Bigg Boss Winner: పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ ఇంత తక్కువా? ప్రైజ్‌ మనీతో కలిపి ఎంత సంపాదించాడంటే!

ఇండియాలోని చాలా భాషల్లో ఎప్పుడో పరిచయం అయినా.. తెలుగులోకి మాత్రం చాలా ఆలస్యంగా వచ్చింది బిగ్ బాస్. అయినప్పటికీ ఎవరూ ఊహించని విధంగా భారీ స్పందనను సొంతం చేసుకుని సెన్సేషనల్ హిట్ అయింది. ఫలితంగా నిర్వహకులు అస్సలు బ్రేకులు లేకుండా సీజన్లను తీసుకొస్తున్నారు. ఇలా ఇటీవలే ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా కాన్సెప్టుతో ప్రసారం చేశారు. ఇందులో కామన్ మ్యాన్ పల్లవి ప్రశాంత్ విజయం సాధించాడు. మరి అతడు ప్రైజ్ మనీతో కలిపి రెమ్యూనరేషన్‌గా ఎంత సంపాదించాడో మీరే చూసేయండి మరి!

బిగ్ బాస్ విజేతగా ప్రశాంత్
బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి ఆరుగురు కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెట్టారు. వారిలో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. చివరకు పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి మాత్రం టాప్ 2గా నిలిచారు. ఎంతో ఉత్కంఠ నడుమ వీళ్లిద్దరిలో రైతు బిడ్డ విజయం సాధించినట్లు హోస్ట్ అక్కినేని నాగార్జున ప్రకటించాడు. దీంతో అతడి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు.

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Remuneration and Prize Money Details

ప్రశాంత్ ప్రైజ్‌మనీ‌లో కోత
బిగ్ బాస్ సీజన్‌లో గెలిచిన విజేతకు రూ. 50 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామని నిర్వహకులు ప్రకటించారు. అయితే, ప్రిన్స్ యావర్ రూ. 15 లక్షలు తీసుకుని పోటీ నుంచి తప్పుకున్నాడు. ఫలితంగా ఆ మొత్తాన్ని విన్నర్ ప్రైజ్ మనీ నుంచి తగ్గించేశారు. అంటే.. ఏడో సీజన్‌లో గెలిచిన పల్లవి ప్రశాంత్‌కు రూ. 35 లక్షలు నగదు బహుమతినే అందించిన విషయం తెలిసిందే.

వాటితో కలిపితే 62 లక్షలు
బిగ్ బాస్ ఏడో సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు టైటిల్ స్పాన్సర్లలో ఒకటైన జోస్ అలుకాస్ (Jos Alukkas Jewellery) సంస్థ నుంచి రూ. 15 లక్షలు విలువైన నగల బహుమతి కూడా లభించింది. దీనితో పాటు రూ. 12 లక్షలు విలువైన కారు కూడా దక్కింది. వీటితో కలుపుకుంటే మొత్తం అతడికి రూ. 62 లక్షలు ప్రైజ్ మనీగా వచ్చినట్లు చెప్పుకోవాలి.

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Remuneration and Prize Money Details

రెమ్యూనరేషన్ ఎంతంటే
బిగ్ బాస్ హౌస్‌లోకి కామన్ మ్యాన్ కోటాలో వచ్చి.. ఊహించని విధంగా ఆడి విజేతగా నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్. దీంతో అతడికి బిగ్ బాస్ నిర్వహకులు ఎంత రెమ్యూనరేషన్ ఇచ్చారన్న దానిపై అప్పుడే పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ప్రశాంత్‌కు ఒక్కో వారానికి రూ. 1 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని తెలిసింది.

15 వారాలకూ ఎంతంటే
బిగ్ బాస్ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. ప్రశాంత్‌ బిగ్ బాస్ ఏడో సీజన్ కోసం రోజుకు రూ. 14 వేలకు పైగానే వసూలు చేసినట్లు తెలిసింది. అలా అతడు ఒక్క వారానికి గానూ రూ. 1 లక్ష రెమ్యూనరేషన్‌గా అందుకున్నాడని సమాచారం. ఇక, 15 వారాల పాటు ఉన్న పల్లవి ప్రశాంత్ మొత్తంగా రూ. 15 లక్షలు రెమ్యూనరేషన్‌గా తీసుకున్నాడని టాక్ వినిపిస్తోంది.

Bigg Boss Telugu 7 Winner Pallavi Prashanth Remuneration and Prize Money Details

ప్రైజ్ మనీతో కలిపితే
బిగ్ బాస్ సీజన్‌లో విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కు ప్రైజ్ మనీ కింద రూ. 62 లక్షలు ముట్టాయి. అలాగే రెమ్యూనరేషన్‌ పరంగా మరో రూ. 15 లక్షలు కూడా అతడి ఖాతాలో జమా అయ్యాయి. ఇలా బిగ్ బాస్ షో ద్వారా పల్లవి ప్రశాంత్ రూ. 77 లక్షలు సంపాదించాడని తెలుస్తోంది. ఇది ఈ సీజన్‌లో పాల్గొన్న అందరు కంటెస్టెంట్ల కంటే ఎక్కువ మొత్తం అనే చెప్పుకోవాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X