రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన విష్ణుప్రియ.. నా గొయ్యి నేనే తవ్వుకున్నా, నాగ్ ముందు హ్యాండ్సప్ !!

బిగ్‌బాస్ తెలుగు 8 అప్పుడే సెకండ్ వీక్‌కి చేరుకోనుంది. ఆదివారం కావడంతో అందరూ ఉత్కంఠగా ఎదురుచూసే ఎలిమినేషన్ రోజు. ఈ వారం మొత్తం ఎపిసోడ్‌లో జరిగే తప్పొప్పులను నాగార్జున విశ్లేషిస్తారు. తప్పు చేసిన వారికి క్లాస్, బాగా ఆడినవారికి కాంప్లిమెంట్ ఇస్తారు. సరదా సరదాగా సాగిపోయే సండే ఎపిసోడ్ చివరిలో ఊహించని ట్విస్టులు గతంలో ఎన్నో జరిగాయి. ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా ప్రోమో రిలీజ్‌ను చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..

బిగ్‌బాస్ తెలుగు 8లో సెకండ్ వీక్ ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నారు. నిఖిల్, విష్ణుప్రియ, నైనిక, పృథ్వీ, కిరాక్ సీత, ఆదిత్య ఓం, శేఖర్ భాషా, నాగ మణికంఠలలో ఒకరు సెకండ్ వీక్ ఎలిమినేట్ కానున్నారు. ఆ ఒక్కరు ఎవరు అనే దానిపై సోషల్ మీడియాలో రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఎవరికి వారు తాము ఊహించినది రాసేస్తున్నారు. పైకి ఓటింగ్ అంటారు కానీ తుది నిర్ణయం బిగ్‌బాస్‌ నిర్వాహకులదేనన్నది బహిరంగ రహస్యం.

Bigg Boss Telugu 8 Day 14 Promo 1 Anchor Vishnu Priya rocked with jokes in chitram vichitram task here s the details

ఈ వారం డేంజర్ జోన్‌లో శేఖర్ భాషా, సీత, నైనిక, పృథ్వీ, ఆదిత్య ఓం ఉన్నారు. నైనిక, పృథ్వీ బలమైన కంటెస్టెంట్స్ కాగా.. వయసు రీత్యా, స్క్రీన్ ఫుటేజ్‌లలో కనిపించే విషయంలోనూ శేఖర్ భాషా, ఆదిత్య ఓంల పేర్లే ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరిద్దరిపైనే ఎలిమినేషన్ కత్తి వేలాడుతోందని కొందరు యూట్యూబర్లు రివ్యూలు ఇస్తున్నారు. పనిలో పనిగా డబుల్ ఎలిమనేషన్ కూడా ఉండొచ్చని చెబుతున్నారు. అదే జరిగితే కంటెస్టెంట్స్‌కి షాకే.

ఆదివారం ఎపిసోడ్‌కు సంబంధించి మొదటి ప్రోమోను స్టార్ మా రిలీజ్ చేసింది. ఎమోషన్స్‌కి సంబంధం లేకుండా ఇది ఫుల్ లెంగ్త్ ప్రేక్షకులను నవ్వించింది. నాగార్జున కలర్ ఫుడ్ డ్రెస్‌లో స్టేజ్ పై ఎంట్రీ ఇచ్చారు. హౌస్‌కు అభయ్, నిఖిల్‌లు చీఫ్‌లుగా సెలెక్ట్ కాగా.. ఎవరు ఏ టీమ్‌లోకి వెళ్తారో తేల్చుకోవాలనే నిర్ణయాన్ని కంటెస్టెంట్స్‌కే వదిలేస్తాడు నాగ్. తొలుత విష్ణుప్రియ తాను నిఖిల్ టీమ్‌లోకి వెళ్లాలని అనుకుంటున్నట్లు చెబుతుంది. ఎందుకని నాగ్ అడగ్గా.. నా గొయ్యి నేనే తవ్వుకున్నానంటూ నవ్వుతుంది. అభయ్ ఎక్కువగా మాట్లాడతాడు.. నిఖిల్ వింటాడని శేఖర్ భాష అనగా.. నువ్వు మాట్లాడితే వినేవాళ్లు కావాలని నాగ్ పంచ్‌లు వేస్తారు.

అనంతరం హౌస్‌లో చిత్రం విచిత్రం అనే గేమ్ నిర్వహిస్తారు నాగార్జున. స్క్రీన్‌పై వచ్చే ఫోటోలకు సరిపడా క్యాప్షన్ చెప్పాలని ఆర్డర్ వేస్తారు. శేఖర్ భాషాకు ఆపిల్, మిరపకాయలు ఫోటో చూపించగా ఆయన దానికి మెరుపుల్ అనే క్యాప్షన్ ఇస్తాడు. నెక్ట్స్ పాతకాలం నాటి ఫోన్, సెల్ చూపించగా.. సీత సెల్‌ఫోన్ అంటుంది. నీకు ఎవరో వెనుక నుంచి హింట్ ఇస్తున్నారంటూ విష్ణుప్రియపై డౌట్ పడతారు నాగ్.

నాకు అంత బ్రెయిన్ ఉంటే ఐఏఎస్ అయ్యేదాన్ని ఆమె అనగా హౌస్‌మెట్స్ నవ్వుతారు. తర్వాత ఒక గ్లాస్‌లో పాలు, దుబాయ్ షేక్ ఫోటో డిస్ ప్లే అవ్వగా.. దుబాయ్ షేక్ మీకు సలాం పెడుతుందని విష్ణుప్రియ చెబుతుంది. దీనికి సూర్యశక్తి టీమ్‌కు మైనస్ పాయింట్ అని చెబుతారు నాగ్. హౌస్‌లో అందరూ నీకు సలాం పెడుతున్నారంటూ పంచ్‌లు వేస్తారు. ప్రతిరోజూ ఏడుపులు, ఎమోషన్, గొడవలతో సాగే ప్రోమోల ప్లేస్‌లో ఈ ప్రోమో నెటిజన్లను తెగ నవ్విస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X