BIGG BOSS TELUGU 8: బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లోకి 8 నెలల వివాహిత.. ఆ కంటెస్టెంట్ గురించి మీకు తెలుసా?
తెలుగు ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా లాంచ్ అయ్యింది. స్టైలీష్ లుక్‌లో ఎంటరైన నాగ్ వచ్చి రాగానే హౌస్ నియమ నిబంధనల గురించి వివరించారు. బిగ్‌బాస్ తెలుగు 8 సెట్ ఎలా ఉండబోతుందో ఒక్కక్క గది గురించి ఆయన ప్రజేంటేషన్ ఇచ్చారు. ఆ వెంటనే మంచి జోష్ ఉన్న పాటలకు స్టెప్పులు వేస్తూ కంటెస్టెంట్స్ ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకు వచ్చారు.
తొలుత సీరియల్ నటి యాష్మీ గౌడ , నిఖిల్ గౌడలను ఒక జంటగా లోపలికి పంపుతారు నాగార్జున. ఆ వెంటనే అభయ్ స్టేజ్ మీదకి వస్తాడు. అతనిని కూడా నువ్వు సింగిల్‌గా హౌస్‌లోకి వెళ్లవని, ఓ బడ్డీతోనే కలిసి వెళ్తావని చెప్పి యాష్మీ లాగే ఆపేస్తాడు. బడ్డీని సెలెక్ట్ చేసుకునే ఛాన్స్ నీదేనని చెప్పి.. బోర్డుపై రెడ్, గ్రీన్, యెల్లో మూడు కలర్స్ చూపిస్తాడు. దీంతో అభయ్ పసుపు రంగు సెలెక్ట్ చేసుకుంటాడు.

అప్పుడు బోర్డ్ రివర్స్ అయి your buddy is వాగుడుకాయ , fighter, తెలివి అని ఉంటుంది. అతనిని లోపల వెయిట్ చేయమని చెప్పగా.. పుష్ప-2 , రంజితమే సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ సీరియల్ నటి ప్రేరణ కంభం ఎంట్రీ ఇస్తుంది. నాగ్ ఆమెకు హాయ్ చెప్పగా.. షాక్ తగిలినట్లుగా ఆయననే చూస్తుంటుంది. ప్రేరణ అంటేనే ఇన్స్‌పిరేషన్ అని నాగ్ అనగా.. తాను షాక్‌లో ఉండిపోయానని, మీరొస్తారని తనకు తెలిసినా ఇంత దగ్గరిగా చూసే సరికి మాట్లాడలేకపోతున్నానని ప్రేరణ్ ఆన్సర్ ఇస్తుంది.
చైల్డ్ హుడ్ నుంచి మీ మూవీస్ చూస్తున్నానని, అప్పుడెలా ఉన్నారో.. ఇప్పుడు అలాగే ఉన్నారని మీరు నిజంగా మన్మథుడేనంటూ నాగ్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. తనకు డబ్బు కావాలి, సంతోషం, మంచి రిలేషన్, చేస్తున్న పనిలో తృప్తి చెందాలని ప్రేరణ అంటుంది. స్పోర్ట్స్ చాలా బాగా ఆడతావని విన్నానంటూ నాగ్ అనగా.. తాను పొట్టిగా అయిపోతానేమో భయపడి లాంగ్ జంప్, హైజంప్, బేస్ బాల్, సాఫ్ట్ బాల్, రగ్బీ ఆడానని ప్రేరణ చెబుతుంది. అన్నీ గేమ్స్ ఆడొచ్చావు కదా మా హౌస్‌లో చాలా ఆటలుంటాయి.. ఆడుకో అని నాగ్ అంటారు. తాను అలా ఆడితే మిగిలిన కంటెస్టెంట్స్ పరిస్థితి ఏంటో భయంగా ఉందని ప్రేరణ్ పంచ్ డైలాగ్ విసురుతుంది.
తాను రష్మిక మందన్నా చాలా క్లోజ్ అని షాకింగ్ న్యూస్ బయట పెట్టింది ప్రేరణ. ఆమెతో తనకు ఎన్నో మెమొరీస్ ఉన్నాయని, తెల్లవారుజామున 2 గంటలకు స్కూటీపై తిరిగిన రోజులున్నాయని తెలిపింది. హౌస్‌లోకి వెళ్లే ముందు నీకు చిన్న టెస్ట్ పెడతానని నాగ్ చెబుతూ.. నీకు పెళ్లయి ఎన్ని నెలలు అవుతుందని అడుగుతారు. దానికి ప్రేరణ 8 నెలలు అని సిగ్గుపడుతూ .. బిగ్‌బాస్ తెలుగు 8 ఆఫర్ రావడం చాలా పెద్దదని ఆన్సర్ ఇస్తుంది.
పెళ్లయిన 8 నెలల్లో నీ హజ్బెండ్‌ని ఎంత అర్ధం చేసుకున్నావో చెప్పాలంటూ ..కొన్ని క్వశ్చన్స్, ఆమె భర్త శ్రీపాద్ చెప్పిన ఆన్సర్స్‌ని డిస్‌ప్లే చేస్తాడు నాగ్. అందులో మూడు క్వశ్చన్స్‌కు కరెక్ట్‌గా, మరో మూడింటికి రాంగ్ ఆన్సర్స్ ఇస్తుంది ప్రేరణ. అనంతరం నువ్వు ఈ హౌస్‌లోకి సోలోగా వెళ్లడం లేదని బడ్డితో కలిసి వెళ్తున్నావంటూ చెబుతాడు నాగ్. ఆపై అభయ్‌ని పిలిచి.. మీ ఇద్దరికి హౌస్‌లో లిమిట్‌లెస్‌గా ఏం కావాలని అడగ్గా.. ప్రేరణ నిద్ర , అభయ్ టీ కావాలని చెబుతారు. తర్వాత వారిద్దరికి ఆల్ ది బెస్ట్ చెప్పి హౌస్‌లోకి పంపుతారు నాగార్జున.


Click it and Unblock the Notifications











