Bigg Boss Telugu 8 Nominations: యష్మీ బూతు పురాణం.. మణికంఠపై రివెంజ్ అలా, ఈ వారం నామినేషన్స్‌లో వీరే !!

బిగ్‌బాస్ తెలుగు 8 సక్సెస్‌ఫుల్‌గా సెకండ్ వీక్‌ను పూర్తి చేసుకుంది. రెండో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారోన్న సస్పెన్స్‌కు తెరదించుతూ ఆర్జే శేఖర్ భాష హౌస్‌ను వీడారు. సీజన్‌కే బిగ్గెస్ట్ ట్విస్ట్ అంటూ భాషాను ఎలిమినేట్ చేస్తున్నట్లుగా ప్రకటించారు హోస్ట్ అక్కినేని నాగార్జున. తొలి వారం బెజవాడ బేబక్క, సెకండ్ వీక్ శేఖర్ భాషాలు హౌస్‌ను వీడగా.. ప్రస్తుతం ఇంట్లో 12 మంది కంటెస్టెంట్స్ మిగిలారు. మరి మూడో వారం నామినేషన్స్‌లో ఎవరెవరు ఉండబోతున్నారో చూస్తే:

మూడో వారానికి గాను ఇంటి సభ్యులను శక్తి, కాంతారా అని విభజించి.. శక్తి క్లాన్‌కు నిఖిల్, కాంతారా క్లాన్‌కు అభయ్‌లు చీఫ్‌లుగా ఉంటారని చెప్పారు నాగ్. ఏ క్లాన్‌లోకి వెళ్లాలన్నది కంటెస్టెంట్స్‌కే వదిలేశాడు కింగ్. దీంతో నిఖిల్ టీమ్‌లోకి విష్ణుప్రియ, పృథ్వీ, సోనియా, శేఖర్ భాషా, సీత, నైనికలు వచ్చారు. అభయ్ టీమ్‌లోకి ప్రేరణ, యష్మీ గౌడ, ఆదిత్య ఓం, నబీల్, నాగమణికంఠలు వెళ్లారు.

Bigg Boss Telugu 8 3rd Week Nominations naga manikanta forcefully fixed for elimination by yashmi gowda

నామినేషన్స్‌లో ఉన్న ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ రాగా.. చివరికి శేఖర్ భాషా, ఆదిత్య ఓంలు మిగుల్తారు. వీరిలో ఎవరు ఇంట్లో ఉండాలి.. ఎవరు బయటకు వెళ్లాలనేది కంటెస్టెంట్స్ నిర్ణయిస్తారని నాగ్ చెప్పగా ఆదిత్య ఓం ఇంట్లోనే ఉండాలని ఎక్కువమంది ఓట్లు వేయడంతో శేఖర్ భాషాను ఎలిమినేట్ చేస్తున్నట్లు నాగ్ ప్రకటించారు. సీత, విష్ణుప్రియ, ప్రేరణలు రియల్ అని.. నాగమణికంఠ ఫేక్ అని వెళ్తూ వెళ్తూ శేఖర్ భాషా చెబుతాడు.

మూడో వారం మాత్రం ఓ రేంజ్‌లో జరుగుతాయని అర్ధమవుతోంది. కంటెస్టెంట్స్ తాము నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిపై చెత్తను కుమ్మరించి రీజన్ చెప్పాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా నువ్వు గెలవాలన్న స్పిరిట్ నాకిష్టం, కానీ నువ్వు ఎలా గెలుస్తావ్ అన్నది తనకు నచ్చలేదని సీత .. పృథ్వీని ఉద్దేశించి అంటుంది. నేనొక టీమ్‌లో ఆడినప్పుడు .. అపోజిట్ టీమ్‌ని ఎలాగైనా ఓడించాలనే ఆడతానని పృత్వీ తేల్చిచెబుతాడు.

యష్మీని నామినేట్ చేసిన మణికంఠ తన రీజన్స్ చెప్పాడు. ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు కడగటం లేదు.. ఇలా అన్నీ చూడాలి అంటూ మణికంఠ చెబుతాడు.. అయితే మా టీమ్‌కి పవర్ వచ్చినప్పుడు మాకు ఆ అవసరం లేదని యష్మీ చెబుతుంది. దీంతో చిరాకు పడిన మణికంఠ.. నేను మాట్లాడేటప్పుడు ప్లీజ్ లిజన్ లేడీ అంటూ ఫైర్ అవుతాడు. నువ్వు నా దగ్గరికొచ్చి డ్రామాలు చేస్తావ్ అంటూ యష్మీ డైలాగ్ వదులుతుంది. నాకు పర్సన్ క్వాలిటీ నచ్చకపోతే రైజ్ చేస్తానని మణికంఠ చెప్పగా.. నువ్వేంటీ బొక్క రైజ్ చేసేదని యష్మీ బూతులు మాట్లాడుతుంది.

ఆ వెంటనే మణికంఠపై రివెంజ్‌ తీర్చుకునేలా రివర్స్‌లో నామినేట్ చేసింది.. ఈ హౌస్‌లో ఉన్నన్ని రోజులు నిన్ను నామినేషన్స్‌లో తీసుకుంటానని తేల్చి చెబుతుంది యష్మీ. నువ్వు నా హార్ట్ బ్రోక్ చేశావ్.. ఫ్రెండ్‌షిప్ పేరుతో నన్ను మోసం చేశావని మండిపడుతుంది. అది మోసం కాదని మణికంఠ ఏదో చెప్పబోతుండగా.. ఇది నా నామినేషన్ గురూ నిల్చో అంటుంది. అయితే చూస్తా గురూ అని మణికంఠ ధీటుగానే బదులిచ్చాడు. అలాగే సాక్స్ టాస్క్‌లో సంచాలక్‌గా సరిగా వ్యవహరించలేదంటూ ప్రేరణను విష్ణుప్రియ నామినేట్ చేసింది. సోనియాను నైనిక నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం ప్రేరణ, పృథ్వీ, యష్మీ, విష్ణుప్రియ, సోనియా , కిర్రాక్ సీత ఉన్నారు. సోమవారం నాటి నామినేషన్స్ ఎపిసోడ్ హాట్ హాట్‌గానే జరిగే అవకాశం ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X