ఫ్యామిలీ నుంచి సర్‌ప్రైజ్ గిఫ్ట్స్ .. వాళ్లు త్యాగం చేస్తేనే, మిస్ యూ కుమార్ అంటూ సీత ఎమోషనల్

బిగ్‌బాస్ తెలుగు 8 రసవత్తరంగా సాగుతోంది. ఇంటి సభ్యుల రేషన్‌ను కట్ చేయడంతో కంటెస్టెంట్స్ కూటి కోసం కోట్లాడుకుంటున్నారు. యాష్మీ, నైనిక టీమ్స్ మాత్రమే టాస్క్‌లలో గెలిచి ఫుడ్ సంపాదించగా.. నిఖిల్ టీమ్‌కి బొచ్చులో బొమ్మరాయి పడింది. వారికి రాగి పిండిని ఇచ్చి దానితో సరిపెట్టుకోమన్నాడు బిగ్‌బాస్. సిల్లీ గేమ్స్ కాకుండా అసలైన ఆట మొదలుపెట్టాడు బిగ్‌బాస్. ఎవరికి వారు మేం బాగానే ఆడుతున్నాం కదా అనుకుంటూనే లో లోపల ఎక్కడో భయపడుతున్నారు. శుక్రవారం నాటి ఎపిసోడ్‌కి సంబంధించి బిగ్‌బాస్ సెకండ్ ప్రోమోను రిలీజ్ చేశాడు.. ఆ వివరాల్లోకి వెళితే..

టాస్క్‌ల విషయంలో ఫిజికల్ అటాక్ ఎక్కువైపోవడంతో కంటెస్టెంట్స్ నిజ స్వరూపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. హౌస్‌ని కంట్రోల్ చేస్తున్న యాష్మీ వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు, అనవసరంగా అరుపులు, గొడవలు కంటెస్టెంట్స్‌కే కాదు ఆడియన్స్‌కి పిచ్చేకిస్తున్నాయి. ఇక ఆడపులినంటూ గొప్పలు చెప్పుకుంటున్న సోనియా.. తన మైండ్ గేమ్ మొదలుపెట్టింది. తనకు ఉపయోగపడతారు అనుకుంటే చాలు వారితో క్లోజ్‌గా ఉంటోంది. ఫస్ట్‌లో గొడవ పెట్టుకున్న యాష్మీతో సన్నిహితంగా ఉంటూ.. ఆమెకు హెల్ప్ చేస్తోంది.

Bigg Boss Telugu 8 Day -12 Promo 2 emotional surprise for contestants here s the details

మరోవైపు.. చిన్న చిన్న తప్పిదాలతో టాస్క్‌లలో ఓడిపోయిన నబిల్, విష్ణుప్రియలు అస్సలు తీసుకోలేకపోతున్నారు. అసలే ఫుడ్ కోసం ఇంట్లో గొడవలు జరుగుతున్న వేళ.. మణికంఠ ప్రవర్తన హీటెక్కించింది. ఆకలిగా ఉండటంతో మణికంఠ దోశలు వేసుకుని లాగించేశాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న బిగ్‌బాస్.. అర్థరాత్రిపూట అందరినీ లేపి క్లాస్ తీసుకున్నారు. మరోసారి ఇలాంటి ఇష్యూ జరిగితే పనిష్మెంట్ సివియర్‌గా ఉంటుందని హెచ్చరించారు.

బిగ్‌బాస్ ఇంట్లో దొంగతనాలు కామన్. గడిచిన ఏడు సీజన్ల నుంచి జరుగుతున్నది ఇదే. తమ ప్రత్యర్ధులు దాచిపెట్టిన వస్తువులు లేక మరేదైనా ఇంపార్టెంట్ థింగ్స్‌ని ఎత్తుకెళ్తుంటారు కంటెస్టెంట్స్. ఈసారి కూడా హౌస్‌లో తస్కరణలు జరుగుతున్నాయి. ముఖ్యంగా నైనిక టీమ్ దెబ్బకు దెబ్బ తీస్తూ, తమ వస్తువులకు మాత్రం గట్టి రక్షణ ఏర్పాట్లు చేసింది. నబీల్ అయితే ఈ విషయంలో పక్కాగా ఉంటున్నాడు. ఎవరైనా తమ వస్తువుల జోలికి వస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నాడు.

ఇక శుక్రవారం నాటి బిగ్‌బాస్ ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా సెకండ్ ప్రోమోని రిలీజ్ చేసింది. ఇందులో ఎమోషనల్ టచ్ ఇచ్చాడు. ఒక్కొక్క కంటెస్టెంట్స్ స్టోరీ చూపించి కంటతడి పెట్టించారు. తమ ఫ్యామిలీని కలిసే అవకాశం ఉంటుందని చెప్పి.. కేవలం ఐదుగురికే ఆ అదృష్టం ఉంటుందని అన్నాడు. ఇంటి సభ్యులకు వారి ఫ్యామిలీ నుంచి గిఫ్ట్‌లు వస్తాయని చెప్పిన బిగ్‌బాస్.. ఆ బహుమతులు ఎవరు తీసుకోవాలి అనేది సహచర కంటెస్టెంట్స్‌పై ఆధారపడి ఉంటుందని చెబుతాడు.

ఈ సందర్భంగా నిఖిల్ వాళ్ల నాన్న షర్ట్, అభయ్ వాళ్ల నాన్న వాచీని గుర్తుచేసుకుని ఎమోషనల్ అవుతాడు. సీత కుమార్ అనే ఫ్రెండ్‌ని, నైనిక ఓ ఎనుగు బొమ్మను చూసి కంటతడి పెడతారు. ఈ ప్రోమోలో అభయ్, నిఖిల్ ఇద్దరూ తమకు వచ్చిన అవకాశాల్ని వదిలేసుకున్నట్లుగా ప్రోమోలో చూపించారు. మరి ఏ కంటెస్టెంట్‌కి ఫ్యామిలీ ఇచ్చిన సర్‌ప్రైజ్ దక్కుతుందో తెలియాలంటే కొద్దిగంటలు వెయిట్ చేస్తే చాలు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X