BIGG BOSS TELUGU 8 : బిగ్‌బాస్‌లో మొదలైన యవ్వారాలు.. నన్ను ప్రేమించొచ్చుగా, అడుక్కుంటున్న స్టార్ కంటెస్టెంట్

బిగ్‌బాస్ తెలుగు 8 గ్రాండ్‌గా ప్రారంభమైంది. లోపలికి వెళ్లి రెండ్రోజులు కాకముందే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు కాకరేపుతున్నాయి. ఏం మాట్లాడకపోతే బాగుండదని ఫీల్ అవుతున్నారో లేక ఫుటేజ్‌లో ఎక్కువ కనిపించాలనే టార్గెటో కానీ చిన్న విషయానికి కూడా ఆర్గ్యూమెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా సోనియా, యాష్మీ, కిర్రాక్ సీతలు సదా కయ్యానికి కాలు దువ్వుతున్నారు. హౌస్ ఇంత హాట్ హాట్‌గా మారిపోతుండటంతో రొమాంటిక్ టచ్ ఇచ్చేందుకు బిగ్‌బాస్ తన యత్నాలు మొదలుపెట్టినట్లుగా అనిపిస్తోంది. మరి ఆ విశేషాలు ఏంటో చూస్తే :

గత 7 సీజన్లకు భిన్నంగా బిగ్‌బాస్‌ తెలుగు 8ను డిజైన్ చేశారు మేకర్స్. ఈ సీజన్ రూల్స్‌ను ఒక్కొక్కటిగా చెబుతూ హోస్ట్ నాగార్జున తొలిరోజే కంటెస్టెంట్స్‌కి, ఆడియన్స్‌కి షాకిచ్చారు. ఈ సీజన్‌కు కెప్టెన్ ఎవరూ ఉండరని, అలాగే ప్రైజ్ మనీ వివరాలు జీరో అని చెబుతూ బాంబు పేల్చారు. గతంలో కెప్టెన్ మాదిరి ఇంటికి చీఫ్‌ను తీసుకొచ్చారు. ఆ చీఫ్‌కి అసిస్టెంట్స్‌గా మరో ఇద్దరు చీఫ్‌లు ఉంటారు. దీంతో కంటెంట్ మొత్తం సేమ్ .. పేర్లే మార్పంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

BIGG BOSS TELUGU 8 anchor vishnu priya bhimeneni try to impress contestant prudhvi raj here s the details

బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌ల్లో నెగ్గి తొలుత నిఖిల్ తర్వాత నైనికలు చీఫ్‌లుగా ఎంపికయ్యారు. ఆ తర్వాత మూడో చీఫ్‌ను సెలెక్ట్ చేసే బాధ్యతను నిఖిల్ - నైనికలకే అప్పగించారు బిగ్‌బాస్. దీంతో వారిద్దరూ కలిసి డిష్కస్ చేసుకుని యాష్మీ గౌడను థర్డ్ చీఫ్‌గా ప్రతిపాదించారు. అయితే యాష్మీని చీఫ్‌గా సెలెక్ట్ చేయడాన్ని సోనియా అభ్యంతరం చెప్పారు. ఆమెకు రెస్పాన్సిబిలిటీ లేదని, ప్రతిదానికి ఆర్గ్యూ చేస్తుందని ఫైర్ అయ్యింది. దీంతో యాష్మీ జోక్యం చేసుకుని ప్రతిసారి తననెందుకు టార్గెట్ చేస్తున్నారంటూ గొడవ పెట్టుకుంది.

ఇక నామినేషన్స్ డే నాడు ఇంట్లో గొడవలు మామూలే . అందుకు తగినట్లుగా మంగళవారం హౌస్ అరుపులు, కేకలతో మోతేక్కిపోయింది. నిఖిల్, నైనిక, యాష్మీలు చీఫ్‌లు కావడంతో వారు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. అలాగే ఎవరిని నామినేట్ చేయాలో, ఎవరిని సేవ్ చేయాలో తేల్చే పవర్‌ను చీఫ్‌లకే ఇచ్చాడు బిగ్ బాస్. బేబక్క, ప్రేరణలను సోనియా ఆకుల.. మణికంఠ, బేబక్కలను నబీల్.. మణికంఠ, బేబక్కలను ఆర్జే శేఖర్ భాషా.. పృథ్వీరాజ్, నబీల్‌లను బేబక్క నామినేట్ చేశారు. అయితే నామినేషన్స్ సమయంలో ప్రేరణ, సోనియాలు గొంతు చించుకుంటూ గొడవ పడ్డారు. అలాగే పృథ్వీకి మద్ధతుగా కిర్రాక్ సీత మాట్లాడింది.

ఇక బిగ్‌బాస్ అంటే ప్రేమలు, జంటలు, యవ్వారాలు మామూలుగా ఉండదు. గత సీజన్‌లలో నాలుగో వారమో, ఐదో వారమో మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్ మధ్య ప్రేమాయణాలు, ఒకరినొకరు ఇష్టపడుతున్నట్లుగా బయటపడేవారు. అయితే ఈసారి అలాంటి వ్యవహారాలను ఫస్ట్ వీక్‌లోనే మొదలెట్టేసినట్లుగా కనిపిస్తోంది. దీనిలో భాగంగానే స్టార్ యాంకర్ విష్ణుప్రియ- పృథ్వీరాజ్ మధ్య ప్రేమను పుట్టించే ప్రయత్నాలు స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది.

కిచెన్‌లో బేబక్కకు విష్ణుప్రియ హెల్ప్ చేస్తుండగా.. పృథ్వీ వచ్చి కాఫీ అడగ్గా, విష్ణు వెంటనే అతని కోసం కాఫీ కలిపిస్తుంది. అక్కడితో ఆగకుండా నన్ను ప్రేమించొచ్చు కదా.. నీకోసం ప్రేమగా కాఫీగా కలిపి ఇచ్చాను, ఇంతకు ముందు యాపిల్ కట్ చేసి ఇచ్చాను అంటూ అతనిని ఇంప్రెస్ చేసే ప్రయత్నం చేస్తుంది. దీనికి మనోడు సిగ్గుపడుతూ.. కాఫీ కలిపిస్తే ప్రేమించేయలా అని కౌంటరిస్తాడు. అది చూసిన నెటిజన్లు రాబోయే రోజుల్లో విష్ణుప్రియ తన తెలివితేటలు మొత్తం వాడి పృథ్వీని పడేస్తుందని కామెంట్స్ పెడుతున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X