలతో వీడియో వైరల్

ఇండియాలోని పలు భాషల్లో ఎప్పుడో ప్రారంభం అయినా.. తెలుగులోకి మాత్రం ఏడేళ్ల క్రితమే వచ్చింది బిగ్ బాస్ షో. సరికొత్త కంటెంట్‌తో నడిచే కార్యక్రమమే అయినా.. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. ఫలితంగా ఇది సూపర్ డూపర్ సక్సెస్ అయింది.

ఇలా చాలా సీజన్లను పూర్తి చేసుకుని.. ఇప్పుడు ఏడోది కూడా ముగించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు ఈ సీజన్‌లో ఫినాలే ఓటింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో టైటిల్ ఫేవరెట్ పల్లవి ప్రశాంత్‌ ఓడించే కుట్ర జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ సంగతులేంటో మీరే చూసేయండి మరి!

Bigg Boss Telugu 7 Winner

మొదలైన విన్నర్ ఓటింగ్: ఉల్టా పుల్టాగా సాగుతోన్న బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ప్రతి అంశం కూడా ఎవరూ ఊహించని విధంగానే సాగుతోంది. ఇప్పటి వరకూ జరిగిన ఏ సీజన్‌లోనూ చూపించని ఎన్నో అంశాలను ఇందులో ప్రసారం చేస్తున్నారు. ముఖ్యంగా 14వ వారంలోనే విన్నర్‌ను డిసైడ్ చేసే ఓటింగ్‌ను మొదలు పెట్టారు. దీని ప్రకారమే ఈ వారం ఎలిమినేషన్‌తో పాటు విజేతను కూడా నిర్ణయించబోతున్నారు.

టైటిల్ రేసులో ప్రశాంత్: మామూలుగానే బిగ్ బాస్ షో చివరి వారాల్లో ఉన్నప్పుడే ఆ సీజన్ విన్నర్ ఎవరు అనేది సుస్పష్టం అవుతుంది. అందుకు తగ్గట్లుగానే ఏడో సీజన్‌లోనూ విన్నర్‌ను నిర్ణయించే ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నట్లు తెలిసింది. ఇందులో అందరి కంటే ఎక్కువ ఓటింగ్‌తో పల్లవి ప్రశాంత్‌ టాప్‌లో కొనసాగుతున్నాడు. వచ్చే వారం కూడా ఇదే కంటిన్యూ అయితే ఈ సీజన్ విన్నర్ అవ్వొచ్చు.

Pallavi Prashanth Missed Call Number Did Not Working

మిస్‌డ్ కాల్స్‌లోనూ టాప్: కామన్ మ్యాన్‌గా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చి.. తనదైన ఆటతీరుతో ఆకట్టుకుని.. టైటిల్ ఫేవరెట్ అనిపించుకున్నాడు పల్లవి ప్రశాంత్. అందుకే అతడికి ఫినాలే ఓటింగ్‌లో గంపగుత్తగా ఓట్లు పడుతున్నట్లు తెలుస్తోంది. హాట్‌స్టార్ పోలింగ్‌తో పాటు మిస్‌డ్ కాల్స్‌లోనూ పల్లవి ప్రశాంత్ టాప్‌లోనే ఉన్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. దీంతో అతడి విజయం ఖాయం అని అంటున్నారు.

బయటపడ్డ భారీ మోసం: బిగ్ బాస్ ఏడో సీజన్ గ్రాండ్ ఫినాలేకు సమయం మరింత దగ్గర పడింది. డిసెంబర్ 17వ తారీఖున విజేతను కూడా ప్రకటించబోతున్నారు. దీంతో ఈ రెండు వారాల ఓట్లు కీలకం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా మిస్‌డ్ కాల్స్‌కు సంబంధించిన ఓ భారీ మోసం బయటపడింది. దీని ద్వారా పల్లవి ప్రశాంత్‌కు తీవ్ర నష్టం జరుగుతున్నట్లు ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రశాంత్‌కు కలవని కాల్: బిగ్ బాస్ నిర్వహకులు ఇచ్చిన పల్లవి ప్రశాంత్ మిస్‌డ్ కాల్ నెంబర్ సరిగా వర్క్ చేయడం లేదని, దీన్ని కావాలనే కొందరు పని చేయకుండా చేశారని తాజాగా ఓ చర్చ తెరపైకి వచ్చింది. అంతేకాదు, కొందరు కొన్ని ఆధారాలతో కూడిన వీడియోలను షేర్ చేస్తున్నారు. వీటిలో నిజంగానే ప్రశాంత్ నెంబర్‌కు కాల్ కలవడం లేదు. కానీ, అమర్‌దీప్‌కు చేస్తే వెంటనే కనెక్ట్ అవుతుంది.

మోసమా? సమస్యనా?: తాజాగా బయటకు వచ్చిన వీడియోలతో పల్లవి ప్రశాంత్‌ను ఓడించేందుకు కుట్ర జరుగుతున్నట్లు చాలా మంది బిగ్ బాస్ టీమ్‌పై విమర్శలు చేస్తున్నారు. ఈ విషయాన్ని నాగార్జున దృష్టికి తీసుకు వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. అయితే, ఇది కావాలని చేస్తున్న మోసమా? లేక టెక్నికల్ ప్రాబ్లమా? అన్నది మాత్రం సస్పెన్స్‌గానే మారిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X