Bigg Boss Telugu 8: ‘మా బిడ్డను అలా చూపించి బద్నాం చేయొద్దు..’: సోనియా తల్లి ఆవేదన..
Bigg Boss Soniya Akula: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ లో ఒకరు సోనియా ఆకుల. ఈ అమ్మడు టాలీవుడ్ హీరోయిన్. 2019లో వచ్చిన జార్జ్ రెడ్డి సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆ మూవీలో సోనియా తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆతర్వాత ఆర్జీవీ దర్శకత్వం వహించిన కరోనా వైరస్, ఆశ ఎన్‌కౌంటర్ సినిమాల్లో నటించింది. ఈ మూవీతో ఆమెకు ఆర్జీవీ హీరోయిన్ అనే గుర్తింపు వచ్చింది. ఇలా పాపులర్టీ సంపాదించుకున్న ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. తన ఆటతీరులో బీబీ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కనిపిస్తోంది సోనియా. అయితే.. మొదట్లో నిఖిల్ తో చనువుగా ఉండటం, ఆ తరువాత ప్రుద్వీతో సన్నిహితంగా వ్యవహరించడంతో ఏదో తేడా ఉందనే రూమర్స్ వచ్చాయి. ఈ ట్రోల్స్, కామెంట్స్ పై సోనియా తల్లిదండ్రులు స్పందించారు.
సోనియా తల్లిదండ్రలు మల్లీశ్వరి- చక్రపాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడతూ.. బిగ్ బాస్ హౌస్ లో తమ కూతురు సోనియా చాలా బాగా ఆడుతుందనీ, ఆమె ప్రతి టాస్కుల్లో 100 శాతం స్ట్రాంగ్ గా ఉంటుందని అన్నారు. బిగ్ బాస్ లో తన కూతుర్ని టార్గెట్ చేస్తూ.. ఇతర కంటెస్టెంట్లు గేమ్ ఆడుతున్నారనీ, కానీ తాను అందరితో స్నేహంగా ఉంటుందని అన్నారు. ఈ సందర్బంలో సోనియా లవ్ ఎఫైర్ గురించి ప్రశ్నించగా.. సోనియా తల్లి సమాధానమిస్తూ.. ' తనకు ఎలాంటి లవ్ ఎఫైర్ లేవు. అల్రెడీ మ్యారేజ్ సెట్ అయ్యింది. డిసెంబర్ లో మ్యారేజ్ ఉండే.. కానీ, బిగ్ బాస్ లో అవకాశం రావడంతో తనకు కాబోయే అత్తమామ, భార్య అనుమతితోనే తనని హౌస్ లోకి పంపించాం.' అని తెలిపారు.

సోనియా తల్లి ఇంకా మాట్లాడుతూ... ' బిగ్ బాస్లో అంతా బాగుంది. అది గేమ్ అని మాకు తెలుసు.. అందులో రూల్స్ ఎలా ఉంటాయో.. ఏ విధంగా వ్యవహరిస్తారో అంత బిగ్ బాస్ చేతుల్లో ఉంటుంది. ఈ విషయంలో మాకు గానీ, తన అత్తమామలకు ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ, తన కూతుర్ని అలా చూపించే వరకు చూట్టు పక్కల వారు. కొంత తేడాగా మాట్లాడుతున్నారు. ప్రుద్వీ, నిఖిల్ లతో తన కూతురు సోనియా వ్యవహరించే తీరుపై మాట్లాడుతూ.. వారిని చిన్నోడు.. పెద్దోడు అంటే.. చిన్న అన్నయ్య.. పెద్ద అన్నయ్య గా భావిస్తుందనీ, ఆ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో కూడా చెప్పింది. లైఫ్ లో ఈ విషయం ప్రసారమైంది. కానీ, ఎపిసోడ్ లో రాకపోవడంతో తన కూతురు గురించి చేడుగా మాట్లాడుకుంటారు. ' అని ఆవేదన వ్యక్తం చేసింది.
'నిఖిల్ కూడా లైఫ్ లో తన తల్లితో ఎలాంటి బంధం ఉందో సోనియాతో అలాంటి బంధం ఏర్పడిందని చెప్పారు. ఓ అబ్బాయే ఓ అమ్మాయిని తల్లిలా భావిస్తే.. ఇక తప్పేముంది. ఈ విషయం హౌస్ లో అందరికి తెలుసు. ఈ విషయంలో మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ, బయట వాళ్లు తన బిడ్డ తప్పుగా కనిపిస్తుంది. త్వరలో మ్యారేజ్ అమ్మాయిపై ఇలాంటి బద్నాం చేయొద్దు. లేని వాటిని ఉన్నట్టు చూపించడం సరికాదు. ఆటను ఆటలాగా చూడాలి. ఇప్పటికి వరకు జరిగిన బిగ్ బాస్ సీజన్లో ఎవర్ని చేయని టార్గెట్ సోనియాను చేస్తున్నారు. తనని తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే.. తనని వైల్డ్ కంటెస్టెంట్గా క్రియేట్ చేస్తున్నారు. ఎవరూ ఎలాంటి కామెంట్స్ చేసినా.. ఎలాంటి ట్రోల్స్ చేసినా.. మేము పట్టించుకోం. కానీ ఈ విషయాలపై బిగ్ బాస్సే ఓ క్లారిటీ ఇచ్చి.. తప్పుగా మాట్లాడేవారి నోర్లు మూపించాలి. అదే మనవి ' అని ఎమోషనల్ అయ్యారు..
బిగ్ బాస్ లోకి సోనియా అడుగుపెడితే.. చాలా మంది సపోర్టు చేస్తున్నారు. ఆమె ఆటను ఎంజాయ్ చేస్తున్నారు. తాము బయటకు పోతే.. తన అమ్మాయి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిందిగా.. తన అమ్మాయిని గెలుపుపించుకోవాలి. ఆమె ఫ్రెండ్స్ అందరూ సపోర్టుగా నిలుస్తున్నారు. ఆమెకు చాలా మంది ఓట్లు వేసి అండగా నిలుస్తున్నారు. ఇప్పటి వరకూ తనకు చాలామంది ఫోన్లు చేసి.. అభినందనలు తెలుపుతున్నారు. వాళ్ల ఎకరైజ్మెంట్ కు చాలా చాలా థ్యాంక్స్ . మీ సపోర్టు ఇలానే ఉండాలి' అని కోరుకున్నారు సోనియా తల్లిదండ్రులు. ఏదిఏమైనా సోనియా ఆకుల మాత్రం తనదైన స్టాటజీతో గేమ్ లో ముందుకు పోతుంది. బిగ్ బాస్ 8 సీజన్ లో టాప్ 5 కంటెస్టెంట్లో ఒకరు గా మాత్రం సోనియా నిలుస్తుందని బీబీ లవర్స్ అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











