Bigg Boss Telugu 8: మగవాళ్లతో క్లోజ్ గా ఉంటే తప్పా.. కావాలనే అలా చూపించారు: సోనియా ఆకుల షాకింగ్ కామెంట్స్
Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, డబుల్ ఎలిమినేషన్ అంటూ క్యూరియాసిటీని క్రియేట్ చేస్తున్నారు. మరోవైపు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందంటూ మైండ్ బ్లోయింగ్ అనౌన్స్ మెంట్ చేశారు కింగ్ నాగార్జున. ఇలా దిమ్మతిరిగే ట్వీస్టులతో ఇవ్వడంతో గతంలో ఏ సీజన్ కు లేని భారీ రెస్పాన్స్ సీజన్ 8 దూసుకపోతోంది.హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో రసవత్తరంగా సాగుతోంది. ఈ రియాల్టీ గేమ్ షో నుండి నాలుగోవారం కంటెస్టెంట్ సోనియా ఆకులు ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా సోనియా ఆకుల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బిగ్ బాస్ హౌస్ వాళ్లకు కావాల్సింది దొరకపోవడంతో.. తనని కావాలని అలా చూపించారని షాకింగ్ కామెంట్స్ చేసింది సోనియా ఆకుల.
సోనియా ఆకుల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బయట ఎలా ఉన్నానో.. బాస్ బాస్ షోలో కూడా అలానే ఉన్నానని, కానీ.. బిగ్ బాస్ టీం చూపించే విధానంలో తేడాగా ఉందని అన్నారు. బిగ్ బాస్ లో జరిగింది జరిగినట్లు చూపిస్తే .. ఓటింగ్ మరోలా ఉండేదని, కావాలనే తనని టార్గెట్ చేసి ఎడిటింగ్ చేశారని షాకింగ్ కామెంట్స్ చేసింది ఆకుల సోనియా. తాను ఏ విషయాన్ని ఉన్నది ఉన్నట్లు .. ముక్కు సూటిగా చెప్పడం తనకి అలవాటని, అలాగే బిగ్ బాస్ లో కూడా అడుగుపెట్టిన రోజు నుండి చివరి వరకు అలాగే ఉన్నానని అన్నారు. తాను ఎల్లప్పుడూ సరైన మార్గంలోనే నడుస్తాననీ, తానేంటో తన చుట్టూ ఉన్న ప్రపంచానికి తెలుసు అని సోనియా అన్నారు.

మూడో వారంలో తాను ఆడిన టాస్కులు గేమ్స్ గురించి కాకుండా.. వేరే విషయాలపై మాట్లాడడం తనకు నచ్చలేదని, ఆరోజే బయటికి వచ్చేద్దామని డిసైడ్ అయ్యానని సోనియా అన్నారు. అలాగే.. ఇ0ర కంటెస్టెంట్లు తనతో వ్యవహరించి విధానంలో కూడా తేడా వచ్చిందని, తనని వేరేలా పోర్ట్రైట్ చేస్తున్నారనే విషయం కూడా తనకు అర్థమైందని, అభయ్ లాగా ప్రవర్తించి అయినా బిగ్ బాస్ నుండి బయటకు రావాలని నిర్ణయించుకున్నాననీ అన్నారు సోనియా ఆకుల.
బిగ్బాస్ ముద్దుబిడ్డ, ఆడ పులి అని ప్రశంసించిన వారే, కానీ దారుణంగా ఓటింగ్ పడిపోయేలా తనని చూపించారని అన్నారు. వాస్తవానికి తాను ఇప్పుడు బిగ్బాస్ షోను చూడలేదని, అందుకే ఆ గేమ్ ఎలా ఆడతారో..తనకు సరిగా తెలియదు అన్నారు. తనని తాను నిరూపించుకోవాలని, వంద రోజుల ఎలా ఉండాలో ముందుగా ఎలా డిసైడ్ అవుతారని సోనియా అన్నారు. తన 30 ఇయర్స్ లైఫ్ లో ఎంతోమంది వ్యక్తులను చూసానని, విభిన్న మనస్తత్వం ఉన్న వ్యక్తులతో వర్క్ చేశానని, తనకు తప్పేంటో ఒప్పేంటో.. తెలుసన్నారు సోనియా.

బిగ్బాస్ అనేది ఓ రియాల్టీ షో అని తన లైఫ్ కు కొంత ఉపయోగపడుతుందని, ఏ సిట్యువేషన్ లో ఎలా ఉండాలో? ఏ మూమెంట్లో ఎలా ఉండాలో ?తనకు నేర్పుతోందని బిగ్ బాస్ లోకి అడుగు పెట్టానని తెలిపారు సోనియా. బిగ్బాస్ వాళ్ళు కావాలనుకుంటే ఒక వ్యక్తిని హీరోగా చేస్తారని, లేదు అంటే జీరో గా చూపిస్తారని లైవ్ ను కూడా ఎడిట్ చేసి చూపిస్తారనీ తనకు బయటకు వచ్చాక తెలిసిందని షాకింగ్ కామెంట్స్ చేసింది సోనియా ఆకుల. బిగ్ బాస్ అనేది ఓటింగ్ వైస్ గా నడుస్తుందనుకోవడం సరికాదని, వాళ్లు కావాలంటే ఉంటారు లేదంటే తీసేస్తారు అంటూ బిగ్ బాస్ షో పై సంచలన వ్యాఖ్యలు చేసింది. వాళ్లకు కావాల్సిన కంటెంట్ దొరకకపోవడంతో తాను చేతి పట్టుకున్న దాన్ని జూమ్ చేసి చూపించారని పదేపదే అదే మూమెంట్ను టెలికాస్ట్ చేశారని సోనియా షాకింగ్ కామెంట్స్ చేసింది.


Click it and Unblock the Notifications











