Bigg Boss Telugu 8: ‘నా బ్రతుకును రోడ్డు పాలు చేసాడు’: బిగ్ బాస్ ను ఏకిపారేసిన సోనియా

Bigg Boss Telugu 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. వైల్డ్ కార్డు ​ఎంట్రీలు, డబుల్ ​ఎలిమినేషన్​ అంటూ క్యూరియాసిటీని క్రియేట్ ​చేస్తున్నారు. మరోవైపు మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటుందంటూ మైండ్ బ్లోయింగ్ అనౌన్స్ మెంట్ చేశారు కింగ్ నాగార్జున. ఇలా దిమ్మతిరిగే ట్వీస్టులతో గతంలో ఏన్నాడు లేని భారీ రెస్పాన్స్‌ సీజన్ 8 దూసుకపోతోంది. హైయేస్ట్ టీఆర్పీ రేటింగ్ తో రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్ లో నాలుగోవారం కంటెస్టెంట్ సోనియా ఆకుల ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సోనియా ఆకుల మాట్లాడుతూ.. తనని కావాలని అలా చూపించారని, బిగ్ బాస్ టీంపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

సోనియా ఆకుల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను బయట ఎలా ఉన్నానో.. బాస్ బాస్ షోలో కూడా అలానే ఉన్నానని, కానీ, బిగ్ బాస్ టీం చూపించే విధానంలో తేడాగా ఉందని అన్నారు. బిగ్బాస్ షో అనేది లైఫ్ మేనేజ్మెంట్ షో గా తన భావించానని, ఆ విషయాన్ని కింగ్ నాగార్జున కూడా ప్రస్తావించాడని పేర్కొన్నారు ఆకుల సోనియా. ఈ షోలో ఏం లైఫ్ మేనేజ్మెంట్ చూపించారు. తన జీవితాన్ని రోడ్డుమీద తీసుకొచ్చి పడేశారనీ, తాను 30 ఏళ్లు కష్టపడి బతికాననీ, కానీ, తన క్వాలిటీస్, తన బలాలు బలహీనతలు చూపించకుండా.. కాళ్లు చేతులు చూపించి, నా జీవితాన్ని రోడ్డుకీడ్చారంటూ సోనియా ఆకుల ఆగ్రహం వ్యక్తం చేశారు.

Bigg Boss Telugu 8 contestant Sonia Akula Shocking comments on Nagarjuna And Bigg Boss team

బిగ్బాస్ షో ఇలా ఉంటుందని తనకు తెలియదు అన్నారు. గతంలో కూడా సరిగ్గా షో చూడలేదని, కానీ ఇలా ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవడం సరికాదని ఇది ఒక ఫెయిల్యూర్ షో అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది సోనియా. బిగ్ బాస్ లో సెలెక్ట్ చేసేటప్పుడు ఇలాంటి కండిషన్స్ తనకు చెప్పలేదని, మీరు బయట ఎలా ఉంటారో.. అలాగే షో అలానే వ్యవహరించానని సోనియా తెలిపారు.

కావాలని తనని బ్యాడ్ గా చూపించారంటూ మండిపడింది సోనియా. తాను ఎన్నో విషయాలను పృద్వి, నిఖిల్ తో పంచుకున్నాననీ, వారు కూడా ప్రతి విషయాన్ని తనతో షేర్ చేసున్నారని అన్నారు. కానీ, మా రిలేషన్ తప్పుగా చూపించారంటూ ఫైర్ అయ్యారు సోనియా. ఎపిసోడ్లో ఎంతో కంటెంట్ ఉన్న తమ ముగ్గురిపైనే బిగ్ బాస్ ఫోకస్ పెట్టారని తనకు కావలసిన కంటెంట్ క్రియేట్ చేశారని అన్నారు.

Bigg Boss Telugu 8 contestant Sonia Akula Shocking comments on Nagarjuna And Bigg Boss team

చేతులు, కాళ్లు చూపించి బిగ్ బాస్ షోకు టిఆర్పి తెప్పించుకున్నారంటూ, లైవ్ కూడా ఎడిటింగ్ చేసి చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రియాల్టీ షో కాదంటూ తనకు నచ్చిన విధంగా బిగ్ బాస్ టీం వ్యవహరిస్తూ కంటెస్టెంట్లను బ్యాడ్ గా చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆకులు సోనియా.

More from Filmibeat

Read more about: bigg boss 8 telugu sonia akula
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X