Bigg Boss Telugu 8: కంటెస్టెంట్ల మధ్య చిచ్చు పెట్టిన ప్రభావతి.. ఆడ, మగ తేడా లేకుండా కోడి గుడ్ల కోసం కుస్తీ..
Bigg Boss Telugu 8: నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న తెలుగు బిగ్‌బాస్ సీజన్-8 తెలుగు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తోంది. తెలుగు ప్రజలు బిగ్‌బాస్ అంటే పడిచచ్చిపోతారు. హౌస్‌లో జరిగే విషయాలను తెలుసుకోవడానికి తెగ క్యూరియాసిటీ చూపిస్తారు. అలాగే కొంతమంది ప్రోమోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మీమ్స్ క్రియేట్ చేస్తారు. మరికొంతమంది వారిలా రీల్స్ చేస్తుంటారు. నలుగురు వ్యక్తులు కలిసినా బిగ్‌బాస్ గురించే చర్చించుకుంటారు. ఈ బిగ్‌బాస్ రియాలిటీ షోపై గతంలో ఎన్నో విమర్శలు వచ్చినప్పటికీ ప్రస్తుతం మంచి రేటింగ్‌తోనే దూసుకుపోతుంది. అయితే తాజాగా 18 వ రోజుకు సంబంధించిన ఓ ప్రోమో 2 రిలీజ్ అయ్యింది.
సక్సెస్ పుల్ గా రెండు వారాలు పూర్తి చేసుకుని .. మూడో వారంలో అడుగుపెట్టింది బిగ్ బాస్. సీజన్ 8 లో 14 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇచ్చినప్పటికీ ప్రస్తుతం 12 మంది ఉన్నారు. ఇప్పటి వరకు బెజవాడ బేబక్క అండ్ శేఖర్ బాషా హౌస్ ఎలిమినేట్ అయ్యారు. ఇక మూడో వారం నామినేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. అందులో విష్ణుప్రియ, మణికంఠ, నైనిక, పృథ్విరాజ్, యష్మి, ప్రేరణ నామినేట్ అయినట్లు బిగ్‌బాస్ వెల్లడించారు. ఇదెలా ఉంటే.. టాస్కుల సమయంలోహౌస్‌మేట్స్ కొంచెం కూడా ఓపిక లేకుండా ప్రవర్తిస్తున్నారు. చిన్న మాట అనగానే ఒకరి కంటే ఒకరు తెగ రెచ్చిపోయ్ విచక్షణ లేకుండా బిహేవ్ చేస్తున్నారు . ఇకపోతే ఇప్పటికే జరిగిన రెండు వారాల టాస్కుల్లో కొంతమందికి గాయాలు అయిన విషయం తెలిసిందే. కంటెస్టెంట్లు అవన్నీ దృష్టిలో పెట్టుకుని గేమ్ ఆడక.. మళ్లీ అదే తరహాలో వెళ్తున్నట్లు తెలుస్తుంది.

తాజాగా విడుదలైన ప్రోమోలో చూసినట్లైతే.. కంటెస్టెంట్ల మధ్య రేషన్ గురించి గట్టి పోటీ జరిగింది. ఇందులో నిఖిల్ టీమ్ రెండు టాస్కులు విన్ అవుతుంది. అభయ్ టీమ్ ఒక టాస్క్ మాత్రమే గెలుస్తుంది. ఈ క్రమంలో హౌస్‌మేట్స్ మధ్య గొడవ జరుగుతుంది. దీనికి కారణం హౌస్‌లోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ప్రభావతి అని బిగ్‌బాస్ ప్రేక్షకులు మండిపడుతున్నారు. అయితే బుధవారం రాత్రి మాటీవీలో ప్రసారమయ్యే ఎపిసోడ్‌లో హౌస్‌మేట్స్ ప్రభావతితో గేమ్ ఆడుతారు. తాజాగా విడుదలైన ప్రోమోలో ప్రభావతి.. రెండు టీమ్ సభ్యులు గుడ్లు తిరిగి తనకు తెచ్చి ఇవ్వాలని అంటుంది. ఎక్కువ ఏ టీమ్ తెచ్చి ఇస్తే ఆ టీమ్‌ను తన తరపున కొన్ని లాభాలు ఉన్నాయని ప్రభావతి చెబుతుంది. ఇలా హౌస్‌లో గేమ్ స్టార్ట్ అవుతుంది.
గార్డెన్ ఏరియాలో ఒక కోడిపెట్ట ఆకారాన్ని ఉంచుతారు. కాగా ఈ కోడిపెట్ట నుంచి గుడ్లురావాల్సిన టైమ్ కు బయటికి వస్తుంటాయి. ఆ గుడ్లను తీసుకొని వారి ఫోటో ఉన్న బుట్టలో వేయాలి. అలాగే కంటెస్టెంట్లు ఆ గుడ్లను కాపాడాలి. ఈ క్రమంలో కంటెస్టెంట్ల మధ్య గొడవ ప్రారంభమవుతుంది. ఫస్ట్ నబీల్ వద్ద ఉన్న ఎగ్స్‌ను నిఖిల్ దొంగలించాలని ప్రయత్నించాడు. దీంతో యష్మీ గుడ్లను దొంగతనం చేయకుండా అడ్డుకుంటుంది. నబీల్ గుడ్లను టీషర్ట్ లోపల దాచుకుంటాడు. యష్మీ కూడా అవతలి టీమ్ వారి దగ్గర ఎగ్స్‌ను దొంగతనం చేయాలని చూస్తుంది. అభయ్ టీమ్.. నిఖిల్ టీమ్ నుంచి గుడ్లను లాక్కోవడానికి తెగ ట్రై చేస్తుంది. ఈ నేపథ్యంలో పృథ్వీ.. ఆదిత్య మెడ పట్టుకుని పక్కకు తోసేస్తాడు.
దీంతో ఆదిత్యకు దెబ్బ తగిలిందని పృథ్వి అంటాడు. మెడ పట్టుకుని అలా చేయడం సరైంది కాదని చెబుతాడు. దానికి పృథ్వి నన్ను కూడా ఇద్దరు అలాగే పట్టుకున్నారని అంటాడు.పృథ్వీ నా మెడ పట్టుకుని పక్కకు తిప్పాడని చాలా టైమ్స్ రిపీట్ చేస్తాడు. దీంతో నిఖిల్ టీమ్‌కు కోపం వస్తుంది. ఎంందుకు మరీ మేం దాచుకున్న గుడ్ల వద్దకు వచ్చావు అంటూ ఫైర్ అవుతారు. ఇక ఆదిత్య సైలెంట్ అవుతాడు. కానీ ఫైర్ బ్రాండ్ యష్మీ మాత్రం ఊరుకోకుండా మళ్లీ గొడవ పెద్దది చేయాలని చూస్తుంది. నిఖిల్ మాటలపై స్పందించి.. దెబ్బలు తగులుతాయంటే అసలు బిగ్‌బాస్ అలాంటి టాస్క్‌లు ఇవ్వొద్దని అంటుంది. అమ్మాయినైనా ఆడుతున్నాను కదా? అంటూ నిఖిల్ టీమ్‌లో అమ్మాయిలపై యష్మీ ఫైర్ అవుతుంది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట ట్రెండింగ్‌లో ఉంది.


Click it and Unblock the Notifications











