Bigg Boss 7 Winner: ఓటింగ్‌లో పెను సంచలనం.. మారిన విన్నర్, రన్నర్.. అమర్‌దీప్ పరిస్థితి ఏంటంటే!
బిగ్ బ్రదర్ అనే ఇంగ్లీష్ రియాలిటీ షో ఆధారంగా ప్రారంభమై.. చాలా తక్కువ సమయంలోనే ఇండియాలోనే నెంబర్ వన్ ప్లేస్‌ను అందుకుంది బిగ్ బాస్. చాలా ఏళ్ల క్రితమే వచ్చిన ఈ కార్యక్రమం.. తెలుగులోకి మాత్రం ఏడేళ్ల క్రితమే ఎంటరైంది. అప్పటి నుంచి హవాను చూపిస్తూ వరుసగా సీజన్లను పూర్తి చేసుకుంటోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడోది కూడా చివరి దశకు చేరుకుంది. మరో వారం రోజుల్లోనే ఈ సీజన్ విన్నర్ ఎవరో తెలిపోనుంది. దీంతో ఈ సారి బిగ్ బాస్ టైటిల్‌ను ఎవరు ముద్దాడబోతున్నారు అన్న దానిపై తాజా సమాచారం మీరే చూడండి!
ఉల్టా పుల్టా సీజన్ సక్సెస్
బిగ్ బాస్ ఏడో సీజన్‌ను ఉల్టా పుల్టా అనే కాన్సెప్టుతో తీసుకు వచ్చారు. దీంతో దీనిపై అందరిలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్లే ఈ సీజన్‌ను రసవత్తరంగా నడుపుతూ వచ్చారు. ప్రతి అంశంలోనూ కొత్తదనం చూపడంతో పాటు చాలా ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను ఇచ్చారు. ఫలితంగా ఈ సీజన్ అనుకున్న దానికంటే ఎక్కువగానే రేటింగ్ రాబట్టి సక్సెస్ అయింది.

ఎవరు వెళ్లిపోయారంటే
ఈ సీజన్‌లోకి 19 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో ఫస్ట్ వీక్ కిరణ్, 2వ వారంలో షకీలా, 3వ వారం దామిని, 4వ వారం రతికా, 5వ వారంలో శుభశ్రీ, 6వ వారంలో నయని, 7వ వారంలో పూజా, 8వ వారంలో సందీప్, 9వ వారంలో తేజ, 10వ వారం భోలేలు వెళ్లగా.. 11వ వారం ఎలిమినేషన్ జరగలేదు. 12వ వారం అశ్విని, రతిక, 13వ వారం గౌతమ్, 14వ వారం శోభాలు వెళ్లిపోయారు.
విన్నర్ కోసం ముందే
బిగ్ బాస్‌కు సంబంధించి గతంలో వచ్చిన ప్రతి సీజన్‌లోనూ విన్నర్‌ను నిర్ణయించే ఓటింగ్ చివరి వారంలోనే జరిగింది. కానీ, ఉల్టా పుల్టా సీజన్‌లో మాత్రం 14వ వారంలోనే దీన్ని మొదలు పెట్టారు. అందుకే ఫైనల్ అస్త్ర గెలిచిన అర్జున్‌ను కూడా ఇందులో యాడ్ చేశారు. అలాగే, గత వారం తక్కువ ఓట్లు వచ్చిన శోభా శెట్టిని ఎలిమినేట్ చేసి మిగిలిన వాళ్లను ఫినాలేకు పంపారు.

14వ వారంలో అతడికే
బిగ్ బాస్ షోలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. కానీ, ఓటింగ్ విషయం మాత్రం సుస్పష్టం అయ్యే సమాచారం బయటకు వస్తూనే ఉంది. అయితే, విన్నర్‌ను నిర్ణయించే ఫినాలే పోలింగ్ మాత్రం సీక్రెట్‌గా ఉంచారు. అయినప్పటికీ న్యూస్ లీక్ అవుతూనే వచ్చింది. ఇలా 14వ వారంలో పల్లవి ప్రశాంత్‌కు ఎక్కువ ఓట్లు వచ్చి విన్నర్ రేసులో టాప్‌లో ఉన్నట్లు తెలిసింది.
ఒక్కసారిగా మారిందిగా
14వ వారంలో ఎలిమినేషన్ కూడా ఉండడంతో ఓటింగ్ ఒక రకంగా జరిగింది. అయితే, ఆదివారం నుంచి ఇందులో మార్పు వచ్చినట్లు తాజాగా ఓ సంచలన న్యూస్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఇప్పుడు శివాజి టాప్ ప్లేస్‌కు చేరుకున్నాడని తెలిసింది. అతడికి భారీ ఓటింగ్ నమోదు అవుతుందని టాక్. దీంతో ప్రశాంత్ రెండో స్థానానికి పడిపోయాడనే టాక్ వినిపిస్తోంది.
అమర్ పరిస్థితి ఏంటి?
ఏడో సీజన్‌లో విజేతను నిర్ణయించే ఓటింగ్‌లో ఇప్పటి ట్రెండ్ కంటిన్యూ అయితే శివాజి విన్నర్‌గా, ప్రశాంత్ రన్నర్‌గా నిలిచే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఇక, మరో టైటిల్ ఫేవరెట్‌గా ఉన్న అమర్‌దీప్ చౌదరి మాత్రం మూడో స్థానానికి పరిమితం కావాల్సి వస్తుందని అంటున్నారు. అయితే, ఓటింగ్‌కు ఇంకా ఐదు రోజులు టైం ఉంది కాబట్టి ఈ ట్రెండ్ మారే చాన్స్ ఉంది.

టాప్ 5గా ఎవరెవరంటే
ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్‌ను బట్టి చూస్తే.. శివాజి, పల్లవి ప్రశాంత్, అమర్‌దీప్ చౌదరి స్థానాలు దాదాపుగా కన్ఫార్మ్ అయిపోయాయి. మిడ్ వీక్ ఎలిమినేషన్‌లో ప్రిన్స్ యావర్, ప్రియాంక జైన్, అంబటి అర్జున్‌లో ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. ఆ మిగిలిన ఇద్దరు మాత్రమే టాప్ 5కి చేరుతారు. ప్రస్తుత ఓటింగ్‌లో అర్జున్ చివరి స్థానంలో ఉన్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











