ఆ అమ్మాయితో బ్రేకప్.. ఒప్పుకొంటే పెళ్లి చేసుకొంటా.. పల్లవి ప్రశాంత్ షాకింగ్‌గా.. రతికతో లవ్ ట్రాక్‌పై అలా!
బిగ్‌బాస్ తెలుగు 7 విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు అభిమానులు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు. రైతుబిడ్డపై విశేషంగా అభిమానం కురిపిస్తున్నారు. అయితే విన్నర్‌గా నిలిచిన అనంతరం ఆయన బిగ్‌బాస్ బజ్‌లో పలు విషయాలను పంచుకొన్నారు. ఆయన చుట్టూ కొన్ని వివాదాలు కూడా చుట్టు ముడుతున్నాయి. ఈ క్రమంలో రతిక, తన బ్రేకప్ గురించి ఆసక్తికరంగా విషయాలను వెల్లడిస్తూ..
కామన్ మ్యాన్‌గా బిగ్‌బాస్ ఇంటిలోకి వచ్చిన పల్లవి ప్రశాంత్.. ఆరంభంలో కంటెస్టెంట్ రతికా రోజ్‌తో లవ్ ట్రాక్ నడిపేందుకు ప్రయత్నించాడు. అయితే కొన్నాళ్లు రొమాంటిక్ మూమెంట్స్ కొనసాగినా వారిద్దరి మధ్య కుదరకపోవడంతో ఆ లవ్ ట్రాక్‌కు పుల్‌స్టాప్ పెట్టారు. ఆ తర్వాత వారిద్దరూ గొడవ పడుతూ కనిపించారు.

అయితే ఒకసారి ఎలిమినేట్ అయి మళ్లీ తిరిగి వచ్చిన రతికా రోజ్‌తో ప్రశాంత్ ప్యాచప్ అయ్యేందుకు ప్రయత్నించారు. అయితే ఆ తర్వాత ఆమెను అక్కా అంటూ పిలవడం అందర్నీ షాక్ గురిచేసింది. నన్ను అక్కా అనకు అంటూ కామెంట్ చేసింది. అలా వారిద్దరూ రిలేషన్ అందరికి కన్‌ఫ్యూజ్ చేసింది.
అయితే బిగ్‌బాస్ తర్వాత కూడా నాకు ఎవరితో బేధాభిప్రాయాలు లేవు. వాళ్లు కాల్ చేస్తే నేను కాల్ చేస్తాను. వాళ్లు మాట్లాడితే.. నేను మాట్లాడుతాను. నాకు అలాంటి పట్టింపులు ఏవీ లేవు. నేను అందరితోను మంచిగా ఉంటానని పల్లవి ప్రశాంత్ చెప్పాడు.

బిగ్‌బాస్ షోలో ఉండగా పల్లవి ప్రశాంత్ తన బ్రేకప్ స్టోరిని బయటకు చెప్పారు. తాను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. కానీ ఆ అమ్మాయి పొలం పనులు చేస్తున్నానని రిజెక్ట్ చేసింది. అయితే తానేమీ బాధపడలేదు. కానీ ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం. ఆమె పేరు చెప్పడం కరెక్ట్ కాదు అని అన్నాడు.

బిగ్‌బాస్ తెలుగు 7 విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్‌ను ఎందుకు వదిలేశానా బాధపడుతుందా అనే ప్రశ్నకు ఆ విషయం గురించి ఆలోచించడం లేదు. ఇప్పుడు ఎవరైనా నాకు ప్రపోజ్ చేస్తే నేను స్పందించను. మా నాన్నకు ఇష్టమై ఆయన ఒప్పుకొంటే నేను ఆ అమ్మాయిని చేసుకొంటాను. నన్ను ఎవరు కావాలనుకొన్నా మా నాన్న సరే అంటే నేను చేసుకొంటాను అని పల్లవి ప్రశాంత్ చెప్పాడు.


Click it and Unblock the Notifications











