Pallavi Prashanth జైలు నుంచి బయటకొచ్చిన పల్లవి ప్రశాంత్.. ఎంత హెచ్చరించినా మళ్లీ అదే మిస్టేక్స్?
బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ అనూహ్య పరిస్థితులలో కప్ తీసుకున్న కొద్ది రోజులకే జైలు పాలైన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎట్టకేలకు ఆయనకు బెయిల్ లభించడంతో ఈరోజు ఉదయం నుంచి ఆయన ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతాడా అని అభిమానులు ఎదురుచూస్తూ వచ్చారు. అయితే ఎట్టకేలకు ఆయనను బెయిల్ మీద జైలు అధికారులు రిలీజ్ చేశారు. అయితే ఏ తప్పు మీద అయితే ఆయన లోపలికి వెళ్ళాడో దానికి సంబంధించిన తప్పులే మళ్ళీ మళ్ళీ చేసేందుకు అభిమానులు ప్రయత్నిస్తూ రావడం హాట్ టాపిక్ అయింది.
గత ఆదివారం జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సీజన్ 7లో పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచి కప్ అందుకున్నాడు. నిజానికి పల్లవి ప్రశాంతకంటే ముందే దాదాపు అందరికంటే బయటకు వెళ్లిపోయారు అలా వెళుతున్న సమయంలో అమర్ దీప్, గీతూ రాయల్, అశ్వినీ శ్రీ, వంటి వాళ్ల కార్ల మీద దాడులు జరిగాయి. అయితే అప్పటికే పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ దీప్ అభిమానులు సైతం ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టారు.

పల్లవి ప్రశాంత్ బయటకు వస్తే అమరదీప్ అభిమానులు ఆయన కారు మీద ఏమైనా దాడులు చేసే అవకాశం ఉందని భావించిన పోలీసులు నిర్వహణకులతో మాట్లాడించి పల్లవి ప్రశాంతను వెనుకదారి నుంచి పంపించారు. అయితే పల్లవి ప్రశాంత్ తాను గెలిచి దొడ్డిదారిని వెళ్లిపోవడం ఏంటని భావించి మరోసారి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి రావడంతో పెద్ద ఎత్తున హడావుడి నెలకొంది.
పోలీసులు వెళ్లిపోమని చెప్పినా వెనక్కి వచ్చిన నేపథ్యంలో పల్లవి ప్రశాంతమైన కేసులు నమోదు చేశారు. ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు అంతం చేయడంతో పాటు పోలీసు వాహనాలను కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ మీద సెక్షన్లు కూడా పెట్టి అరెస్టు చేసి గురువారం నాడు నాంపల్లి కోర్టుకు తీసుకువెళ్లగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించారు.

తర్వాత నిన్న ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో చంచల్ గూడా జైలు నుంచి బయటకు వచ్చి సైలెంట్ గా వెళ్ళిపోయాడు. అతనికి కండిషన్ బెయిల్ ఇవ్వడంతో ఎలాంటి హడావిడి లేకుండా అక్కడ నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. పల్లవి ప్రశాంత్ రిలీజ్ అయ్యే క్రమంలో కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న అభిమానులు అతనితో మాట్లాడేందుకు ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపించే ప్రయత్నం చేశారు.
అయితే వారెవరికి కనపడకుండానే ప్రశాంత్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పల్లవి ప్రశాంత్ జైలుకు వెళ్లడానికి కారణమైన ఆయన అభిమానులు ఇప్పుడు మరోసారి జైలు వద్దకు కూడా వెళ్లి హడావిడి సృష్టించే ప్రయత్నం చేశారు ఇంకా తప్పుల నుంచి గుణపాఠం నేర్చుకోలేదని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే పల్లవి ప్రశాంత మాత్రం తెలివిగా ఎక్కడా మీడియా కంట కూడా ప్రశాంతంగా ఇంటికి వెళ్లిపోయి ప్రయత్నం చేయడం చేసి మంచి పని చేశాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











