Bigg Boss Telugu 8: మణికంఠపై సోదరి సంచలన వ్యాఖ్యలు.. సవతి తండ్రి నిజాలన్నీ బట్టబయలు

తెలుగులో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న షోలలో బిగ్ బాస్ ఒకటి అన్న విషయం అందరికీ తెలిసిందే. అంతలా ఆడియెన్స్ ఈ కార్యక్రమాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. అందుకే ఈ రియాలిటీ షోకు దేశంలోనే దేనికీ దక్కనంత రేటింగ్ కూడా లభిస్తోంది. ఫలితంగా ఇది ఇండియాలోనే నెంబర్ వన్ అనిపించుకుంటోంది. ఇక, తెలుగు బిగ్ బాస్ ఇప్పటికే ఎన్నో సీజన్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో దానితో ప్రేక్షకుల మందుకు వచ్చింది. ఇందులోకి వచ్చిన నాగ మణికంఠ గురించి అతడి సోదరి స్పందించింది. అసలు ఆమె ఏం చెప్పిందో మీరే చూడండి!

ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లతోనే
తెలుగులో బిగ్ బాస్ షో ఏడు రెగ్యూలర్ సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను అంతులేని వినోదం అనే కాన్సెప్టుతో ప్రారంభించారు. ఇందులో గతంలో ఎన్నడూ చూడని విధంగా ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లను చూపిస్తున్నారు. దీంతో మొదటి వారంలోనే దీనికి మంచి స్పందన వస్తోంది. ఇలాంటివే మరిన్ని కూడా ప్లాన్ చేస్తున్నారు.

Bigg Boss Telugu 8 Contestant Naga Manikanta Sister Responds on His Flashback

అందరిలో అతడు ఫోకస్‌

బిగ్ బాస్ ఎనిమిదో సీజన్‌లోకి 14 మంది కంటెస్టెంట్లుగా వచ్చారు. అందులో ఆరంభంలోనే కొందరు హైలైట్ అయ్యారు. వారిలో నాగ మణికంఠ ఒకరు. అతడు తన శాడ్ స్టోరీతో ప్రీమియర్ ఎపిసోడ్ రోజే తెగ ఫోకస్ అయ్యాడు. ఆ తర్వాత కూడా పలుమార్లు తన ఫ్లాష్‌బ్యాక్ గురించి మాట్లాడుకుంటూ వార్తల్లో నిలుస్తున్నాడు. దీంతో నాగ మణికంఠ పేరు తెగ ట్రెండ్ అవుతోంది.

నామినేషన్స్‌తో మరింత
ఫస్ట్ వీక్ నామినేషన్స్‌లో నాగ మణికంఠను అందరూ టార్గెట్ చేశారు. ఆ సమయంలో అతడు 'నేను ఎన్ని కష్టాలు అనుభవించానో మీకు తెలీదు. తండ్రిని పోగొట్టుకున్నాను. తల్లి చచ్చిపోతే డబ్బులు అడుక్కుని అంత్యక్రియలు చేశాను. సవతి తండ్రితో అవమానాలు ఎదుర్కొన్నా. పెళ్లి చేసుకుంటే భార్యతో ఇబ్బందులు వచ్చాయి' అంటూ తన గతాన్ని బయటపెట్టేశాడు.

మణికంఠ సోదరి క్లారిటీ

నాగ మణికంఠ గతం వల్ల ఎంతో సానుభూతి వస్తోంది. ఈ నేపథ్యంలో అతడి సోదరి స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె 'మా ఫ్యామిలీ గురించి నా బ్రదర్ బిగ్‌బాస్‌లో మాట్లాడిన విషయాలు నా దృష్టికి వచ్చాయి. అందుకే దీనిపై క్లారిటీ ఇస్తున్నాను. మా నాన్న తనకు సవతి తండ్రి అంటూ అన్నయ్య చెప్పడాన్ని నెగెటివ్‌గా చూడకండి' అంటూ చెప్పుకొచ్చారు.

అన్నయ్య వెళ్లిపోయాడు
నాగ మణికంఠ సోదరి కంటిన్యూ చేస్తూ.. 'అన్నయ్య తన గతాన్ని నిజాయితీగా చెప్పాడు అంతే. ఇక మా అమ్మ చనిపోయిన తర్వాత తను ఇల్లు వదిలి వెళ్లిపోవడం అనేది అన్నయ్య తీసుకున్న సొంత నిర్ణయమే. ఎవరూ తనను ఇంట్లో నుంచి పంపించలేదు. తను తీసుకున్న నిర్ణయం తనకు కరెక్ట్ అని అనుకునే అన్నయ్య బయటికి వెళ్లిపోయాడు' అంటూ అసలు విషయం చెప్పారు.

Bigg Boss Telugu 8 Contestant Naga Manikanta Sister Responds on His Flashback

రియల్ ఫాదర్ అంటూ

ఆ తర్వాత ఆమె కొనసాగిస్తూ.. 'మా జీవితాల్లో నాన్న అండగా ఉన్నారు. ఎంతో ప్రేమగా చూసుకుని రియల్ ఫాదర్ అని నిరూపించారు. అయితే, అన్నయ్య చెప్పింది తన అభిప్రాయం మాత్రమే. అతడిని కూడా నేను గౌరవిస్తాను. కానీ, దీనిపై ఎవరూ నెగెటివ్‌ కాకూడదని అభ్యర్థిస్తున్నా. ఎందుకంటే మా ఫ్యామిలీ అలాంటిది కాదు. అన్నయ్యకు సపోర్ట్ చేస్తాం' అంటూ స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X