Bigg Boss Winner: ఓటింగ్‌లో సెన్సేషన్.. హాట్‌స్టార్‌లో అతడు.. కాల్స్‌లో ఇతడు.. మరి విన్నర్ ఎవరంటే!

గతంలో కంటే ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకుల అభిరుచిలో మార్పులు వస్తున్నాయి. దీంతో ఈ మధ్య కాలంలో కొత్త కొత్త కాన్సెప్టులతో షోలు వస్తున్నాయి. అలాంటి వాటిలో రియాలిటీ ఆధారంగా నడిచే బిగ్ బాస్ ఒకటి. భారీ స్పందనతో చరిత్ర సృష్టించిన ఈ కార్యక్రమం.. తెలుగులో మాత్రం మరింత ఎక్కువ ఇంపాక్టును చూపించింది. ఫలితంగా వరుసగా సీజన్లను జరుపుకుంటోంది. ఇక, ఇప్పుడు జరుగుతోన్న ఏడో సీజన్ చివరి దశకు చేరడంతో విన్నర్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో తాజాగా లీకైన ఓటింగ్ వివరాలపై మీరు కూడా లుక్కేయండి మరి!

Recommended Video

Sivaji కి షాకిచ్చిన Pallavi Prashanth ఉత్కంఠ రేపుతున్న Voting | Bigg Boss 7 | Filmibeat Telugu

ఫినాలేలోకి ఆరుగురు ఎంటర్:ఉల్టా పుల్టా కాన్సెప్టుతో వచ్చిన బిగ్ బాస్ ఏడో సీజన్‌లోకి మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు. అందులో ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అవుతూ వచ్చారు. దీంతో షో చరిత్రలోనే రెండోసారి ఆరుగురు సభ్యులు ఫినాలేలోకి అడుగు పెట్టారు. అందులో శివాజి, ప్రియాంక, ప్రశాంత్, అమర్‌దీప్, ప్రిన్స్, అర్జున్‌లు ఉన్నారు. వీళ్లంతా చివరి వారం విజేతను నిర్ణయించే ఓటింగ్‌లో నిలిచారు.

Bigg Boss Telugu 7 Winner:Sivaji Getting Huge Votes and Prashanth Getting Huge Missed Calls In Final Week

మిడ్ వీక్ ఎలిమినేషన్ లేనట్టే:గత సీజన్‌లో మాదిరిగానే ఇప్పుడు కూడా ఆరుగురు కంటెస్టెంట్లను ఫినాలే వీక్‌లోకి పంపించారు. అయితే, వీళ్లలో ఒకరు ఈ వారం మధ్యలోనే ఎలిమినేట్ అవుతారని జోరుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఇందులో భాగంగానే బుధవారం లేదా శుక్రవారం ఒకరిని పంపుతారని టాక్ వినిపించింది. కానీ, ఊహించని విధంగా ఈ సారి మిడ్ వీక్ ఎలిమినేషన్ తీసేశారని తాజాగా తెలిసింది.

ఫినాలేకు సర్వం సిద్ధంగానే:ప్రస్తుతం ప్రసారం అవుతోన్న ఏడో సీజన్‌లో టాప్ 6 కంటెస్టెంట్లు ఫైనలిస్టులుగా ఫిక్స్ అయిపోయారు. వీళ్లు నేరుగా గ్రాండ్ ఫినాలేలోకి అడుగు పెడుతున్నారు. ఇందులోనే ఒక్కొక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ రావడంతో పాటు విజేతను నిర్ణయించబోతున్నారు. ఈ ఎపిసోడ్ వచ్చే ఆదివారం (డిసెంబర్ 17వ తేదీ) సాయంత్రం 7 గంటలను నుంచి ప్రసారం అవబోతుంది.

Bigg Boss Telugu 7 Winner:Sivaji Getting Huge Votes and Prashanth Getting Huge Missed Calls In Final Week

రికార్డు ఓటింగ్.. పోటాపోటీగా:బిగ్ బాస్ ఏడో సీజన్‌లో ఫినాలే వీక్‌లో ఆరుగురు కంటెస్టెంట్లు టైటిల్ బరిలో నిలిచారు. దీంతో ప్రేక్షకులంతా తమకు నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించేందుకు పోటాపోటీగా ఓట్లను వేస్తున్నారు. ఫలితంగా ఈ సీజన్ మొత్తంలో తొలిసారి భారీ ఓటింగ్ నమోదు అవుతునట్లు తాజాగా తెలిసింది. గత సీజన్లలో మాదిరిగా ఈ సారి విజేత ఎవరన్నది ఇంకా డిసైడ్ కాలేదనే చెప్పుకోవాలి.

హాట్‌స్టార్ ఓట్లలో శివాజినే:ఫైనలిస్టులుగా ఉన్న ఆరుగురు కంటెస్టెంట్లకు రెండు పద్దతుల్లో ఓట్లు నమోదు అవుతున్నాయి. బిగ్ బాస్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. హాట్‌స్టార్‌ ద్వారా వచ్చే ఓట్లలో ఎక్కువ శాతం శివాజికి పోల్ అవుతున్నట్లు తెలిసింది. అతడి తర్వాత స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడని అంటున్నారు. ఇక, మూడో స్థానంలో అమర్‌దీప్ చౌదరి కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Bigg Boss Telugu 7 Winner:Sivaji Getting Huge Votes and Prashanth Getting Huge Missed Calls In Final Week

మిస్‌డ్ కాల్స్ రైతు బిడ్డకే:బిగ్ బాస్ షోలో తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ప్రేక్షకులు మిస్‌డ్ కాల్స్ ద్వారా కూడా ఓట్లు వేయొచ్చన్న విషయం తెలిసిందే. ఇందులో మాత్రం ఈ సారి రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ టాప్‌లో ఉన్నాడని అంటున్నారు. రూరల్‌ బ్యాగ్రౌండ్ ఉన్న కంటెస్టెంట్ కావడంతో కాల్సే ఎక్కువగా వస్తున్నాయట. ఇందులో శివాజి రెండో స్థానంలో, అమర్‌ మూడో స్థానంలో ఉన్నారని టాక్.

ఈ సీజన్ విజేత ఎవరంటే:హాట్‌స్టార్ ఓట్లలో శివాజి, మిస్‌డ్ కాల్ ఓట్లలో పల్లవి ప్రశాంత్ టాప్‌లో ఉండడంతో అసలు ఏడో సీజన్‌లో విజేతగా ఎవరు నిలుస్తారన్న దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అయితే, ఎక్కువ శాతం ఇందులో ప్రశాంతే గెలిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే, శివాజి రెండో స్థానంలో, అమర్‌, ప్రిన్స్, ప్రియాంక జైన్, అర్జున్‌లు తర్వాతి స్థానాల్లో ఉంటారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X