Bigg Boss Telugu 8 Voting : ఓటింగ్‌లో ఫ్లాప్, ఆ ఇద్దరిపై వేలాడుతోన్న ఎలిమినేషన్ కత్తి.. ఈ వీక్ డబుల్ ట్విస్టా?

బిగ్‌బాస్ తెలుగు 8 చూస్తుండగానే సెకండ్ వీక్ ఎండింగ్‌కి వచ్చేసింది. శనివారం కావడంతో హోస్ట్ నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఈ వారం జరిగిన షోలో కంటెస్టెంట్స్ ఆటతీరుపై విశ్లేషణ చేయనున్నారు. ఏ కంటెస్టెంట్ బాగా ఆడాడు.. ఎవరు బాగా ఆడలేదో వివరించనున్నాడు. అన్నింటికి మించి బిగ్‌బాస్ తెలుగు 8లో సెకండ్ వీక్ ఎవరు ఎలిమినేట్ కాబోతున్నారనే అంశం చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో ఓటింగ్ ఎలా జరిగిందో ఒకసారి పరిశీలిస్తే :

బిగ్‌బాస్ తెలుగు 8లో సెకండ్ వీక్ అత్యధికంగా 8 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్‌లో ఉన్నారు. విష్ణుప్రియ, నిఖిల్, నైనిక, నాగ మణికంఠ, శేఖర్ భాషా, ఆదిత్య ఓం, కిర్రాక్ సీత, పృథ్వీలు నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో ఒకరు ఈవారం హౌస్‌ను వీడనున్నారు. వీరిలో సేఫ్ జోన్‌లో ఉంది విష్ణుప్రియ, నిఖిల్‌, నాగమణికంఠలేనట. విష్ణుప్రియ, నిఖిల్‌లు ఓటింగ్ పరంగా టాప్‌లో ఉన్నారని వినికిడి. ఫుడ్ టాస్క్‌లలో ఫెయిలైనా .. ప్రైజ్‌మనీ పెద్ద మొత్తంలో ఉన్న క్లాన్ చీఫ్‌గా నిఖిల్ దూసుకెళ్తున్నాడు.

Bigg Boss Telugu 8 2nd Week Elimination Kirrak Seetha and aditya om in danger zone here s the details

విష్ణుప్రియతో చైల్డీష్ మెంటాలిటీ. మనసులో ఏది ఉంచుకోకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతుండటం, పైగా సెలబ్రెటీ కావడంతో ఆమెకు మంచి ఓట్లు పడుతున్నాయట. సోనియాతో నానామాటలు అనిపించుకున్నా.. ఆమెకు వెళ్లి థ్యాంక్స్ చెప్పడం విష్ణుప్రియ మైండ్ సెట్‌ని తెలియజేస్తోంది. మణికంఠ టాస్క్‌లలో ఇరగదీస్తూ పంతం నెగ్గించుకుంటున్నాడు. ఎమోషనల్ డ్రామాతో ఇతను దూసుకొస్తున్నాడు. నైనిక, పృథ్వీలు డేంజర్‌ జోన్‌లో ఉన్నా బయటపడతారని ఓటింగ్ రిజల్ట్స్ చెబుతున్నాయి.

ఏటోచ్చి శేఖర్ భాషా, కిర్రాక్ సీత, ఆదిత్య ఓంల పరిస్ధితి ఆందోళనకరంగా ఉంది. తన సమయస్పూర్తి , జోక్స్‌తో హౌస్‌లో మంచి ఫన్ క్రియేట్ చేస్తున్న శేఖర్ భాషాకు ఇంటి సభ్యులతో పాటు నాగార్జున అండదండలు ఉన్నాయి. నవ్వుతూ పలకరించడం, ఎవరైనా సీరియస్ అయినా వారిని కూల్ చేస్తుండటంతో శేఖర్‌కు అంతా ఫ్యాన్స్ అయిపోతున్నారు. కాకపోతే టాస్క్‌లలో శేఖర్ వీక్ కావడం పెద్ద మైనస్ . అలాగే ఆర్గ్యూమెంట్ల విషయంలోనూ ఆయన డల్‌గా కనిపిస్తున్నారు. ఆయన కనుక ఇందులో సక్సెస్ అయితే టాప్ 5 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా నిలుస్తారని అంటున్నారు. శేఖర్ భాషా ఈ వారం ఏదో లాగా సేవ్ అవుతారని టాక్.

టాప్ కంటెస్టెంట్స్‌లో ఒకరైన కిర్రాక్ సీత, ఆదిత్య ఓంలపై ఎలిమినేషన్ కత్తి వేలాడుతోంది. ఓటింగ్‌లో చిట్ట చివరన ఉన్నది ఆదిత్య ఓం, సీతలే కావడం గమనార్హం. పెద్దగా ఫ్యాన్ ఫాలోయింగ్ లేకపోవడంత వీరిద్దరికి మైనస్‌గా మారింది. కిర్రాక్ సీత టాస్క్‌ల్లోనూ, డిస్కషన్‌లోనూ పోరాడుతోంది. అయితే ప్రతీదానికి సీరియస్ కావడం, లేనిపోని తగాదాలు ఆమెను ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు.. ఎవ్వరితోనూ ఏ విభేదాలు లేకపోవడం మంచిదే అయినా ఇంట్లో ఉన్న వాళ్లతో ర్యాపో క్రియేట్ కాకపోవడం , ఫుటేజ్‌లో ఎక్కడా కనిపించకపోవడం ఆదిత్య ఓంను ఇబ్బంది పెట్టే అంశాలు. పైగా వయసు పెద్దది కావడంతో ప్రేక్షకులు ఆయనకు తమ ఓటు వేసేందుకు ఇష్టపడటం లేదు. మరి వీరిద్దరిలో ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి. అయితే డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయని సోషల్ మీడియా టాక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X