ఆర్జే శేఖర్ భాషా అరెస్ట్.. 3 గంటలపాటు ప్రశ్నించిన సైబర్ క్రైమ్ పోలీసులు..అసలేం జరిగిందంటే?

తనపై అత్యాచారం జరిపారనే ఆరోపణలపై యూట్యూబర్‌పై తెలుగు సినీ నటి, నిర్మాత, బిగ్‌బాస్ కంటెస్టెంట్ కేసు నమోదు చేయడం అప్పట్లో సంచలనం రేపాయి. ఈ కేసులో బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ బుక్ చేసి.. కేసును నార్గింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ కేసు విచారణ కొనసాగుతున్న సమయంలో బాధితురాలికి వ్యతిరేకంగా మీడియాలో చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దాంతో ఆర్జే, బిగ్‌బాస్ కంటెస్టెంట్ శేఖర్ బాషాపై బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో ఆయనను అరెస్ట్ చేయడం వినోద పరిశ్రమలో చర్చనీయాంశమైంది. తాజా అరెస్ట్ వివరాల్లోకి వెళితే..

హర్ష సాయి కేసు విషయానికి వస్తే.. ప్రేమ పేరుతో తనను చీటింగ్ చేశాడు. మద్యం మత్తులో ఉండగా వివస్త్రను చేసి ఫోటోలు తీశాడు. వాటిని సోషల్ మీడియాలో పెడుతానని బెదిరిస్తున్నాడు. అలా బ్లాక్ మెయిల్ చేస్తూ నా నుంచి భారీగా డబ్బు కూడా గుంజాడు అనే విషయాలను ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే అప్పటి నుంచి నిందితుడు పరారీలో ఉండటంతో అరెస్ట్ చేయడానికి కుదర్లేదని బాధితురాలి తరఫు న్యాయవాదులు వెల్లడించారు.

RJ Shekhar Basha Arrested

బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. హర్షసాయి తన అసభ్య వీడియోలతో బెదిరించాడని ఫిర్యాదు చేయడంతో అతడిపై కేసు పెట్టాం. ఐపీసీ 376, 354 సెక్షన్ల కింద కేసు పెట్టామని రాజేంద్ర నగర్ డీసీపీ శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

అయితే ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా.. హర్ష సాయికి సపోర్టుగా బాధితురాలిపై మీడియాలో, యూట్యూబ్ ఛానెల్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తమ క్లయింట్‌ గురించి అసత్య ప్రచారాలు చేశాడు. దాంతో సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం అని బాధితురాలి తరుపు న్యాయవాదులు తెలిపారు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు శుక్రవారం సాయంత్రం శేఖర్ భాషాను అదుపులోకి తీసుకొన్నారు. సుమారుగా 3 గంటలపాటు ఆయనను ప్రశ్నించారు. తాను చేసిన కామెంట్లపై వివరణ ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. అయితే ఈ కేసులో శేఖర్ భాషా అడ్డంగా బుక్కయ్యారనే విషయం చర్చనీయాంశమవుతున్నది. ఇదిలా ఉండగా నిందితుడు హర్ష సాయి విదేశాలకు పారిపోయాడని బాధితురాలి న్యాయవాది ఇటీవల వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X