అరియానా నువ్వు అవినాష్ క్యాండిటేట్‌వా? సోహైల్ సైటర్‌కు దిమ్మ తిరిగే అన్సర్

బిగ్‌బాస్ ఇంటిలో బ్లాక్‌బస్టర్ పేరుతో సినిమా షూటింగ్ టాస్క్ మొదలైంది. ఈ టాస్క్‌లో భాగంగా అభిజిత్ డైరెక్టర్‌గా, అవినాష్ స్క్రిప్టు రైటర్‌గా, లాస్య మేకప్ ఆర్టిస్టుగా, నోయల్ సీన్ సినిమాటోగ్రాఫర్‌గా, అమ్మా రాజశేఖర్ కొరియోగ్రాఫర్‌గా నటించారు. ఈ టాస్క్‌లో రూపొందించిన సినిమాను శనివారం ఎపిసోడ్‌లో భారీ ప్రీమియర్‌ ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. ఈ సినిమా ప్రదర్శన తర్వాత అవార్డుల కార్యక్రమాన్ని నిర్వహించారు. అది ఎలా సాగిందంటే..

ఐటెమ్ రాజాగా సోహైల్.. ఐటెమ్ రాణిగా దేత్తడి హారిక

ఐటెమ్ రాజాగా సోహైల్.. ఐటెమ్ రాణిగా దేత్తడి హారిక

బ్లాక్‌బస్టర్ టాస్క్‌లో భాగంగా తీసిన సినిమాకు ప్రేమ మొదలైంది అనే టైటిల్‌ను పెట్టారు. యాంకర్ లాస్య సూచించిన పేరు తోపు.. దమ్ముంటే ఆపు టైటిల్‌ను పక్కన పడేసినట్టు కనిపించింది. అయితే ఈ సినిమాలో అఖిల్, మోనాల్ హీరో, హీరోయిన్లుగా, సెకండ్ జంటగా అరియానా, అవినాష్ నటించారు. ఇక దేత్తడి హారిక, సోహైలిద్దరు ఐటమ్ రాజా, ఐటమ్ రాణిగా కెవ్వు కేక పాటకు స్టెప్పులేశారు.

బీబీ అవార్డుల కార్యక్రమంలో

బీబీ అవార్డుల కార్యక్రమంలో

ఇక అవార్డు కార్యక్రమానికి ప్రేమ మొదలైంది యూనిట్‌ను ఆహ్వానించారు. ఈ అవార్డుల కార్యక్రమానికి యాంకర్లుగా లాస్య, సోహైల్ వ్యవహరించారు. ఈ సందర్భంగా కొన్ని సన్నివేశాల్లో మీ కళ్లలో స్పార్క్ చాలా బాగుంది అంటూ అఖిల్‌తో లాస్య అంటుండగా.. అంతా మా డైరెక్టర్ అభిజిత్ నేర్పించారు అంటుండగా.. నేనేమీ నేర్పించలేదు అంటూ అభిజిత్ కామెంట్ విసిరారు.

నీ ప్యాంట్ ఎక్కడ కుట్టించావు

నీ ప్యాంట్ ఎక్కడ కుట్టించావు

యాంకర్లుగా వ్యవహరిస్తున్న లాస్య, సోహైల్‌ సెలబ్రిటీలను ఆటపట్టించేందుకు ప్రయత్నించారు. ప్రేమ మొదలైంది సినిమాలో మిమ్మల్ని అవినాష్ రికమెండ్ చేశారటగా అంటూ అరియానాపై సోహైల్ సెటైర్ వేశారు. అలాగే నీ ప్యాంట్ బాగుంది. ఎక్కడ కుట్టించారు అంటూ మెహబూబ్‌పై సెటైర్ వేయబోగా.. సోహైల్ టైలర్స్‌లో అంటూ షాకిచ్చాడు.

Recommended Video

Bigg Boss Telugu 4 : ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా ? నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్,ఏడ్చేసిన సోహైల్
ఎవడ్రా నన్ను నామినేట్ చేసిందంటూ..

ఎవడ్రా నన్ను నామినేట్ చేసిందంటూ..

ఇక ఇంటిలో సెలబ్రీటల ఫోటోలను ప్రదర్శిస్తూ.. ఆడగెటప్‌లో తన ఫోటోను చూస్తూ.. నా జీవితంలో అంత అందమైన అమ్మాయిని చూడలేదు అంటూ అవినాష్ కామెంట్ చేశారు. అలాగే అరియానా ఫోటోలను చూస్తూ ఎవడ్రా నన్ను నామినేట్ చేశాడు అంటూ వేదికపై అమ్మా రాజశేఖర్ వీరంగం ప్రదర్శించారు. అలాగే ఫోటోలను చూస్తూ.. మొదటి ఫోటోలో సోహైల్ ఆవేశాన్ని చూస్తూ కథ వేరే ఉంటుంది అని.. రెండో ఫోటోలో నా కథ నాకే అర్థం కావడం లేదు అని అవినాష్ అనడంతో ఇంటి సభ్యుల్లు నవ్వులో మునిగిపోయారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X