బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై బూతులతో అసభ్యంగా.. హాట్ వీడియోలన్నీ బయటపెట్టి దారుణంగా!
రకరకాల టాస్కులు ఇస్తూ.. కంటెస్టెంట్ల ఎమోషన్స్‌తో గేమ్స్ ఆడుతూ.. టెలివిజన్ రంగంలో ఓ రేంజ్‌లో ప్రభావం చూపిస్తూ సాగిపోతోన్న షోనే బిగ్ బాస్. ముఖ్యంగా తెలుగులో ఇది భారీ స్థాయిలో ఆదరణను అందుకుంటోంది. ఫలితంగా నిర్వహకులు వరుస పెట్టి సీజన్లను ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు ఎనిమిదో సీజన్‌ను ప్రసారం చేస్తున్నారు. ఎంతో ఆసక్తికరంగా సాగుతోన్న ఇందులో ఎన్నో గొడవలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కంటెస్టెంట్‌ను మరో కంటెస్టెంట్ అభిమానులు దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసమే!
అన్‌లిమిటెడ్ సీజన్‌గానే
తెలుగులో బిగ్ బాస్ షో ఏడు రెగ్యూలర్, ఒక ఓటీటీ సీజన్లను పూర్తి చేసుకుంది. దీంతో ఎనిమిదో దానిపై అంచనాలు ఓ రేంజ్‌లో ఏర్పడ్డాయి. దీంతో ఈ సారి మరింత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామంటూ నిర్వహకులు వెల్లడించారు. అందుకు తగ్గట్లుగానే ఇందులో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు ఇస్తున్నారు. ఫలితంగా ఇది ఆరంభం నుంచే ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది.

గొడవలతో యమా రంజు
సాధారణంగా బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ల మధ్యన గొడవలు బాగానే జరుగుతుంటాయి. అలా గతంలోనూ కొట్టుకునేంత స్థాయి సంఘటనలు కనిపించాయి. అందుకు తగ్గట్లుగానే ఎనిమిదో సీజన్‌లో కూడా ఆరంభంలోనే కంటెస్టెంట్ల మధ్య ఫైటింగ్స్ కనిపిస్తున్నాయి. దీంతో ఈ సీజన్ మరింత రసకందాయంగా సాగుతోంది. ఫలితంగా ఇది కూడా సక్సెస్ అయ్యేలా కనిపిస్తోంది.
విష్ణుప్రియతో సోనియా
ఈ మధ్యన జరిగిన ఓ ఎపిసోడ్‌లో విష్ణుప్రియ 'మీకు ముందు నిఖిల్ అంతగా నచ్చలేదు. మరి ఇప్పుడు ఎలా ఫ్రెండ్‌షిప్ కుదిరింది' అని సోనియాను ప్రశ్నించింది. దీనికామె 'ఎవరు అడగమన్నా నేను మాత్రం మీ అడల్డ్ కామెడీలో పార్ట్ కాను' అని చెప్పింది. అప్పటి నుంచి వీళ్లిద్దరి మధ్య ఫైటింగ్ జరుగుతోంది. దీంతో ఈ సీజన్ విష్ణుప్రియ వర్సెస్ సోనియాగా మారింది.

ఒకరిపై ఒకరు ట్రోల్స్‌తో
బిగ్ బాస్ షోలో ఉన్న కంటెస్టెంట్లకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫాలోయింగ్ లభిస్తుంటుంది. ఇలా తమకు నచ్చిన వాళ్లను సపోర్ట్ చేయడంతో పాటు ఎదుటి వారిపై విమర్శలు చేయడం సర్వసాధారణం అయిపోయింది. ఈ పరిస్థితుల్లో విష్ణుప్రియ, సోనియా అభిమానులు ఒకరిపై ఒకరు ట్రోల్స్ చేసుకుంటున్నారు. దీంతో వీళ్లిద్దరి పేర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

విష్ణుప్రియపై దారుణం
బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చే ముందే కొందరు బయట పీఆర్ (పబ్లిసిటీ చేసే టీమ్) టీమ్‌లను ఏర్పాటు చేసుకుంటుంటారు. షోలో తమకు సపోర్టుగా, ఎదుటి వాళ్లను ట్రోల్స్ చేసేలా వాళ్లతో డీల్ చేసుకుంటారు. ఇప్పుడు సోనియా తరపున వాళ్లు విష్ణుప్రియపై అలాగే దారుణంగా టార్గెట్ చేస్తున్నారు. ఈ విషయాన్ని కొందరు బిగ్ బాస్ రివ్యూవర్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఆ వీడియోలు వదిలేసి
విష్ణుప్రియ గతంలో ఓ సినిమాలో బోల్డుగా సీన్స్ చేసింది. అలాగే, కొన్ని హాట్ ఫొటోలను కూడా షేర్ చేసింది. వీటిని ఇప్పుడు సోనియా తరపున పని చేసే టీమ్ సోషల్ మీడియాలో వదులుతోంది. అంతేకాదు, ఆమె క్యారెక్టర్ అలాంటిదే అని ఆపాదిస్తూ పర్సనల్ ఎటాక్ చేస్తోంది. దీంతో ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇక, ఈ ట్రోల్స్‌కు విష్ణుప్రియ ఫ్యాన్స్ గట్టి కౌంటర్లే ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











