నిఖిల్ టీమ్‌ కడుపుపై కొట్టిన యష్మీ .. ఓ ముద్దపెట్టమంటూ సీత ఎమోషనల్

బిగ్‌బాస్ తెలుగు 8ని ఈసారి కొత్తగా ప్లాన్ చేశారు నిర్వాహకులు. ఏం కావాలన్నా ఇస్తానని, కానీ అడిగేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని నాగార్జున ప్రోమోలో చెప్పినప్పుడే కంటెస్టెంట్స్‌గా వచ్చే వారు జాగ్రత్త పడాల్సింది. కానీ హౌస్‌లో టాస్క్‌లు, రూల్స్ అర్ధం కావడానికి వారికి టైం పడుతోంది. ఈవారం నామినేషన్స్ గొడవను ముగించిన బిగ్‌బాస్.. గేమ్స్‌లోకి దిగాడు. బుధవారం నాటి ఎపిసోడ్‌ ప్రోమోకి చూస్తే.. టాస్క్‌ల్లో మనోళ్లు బాగానే కష్టపడినట్లుగా కనిపిస్తోంది. మరి ఆ వివరాల్లోకి వెళితే.

ఈ సీజన్‌లో కంటెస్టెంట్స్ ఉండరని చెప్పిన బిగ్‌బాస్.. ఆ ప్లేస్‌లో చీఫ్‌లను తీసుకొచ్చాడు. ముగ్గురు చీఫ్‌లుంటే బాగోదని భావించాడో ఏమో కానీ వారిలో ఒక్కరే పవర్‌ఫుల్ అంటూ తిరకాసు పెట్టాడు. చీఫ్‌లు తమ సైన్యాన్ని సిద్ధం చేసువావాలని చెప్పి ఇంటి సభ్యులను మూడు జట్లుగా విభజించి వారితో ఆటలు ఆడిస్తున్నాడు. గెలిచిన టీమ్‌కి బెనిఫిట్స్, బంపర్ ఆఫర్‌లు అప్పగిస్తూ షోను రక్తికట్టిస్తున్నాడు. ఈసారి కంటెస్టెంట్‌ల కడుపుప కొట్టే టాస్క్ ఇచ్చాడు.

bigg boss telugu 8 day 10 promo 2 kiraak seetha fight with naga manikanta for food here s the details

మంగళారం నామినేషన్స్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాడు బిగ్‌బాస్. ఈ వారం నిఖిల్, నైనిక, మణికంఠ, శేఖర్ భాషా, పృథ్వీ, కిర్రాక్ సీత, విష్ణుప్రియ, ఆదిత్య ఓం‌లు నామినేషన్స్‌లో నిలిచారు. వీరిలో ఒకరు సెకండ్ వీక్ ఎలిమినేట్ కానున్నారు. నామినేషన్స్ ముగిసిన తర్వాత ఇంటి సభ్యులను పిలిచిన బిగ్‌బాస్.. ఫుడ్ మొత్తాన్ని స్టోర్ రూమ్‌లో పెట్టాలని చెప్పాడు. అలాగే అక్కడ నచ్చిన ఫుడ్‌ను ఎంతైనా తినొచ్చునని చెప్పాడు.

బుధవారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా సెకండ్ ప్రోమో రిలీజ్ చేసింది. దీనిలో భాగంగా ఓ చోట ఉన్న ఫుడ్‌ని, అక్కడున్న బుట్టల్లో బజర్ సౌండ్ రాకముందే నింపుకుని పెట్టుకోవాలని సూచించాడు. వారానికి ఎంత ఆహారం అవసరమో, ఏమేం కావాలో అంచనా వేసి ఫుడ్‌ని సేకరించడం చీఫ్స్ రెస్పాన్సిబులిటీ అని చెప్పాడు. బజర్ మోగగానే తొలుత యాష్మీ, తర్వాత నైనిక, నిఖిల్ వెళ్లి ఫుడ్‌ని సేకరించి బయటికి తీసుకొచ్చారు . ఇక్కడే బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. చీఫ్స్ తీసుకొచ్చిన ఆహారాన్ని సొంతం చేసుకోవడానికి వారి క్లాన్స్‌కి టాస్క్‌లు ఇచ్చాడు.

ఫస్ట్ ప్రోమోలో యాష్మీ టీమ్ గెలవడంతో వారికి సరుకులు దక్కాయి. అనంతరం నిఖిల్ - నైనిక టీమ్‌లకి మరో టాస్క్ ఇవ్వగా.. మణికంఠ- కిర్రాక్ సీత ఈ గేమ్‌లో తలపడ్డారు. ఇంట్లో కొన్ని ఐటెమ్స్ పెట్టి వాటిని ముందుగా ఎవరు తీసుకొస్తారో వారే విన్నర్ అని చెబుతాడు. అయితే ఫిజికల్ టాస్క్‌లో సీతపై మణికంఠ కలబడ్డాడు. అయినప్పటికీ సీత గట్టిగానే పోరాడింది. చివరికి 250 గ్రాముల మరమరాలు కావాలని బిగ్‌బాస్ ఆదేశించగా.. మణికంఠ అంతకంటే ఎక్కువగానే తీసుకొచ్చాడు .

అయితే దీనికి యాష్మీ పాయింట్ ఇవ్వకపోవడంతో మణి హర్ట్ అయ్యాడు. సరిగ్గా 250 గ్రాములు పట్టుకురావడానికి తాము రోబోలం కాదని ఫైర్ అవ్వగా.. సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని యాష్మీ అంటుంది. ప్రోమో చివరిలో సీత కాస్త ఎమోషనల్ అయ్యింది. చాలా బాధగా ఉంది బిగ్‌బాస్, ఫుడ్ గురించి కొట్టుకోవడమేంటీ, వాళ్లకు కూడా ఇవ్వండి అని రిక్వెస్ట్ చేసింది. చూస్తుంటే నైనిక టీమ్ ఈ టాస్క్‌లో గెలిచినట్లుగా తెలుస్తోంది. మరి విన్నర్ ఎవరో , హౌస్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X