గీత దాటితే భారీ వేటు.. ఎంట్రీకి ముందే కంటెస్టెంట్లకు బిగ్‌‌బాస్ భారీ షాక్!

బిగ్‌బాస్ తెలుగు 8 రియాలిటీ షో రంజుగా మొదలైంది. ఇంటిలో కంటెస్టెంట్ల మధ్య అభిప్రాయ బేధాలు ఆరంభంలో తారాస్థాయిలో కనిపిస్తున్నాయి. దాంతో షోలో సంచలనాలు నమోదయ్యే అవకాశాలు స్పస్టంగా కనిపిస్తున్నాయి. అయితే రియాలిటీ షో ఫార్మాట్ విషయంలో ఈసారి బిగ్‌బాస్ కఠినమైన నియమ నిబంధనల్ని డిజైన్ చేశారు. అయితే ఈ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు షోను పక్కగా రూల్స్‌ను డిజైన్ చేస్తారు. కంటెస్టెంట్ల నుంచి ముందే కొన్ని నిబంధనలతో కాంట్రాక్ట్ చేసుకొంటారు. ఇంటి లోపల కంటెస్టెంట్లు వ్యవహరించాల్సిన తీరు.. ఇంటి నుంచి ఎలిమినేషన్ తర్వాత వ్యవహరించాల్సిన విషయాలను స్పష్టంగా రూపొందిస్తారు. అందుకు అనుగుణంగా సెలబ్రిటీల నుంచి అంగీకారం తీసుకొంటారు.

Bigg Boss Telugu 8 Contestant to face Stringent rules by Bigg Boss

అయితే సాధారణంగా కంటెస్టెంట్ల రెమ్యునరేషన్ల వివరాలను ఇతరులతో డిస్కస్ చేయకూడదు. ఎలిమినేషన్ తర్వాత మీడియాతో గానీ, ఇతరులతో షేర్ చేయకూడదనే విషయాన్ని స్పస్టంగా చెబుతారు. ఇంట్లో ఆస్తి నష్టం.. తదితర విషయాలు సాధారణంగా ఉంటాయి. కానీ ఈ సారి మాత్రం ఇంకో అడుగు వేసి మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు.

అయితే ఇంట్లోకి రాకముందు తమకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో గానీ, ఎక్కడ చెప్పకూడదు. అలాగే బిగ్‌బాస్ షో వివరాల గురించి చెప్పే ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అని కండీషన్ సీరియస్‌గా ఉంటుంది. అయితే తాజాగా ఎలిమినేషన్ తర్వాత కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఇంటర్వ్యూలో ఇవ్వకూడదు అని నిబంధనను కొత్తగా అమలు లోకి తెచ్చింది.

అయితే కొత్త నిబంధన ప్రకారం ఫస్ట్ వీక్ నుంచి ఎలిమినేషన్ మొదలుకొని.. చివరి ఎలిమినేషన్ వరకు ఎవరూ కూడా, ఏ కంటెస్టెంట్ కూడా ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు. అలాగే 8వ సీజన్ ముగిసిన తర్వాత ఒకవారం వరకు కంటెస్టెంట్లు మీడియాతో మాట్లాడకూడదు అనే రూల్‌ను కొత్తగా ఇంప్లిమెంట్ చేసినట్టు తెలుస్తున్నది.

ఇదిలా ఉండగా, ఇలాంటి నిబంధనను కంటెస్టెంట్లు అంగీకరించినప్పటికీ.. ఈ రూల్‌ను సెలబ్రిటీలు అమలు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. అలాగే ఇప్పటికే కంటెస్టెంట్లు ఏడాది పాటు కమర్షియల్ ఈవెంట్స్, ఎలాంటి యాంకర్‌గా వ్యవహరించకూడదు అనే నిబంధను కొందరు బ్రేక్ చేయడం అనేక వివాదాలకు కారణమైన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X