Bigg Boss Telugu 8: 50 మంది ఆడపిల్లలకు అన్నీ తానై... ఎవరీ రేర్ క్యారెక్టర్ సోనియా ఆకుల..?
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా ప్రారంభమైంది. సినీనటి సోనియా ఆకుల హౌస్‌లోకి అడుగుపెట్టారు. దీంతో ఆమె నేపథ్యం, కుటుంబ వివరాల గురించి నెటిజన్లు ఆన్‌లైన్‌లో సెర్చ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనియా ఆకుల బయోడేటా మీ కోసం.
సోనియా ఆకుల తెలంగాణ అమ్మాయి. పెద్దపల్లి జిల్లా మంథనిలో జన్మించిన ఆమె 9వ తరగతి వరకు అక్కడే చదువుకున్నారు. అనంతరం హన్మకొండలోని ఎస్ఆర్ స్కూల్‌లో టెన్త్, హైదరాబాద్‌లోని భోజ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ అభ్యసించారు. కొంతకాలం పాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన సోనియ తర్వాత సినీ రంగ ప్రవేశం చేశారు. తల్లిదండ్రులు చక్రపాణి, మల్లీశ్వరి. అమ్మ ఇంట్లోనే బట్టల వ్యాపారం చేస్తూ కుటుంబానికి ఆసరాగా నిలిచేది. సోనియాకు ఇద్దరు అన్నయ్యలు. పిల్లలను చదివించడానికి అమ్మానాన్న ఎంతో కష్టపడేవారని సోనియ గుర్తుచేసుకుంటారు.

ఇంజనీరింగ్ తర్వాత కొన్నాళ్లు వాటర్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగం చేసింది సోనియా. తెలుగు, ఇంగ్లీష్, హిందీ అనర్గళంగా మాట్లాడుతుండటంతో ఆమె చురుకుదనం చూసి పలు కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను అధికారులుకు సోనియాకు అప్పగించారు ఉన్నతాధికారులు. ఈ క్రమంలోనే తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ కళ్లలో పడ్డారు. సినీవారం అనే ప్రోగ్రామ్‌లో అవకాశం ఇప్పించడంతో అది చూసిన సినీ పెద్దలు తన స్క్రీన్ ప్రజెంటేషన్ , చలాకీతనం చూసి సినిమాల్లో నటించమని ప్రోత్సహించారు.
ఈ నేపథ్యంలోనే జార్జ్ రెడ్డి సినిమాలో హీరో సిస్టర్‌గా నటించి మంచి మార్కులు కొట్టేసింది సోనియ. ఈ మూవీలో వచ్చిన ఫేమ్‌తో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన కరోనా వైరస్, ఆశా ఎన్‌కౌంటర్ అనే సినిమాలు చేసింది గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ సోనియా ముందుంటున్నారు. ఆసా ( యాక్షన్ ఎయిర్‌ఫర్ సొసైటల్ అడ్వాన్స్‌మెంట్ ) అనే స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించారు సోనియా.
దీని ద్వారా ఎంతో మందికి సాయం చేసింది. అనాథ పిల్లలకు ఆర్ధిక సాయం, లాక్‌డౌన్ సమయంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణి, దిశా నిందితుడి భార్య రేణుకకి నెలకు రూ.15 వేల సాయం అందించారు. ప్రాజెక్ట్ ప్రేరణ పేరుతో ఆడపిల్లల సంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ తన పెద్ద మనసు చాటుకున్నారు సోనియ. దాదాపు 50 మంది అమ్మాయిలకు చదువు చెప్పించాలనే లక్ష్యంతో దాతలతో మాట్లాడి వారి చదువుకయ్యే ఖర్చులను సేకరిస్తూ బాసటగా నిలుస్తున్నారు.
ఆడపిల్లలతో పాటు రైతుల సమస్యలు, ఒంటరి మహిళల ఇబ్బందులపైనా కార్యక్రమాలు ఆమె రూపొందిస్తున్నారు. సమాజం పట్ల యువతకు అవకాశం కల్పించేందుకు గాను 10వ తరగతి నుంచే గ్రామాల్లో వివిధ వర్క్‌షాపులు నిర్వహిస్తున్నారు సోనియా. మహిళలు స్ట్రాంగ్‌గా ఉంటేనే ఏమైనా సాధించగలరని ఆమె బలంగా నమ్ముతారు. సినిమాల్లో వచ్చిన పాపులారిటీతో బిగ్‌బాస్ తెలుగు 8లోనూ అవకాశం దక్కించుకున్నారు సోనియా ఆకుల. ఈ షోలో ఆమె అద్భుతంగా పర్ఫర్మ్ చేయాలని కోరుతూ ఆల్ ది బెస్ట్ చెబుతోంది ఫిల్మీబీట్


Click it and Unblock the Notifications











