Bigg Boss Boss Telugu 7: అమర్ దీప్‌కు కుక్కతోక వంకర ట్యాగ్, రైతుబిడ్డ ఏకులా వచ్చి మేకులా తయారయ్యాడట!
Medal Nommination Task: బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోలో ఎవరు గెలుస్తారనేదానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. తమకు నచ్చిన వారికి సపోర్ట్ చేస్తూనే నచ్చిని వారు వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు చాలా మంది. అలాగే నచ్చని వారు చేసే కామెంట్లను ట్రోల్స్ చేస్తున్నారు. నచ్చిన వారి వీడియోలు ఫుల్ వైరల్ అయ్యేలా కూడా చాలా మంది కష్టపడుతున్నారు. ముఖ్యంగా నామినేషన్స్ అయిపోయినప్పటి నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని తెగ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలా అందరూ కోరుకునే ఎపిసోడ్ రానే వచ్చేసింది. ఈరోజుటి ఎపిసోడ్ లో ఓ కంటెస్టెంట్ ఇంటిని వదిలి వెళ్లిపోనున్నారు.
ఈక్రమంలోనే సండే ఫండే కాబట్టి.. ముందుగా నాగార్జున స్టేజీ మీదకు ఓ అద్భుతమైన సాంగ్ తో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడే విడుదల అయిన ప్రోమో చూస్తుంటేనే ఆ విషయం అర్థం అయిపోతుంది. ముఖ్యంగా అటాడుకుందాం రా అందగాడా.. చందురూడా అంటూ సాగే పాటకు అమ్మాయిలంతా.. నాగ్ ను లాక్కొస్తారు. అలా అదిరిపోయే స్టెప్పులు వేసిన తర్వాత హౌస్ మేట్స్ ను చూపిస్తారు. ఈక్రమంలోనే నాగార్జున వారికి ఓ అదరిపోయే టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే... మెడల్ నామినేషన్స్ టాస్క్. ఈ టాస్కులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన సామెతల ట్యాగ్ ఎవరికి సెట్ అవుతుందో వారికి ఇవ్వాల్సి ఉంటుంది.

అమర్ దీప్‌కు కుక్కతోక వంకర ట్యాగ్:ఇందులో ముందుగా భోలె షవాళిని నాగార్జున లేపగా.. కుక్క తోక వంకర అనే ట్యాగ్ ను తీసుకొని అమర్ దీప్ మెడలో వేశాడు. ఆటల్లో అతడు బాగా నచ్చినప్పటికీ.. నామినేషన్ల అప్పుడు రివెంజ్ అనే పదం వాడి వెంటనే నామినేట్ చేయడం తనకు నచ్చలేదని.. అందుకే ఆ ట్యాగ్ ఇచ్చినట్లు వివరించాడు. ఇక ఆ తర్వాత లేచిన అమర్ దీప్.. గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్క వాసన అనే ట్యాగ్ తీసుకెళ్లి అశ్విని మెడలో వేశాడు. వెంటనే ఆమె ఒక డెసీషన్ నుంచి మరో డెసీషన్ కు మారిపోతుందని చెప్పుకొచ్చాడు.
రైతుబిడ్డకు ఏకులా వచ్చి మేకలా తగులుకున్నాడు ట్యాగ్.. :ఆ తర్వాత వచ్చిన అంబటి అర్జున్ ఏకులా వచ్చి మేకులా తగులుకున్నాడు అనే ట్యాగ్ ను రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ కు ఇచ్చాడు. అది ఎందుకు ఇచ్చావని నాగార్జున అడగ్గా.. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ కి వచ్చినప్పుడు ఎవరూ ఎక్స్ పెక్ట్ చేయలేదు ఇంత బాగా ఆడతాడని.. కానీ వీడు చాలా బాగా ఆడి ఇక్కడే మేకులా పాతుకుపోయాడని చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత నిల్చున్న పల్లవి ప్రశాంత్.. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అనే ట్యాగ్ ను టేస్టీ తేజకు ఇచ్చాడు. ఈక్రమంలోనే తేజ గురించి చెబుతూ అక్కడ ఏం ఉండదు కానీ... గొడవ మాత్రం బాగా చేస్తాడని వివరించాడు.

ఇక ఆ తర్వాత వచ్చిన టేస్టీ తేజ పొరుగింటి పుల్లకూర రుచి అనే ట్యాగ్ తీసుకొని భోలె షవాళి మెడలో వేశాడు. నేను చేసే వంట కంటే ఆయన చేసే వంటే బాగుంటుందంటాడని తెలిపాడు. అలాగే ప్రియాంక జైన్ నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుందనే సామెతను అశ్వినికీ ఇస్తుంది. ఏం తెలియకుండానే నోరు పారేసుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత వచ్చిన రతికా రోజ్.. ఓడ ఎక్కే వరకు ఓడ మల్లన్న ఓడ ఎక్కాక బోడి మల్లన్న అనే ట్యాగ్ తీసుకొని భోలె మెడలో వేస్తుంది. ఇలా ఆద్యంతం ఆకట్టుకున్న ఈ ప్రోమో చూస్తుంటే.. ఎపిసోడ్ పూర్తిగా చూడాలనిపిస్తోంది.


Click it and Unblock the Notifications











