పోకిరి లెవెల్ ట్విస్ట్ ఇచ్చిన మణికంఠ.. నిజస్వరూపం చూసి షాక్‌లో కంటెస్టెంట్లు!
బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్‌లో తొలివారం నామినేషన్ల ప్రక్రియ రకరకాల గొడవలు, ఆరోపణల మధ్య ముగిసింది. ఈ వారం ఎలిమినేషన్ కోసం 6 కంటెస్టెంట్లు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. అయితే మణికంఠ తీరు, ప్రవర్తన మాత్రం చాలా గమ్మత్తుగా ఉంది. అతని ఆటపై, ఆటతీరుపై సానుభూతి చూపాలా? ట్రోల్ చేయాలా? అనే మిక్స్‌డ్ ఫీలింగ్‌లో నెటిజన్లు, బిగ్‌బాస్ ఆడియెన్స్ ఉన్నారు. అయితే నామినేషన్ పూర్తయిన తర్వాత ఆయన బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ఆ వివరాల్లోకి వెళితే..
ఫస్ట్ వీక్‌లోనే నామినేషన్లు ఘాటుగా ఘాటుగా మొదలై.. అంతే స్థాయిలో పూర్తయ్యాయి. అందరూ మణికంఠ గేమ్‌పైనే టార్గెట్ చేశారు. అతడి వ్యవహార శైలిపై అనేక మంది ఫిర్యాదు చేశారు. అయితే తన జీవితం గురించి ఆయన చెప్పుకొనే విధానం, తన లైఫ్‌లో విషాదాల గురించి పదే పదే చెప్పుకోవడం కాంట్రవర్సీగా మారింది.

మొదటి వారం నామినేషన్స్‌లో రకరకాల వాగ్వాదం అనంతరం ఆ పక్రియ ముగిసింది. తొలివారంలో బేబక్క, విష్ణు ప్రియ భీమినేని, మణికంఠ, పృథ్వీ రాజ్, సోనియా ఆకుల, ఆర్జే శేఖర్ బాషా ఇంటిలో ఉండటానికి అర్హత లేదనే కారణంతో నామినేట్ చేశారు. ఈ క్రమంలో ఈ వారం ఎలిమినేషన్‌లో 6 కంటెస్టెంట్లు ఉన్నారు.
ఇదిలా ఉండగా, నామినేషన్ ప్రక్రియ అనంతరం మణికంఠ భోరున ఏడ్చాడు. తనలో తాను కుమిలి పోతూ కంటెంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయనను ఓదార్చేందుకు ఇంటి సభ్యులందరూ అతడి వద్దకు వచ్చి ఊరకుండే ప్రయత్నం చేశారు. అయితే తనలో బాధను తట్టుకోలేక వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో ఆయనను కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచి చక్క దిద్దే పరిస్థితిని చేశాడు.
బిగ్‌బాస్‌తో మాట్లాడుతూ.. నా లైఫ్ అంతా రోలర్ కోస్టర్‌లా ఉంది. నేను ఇలాను ఉన్నా. నేను అబద్దం ఆడను. నిజాలు చెప్పాను. బిగ్‌బాస్ తర్వాత నాకు జీవితం ఉందా? నా భార్య కావాలి? నా అత్తమామల నుంచి గౌరవం కావాలి. నా మారుతల్లి కావాలి? నా కూతురు నాకు కావాలి. నా లుక్స్ మెయింటెన్ చేయాలని అనుకొన్నాను. కానీ నా వల్ల కావడం లేదు అని అంటే.. మీరు అనుకొన్నది సాధిస్తారు? ఇంత తర్వగా ధైర్య కోల్పోవద్దు అన్నారు.
ఇంటిలోని కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. తన విగ్‌ను తీసేశాడు. దాంతో అందరూ షాక్ అయ్యారు. ఇప్పటి వరకు అతడిది సొంత జుట్టు కాదా? విగ్ పెట్టుకొని మేనేజ్ చేశాడా? అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ఆయనకు బిగ్‌బాస్ ధైర్యం ఇవ్వడంతో నా నవ్వును నా ముఖంపై ఉంచుకొంటా. నా ఆటను నేను ఆడుతాను అని అన్నారు.


Click it and Unblock the Notifications











