పల్లవి ప్రశాంత్ కేసులో బిగ్ ట్విస్ట్: అసలు నిజం చెప్పిన హైకోర్ట్ లాయర్.. రేవంత్ రెడ్డిని లాగుతూ!
బిగ్ బాస్ షో ఏడో సీజన్ ఫలితం తర్వాత జరిగిన రచ్చ తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో విన్నర్ పల్లవి ప్రశాంత్ వ్యవహరించిన తీరుపై పోలీసులు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. అంతేకాదు, అతడి పైన, మరికొందరి పైనా జూబ్లీహిల్స్ పోలీసులు ఆరు సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఈ కేసులో రోజుకో పురోగతి కనిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు పల్లవి ప్రశాంత్ కనిపించకుండా పోవడం హాట్ టాపిక్‌గా మారింది. అసలేం జరిగింది? పోలీసులు ఇప్పుడేం చేస్తున్నారు? ప్రశాంత్ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? అనేవి మీరే చూడండి!
ప్రశాంత్‌తో పాటు వాళ్లపై:బిగ్ బాస్ ఫినాలే తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పల్లవి ప్రశాంత్ అభిమానులే దాడులకు పాల్పడ్డారని పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ పోలీసులు అతడితో పాటు కొందరు అభిమానులపైన కూడా 147, 148, 290, 353, 427 రెడ్ విత్, 149 సెక్షన్ల కింద కేస్ ఫైల్ చేశారు. అప్పటి నుంచి వీళ్లను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

A4, A5ను అరెస్ట్ చేసి:బిగ్ బాస్ షో పూర్తైన తర్వాత జరిగిన న్యూసెన్స్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు సీరియస్‌గా ఉన్నారు. ఈ క్రమంలోనే దాడులు జరిగిన సమయంలో పల్లవి ప్రశాంత్ కార్లకు డ్రైవర్లుగా ఉన్న ఇద్దరిని మంగళవారం సాయంత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరూ ఈ కేసులో A4, A5గా ఉన్నట్లు తెలిసింది. ముందుగా ఈ ఇద్దరిని కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపించారు.
ప్రశాంత్ కోసం గాలింపు:బిగ్ బాస్ షో అనంతరం జరిగిన న్యూసెన్స్‌లో A1గా ఉన్న విన్నర్ పల్లవి ప్రశాంత్‌ను అరెస్ట్ చేసేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. సోమవారం సాయంత్రం నుంచి అతడిని అదుపులోకి తీసుకోవాలని చూస్తున్నారు. కానీ, ప్రశాంత్ మాత్రం వాళ్లకు దొరకలేదు. దీంతో మంగళవారం కూడా పోలీసులు మళ్లీ ప్రయత్నాలు సాగిస్తూనే వచ్చారు.

పల్లవి ప్రశాంత్ పరారీలో:బిగ్ బాస్ ఏడో సీజన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ సోమవారం రాత్రి నుంచే కనిపించకుండా వెళ్లినట్లు తెలుస్తోంది. పోలీసులు తనను అరెస్ట్ చేస్తారన్న భయంతోనే అతడు పరారీలో ఉన్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, పల్లవి ప్రశాంత్ ఫోన్ నెంబర్ కూడా అందుబాటులో లేదు. రైతు బిడ్డ గురించి ఈ విషయం తెలిసి అతడి అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
తల్లిదండ్రుల భయం:రెండు మూడు రోజులుగా పల్లవి ప్రశాంత్ గురించి వస్తున్న వార్తలు.. అతడు కనిపించకుండా పోయిన విషయం తెలుసుకుని తల్లదండ్రులు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఈ క్రమంలోనే వాళ్ల తాజాగా మీడియా ముందుకు వచ్చి తమ గోడును వెళ్లగక్కారు. ప్రశాంత్ ఎలాంటి తప్పు చేయలేదని, దయచేసి అతడిపై తప్పుడు ప్రచారం చేయొద్దని వేడుకున్నారు.

హైకోర్ట్ లాయర్ నిజం:ప్రశాంత్ కేసుపై హైకోర్ట్ లాయర్ రాజేశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. 'ప్రశాంత్‌పై నమోదు అయిన కేసు ఎఫ్‌ఐఆర్ కాపీని పోలీసులు ఆన్‌లైన్‌లో పెట్టలేదు. కానీ, అరెస్ట్ చేయడానికి వస్తున్నారు. దీంతో వాళ్ల తల్లిదండ్రులు భయపడుతున్నారు. ప్రశాంత్ గెలవడం ఇష్టం లేని కొందరు వీటికి పాల్పడ్డారు. దీనిపై పోలీసులే విచారణ జరిపించాలి' అని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి దృష్టికి:ఆ తర్వాత లాయర్ రాజేశ్ కుమార్ కొనసాగిస్తూ.. 'పోలీసులు చట్ట ప్రకారం ముందుకు వెళ్తే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ, ప్రశాంత్‌పై నమోదు అయిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని ఎందుకు ఆన్‌లైన్ చేయలేదు? దీనిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టికి కూడా దీన్ని తీసుకు వెళ్తాం' అంటూ ఆయన పోలీసులను హెచ్చరించారు.


Click it and Unblock the Notifications











