Bigg Boss 7: ఏడో సీజన్‌పై సెన్సేషనల్ లీక్.. అప్పుడే ఆ స్టార్లతో డీల్స్.. ఎప్పుడు రాబోతుందో తెలిస్తే!

బుల్లితెరపై ప్రసారం అయ్యే షోలు అన్నీంటికీ ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందన్న గ్యారెంటీ లేదు. అలాంటిది ఏదైనా కొత్త కంటెంట్‌తో నడిచే షో వస్తే.. అసలు అది క్లిక్ అవుతుందో లేదో కూడా చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఇలానే ఆరేళ్ల క్రితం తెలుగులోకి వచ్చి.. ఎవరూ ఊహించని విధంగా సూపర్ సక్సెస్ అయింది బిగ్ బాస్ షో. అంతేకాదు, ఇప్పటికే ఏకంగా ఆరు సీజన్లను కూడా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఏడో దానిని కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సీజన్ గురించి ఓ న్యూస్ లీకైంది. ఆ సంగతులు మీకోసమే!

 ఏకంగా ఆరు సీజన్లు కంప్లీట్

ఏకంగా ఆరు సీజన్లు కంప్లీట్


దాదాపు 16 ఏళ్ల క్రితమే హిందీలో బిగ్ బాస్ షో ప్రారంభం అయింది. ఆ తర్వాత ఇది పలు భాషల్లో ప్రసారం అవుతోంది. ఈ క్రమంలోనే ఐదేళ్ల క్రితం తెలుగులోకి కూడా పరిచయమైంది. అప్పట్లో ఈ షోపై నీలినీడలు కమ్ముకున్నాయి. కానీ, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. ఫలితంగా ఇప్పటికే ఆరు రెగ్యూలర్ సీజన్లను పూర్తి చేసుకుంది.

 ముగ్గురు స్టార్ హీరోలు వల్లే

ముగ్గురు స్టార్ హీరోలు వల్లే


తెలుగులో వచ్చే బిగ్ బాస్ షోకు అన్ని భాషల కంటే ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఇప్పటి వరకూ దీన్ని హోస్ట్ చేసిన హీరోలు కూడా ఈ సక్సెస్‌లో ప్రధాన పాత్రను పోషించారు. మొదటి సీజన్‌ను ఎన్టీఆర్, రెండో సీజన్‌ను నాని, మూడు నుంచి ఆరు సీజన్లను నాగార్జున తమ తమ అద్భుతమైన హోస్టింగ్‌తో నడిపించి సక్సెస్ చేశారు.

ఆరోది మాత్రం అట్టర్ ఫ్లాప్

ఆరోది మాత్రం అట్టర్ ఫ్లాప్


తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో ఎంతటి సక్సెస్ అయిందో అందరికీ తెలిసిందే. కానీ, ఇటీవలే ముగిసిన ఆరో సీజన్ మాత్రం మొదటి నుంచే ఎంతో చప్పగా సాగింది. దీనికితోడు ఫేక్ ఎలిమినేషన్స్, పసలేని టాస్కులు, లవ్, రొమాన్స్, గొడవలు అంతగా లేకపోవడంతో దీనికి రేటింగ్ కూడా సరిగా రాలేదు. దీంతో ఇది తెలుగు బిగ్ బాస్ చరిత్రలోనే అట్టర్ ఫ్లాప్ సీజన్ అయింది.

నాగార్జున ఔట్.. ఆ హీరోలు

నాగార్జున ఔట్.. ఆ హీరోలు


బిగ్ బాస్ ఆరో సీజన్‌ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దీంతో షో యూనిట్ తీవ్ర నిరాశగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ షో నుంచి హోస్ట్ నాగార్జున కూడా తప్పుకుంటున్నాడని ఓ న్యూస్ ఇప్పటికే లీక్ అయింది. అదే సమయంలో దీన్ని దగ్గుబాటి రానా హోస్ట్ చేస్తాడని కూడా ప్రచారం జరుగుతోంది. అలాగే, మరికొందరు స్టార్ హీరోల పేర్లు కూడా తెరపైకి వచ్చేస్తున్నాయి.

నాన్ స్టాప్ సీజన్ క్యాన్సిల్

నాన్ స్టాప్ సీజన్ క్యాన్సిల్


టీవీలో ప్రసారం అయ్యే రెగ్యూలర్ సీజన్‌తో పాటు ఈ ఏడాది ఆరంభంలోనే బాస్ నాన్ స్టాప్ అనే ఓటీటీ వెర్షన్‌ షోను కూడా నడిపించిన విషయం తెలిసిందే. ఇది సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో రెండో సీజన్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సీజన్‌ను క్యాన్సిల్ చేస్తున్నారని తాజాగా తెలిసింది. అంటే.. వచ్చే ఏడాది ఈ షో ప్రసారం కాదన్నమాట.

జూలై నుంచే ఏడో సీజన్

జూలై నుంచే ఏడో సీజన్


బిగ్ బాస్ ఆరో సీజన్ డిజాస్టర్ అవడంతో ఏడో దాన్ని ఎలాగైనా సక్సెస్ చేయాలన్న పట్టుదలతో నిర్వహకులు ఉన్నారని తెలిసింది. ఇందులో భాగంగానే దీన్ని వీలైనంత త్వరగా ప్రారంభించాలని ప్లాన్ చేసుకుంటున్నారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే దీన్ని వచ్చే ఏడాది జూలైలోనే మొదలు పెట్టాలని నిర్వహకులు నిర్ణయం తీసుకున్నారని తాజాగా న్యూస్ లీకైంది.

అప్పుడే సంప్రదింపులు

అప్పుడే సంప్రదింపులు


బిగ్ బాస్ ఏడో సీజన్‌తో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కాలని భావిస్తోన్న నిర్వహకులు.. ఇందులో భాగంగానే ముందుగా హోస్ట్‌ను ఫైనలైజ్ చేసే ప్రయత్నాలు ప్రారంభించారట. అదే సమయంలో కంటెస్టెంట్లుగా తీసుకునేందుకు పేరున్న సెలెబ్రిటీలతో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని తెలిసింది. ఇక, ఏడో సీజన్‌పై వచ్చిన ఈ వార్తతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతోన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X