Bigg Boss 8 Telugu: 'వీళ్లు మనిషి పుట్టుక పుట్టారా లేదా ?.. యూజ్‌లెస్ ఫెలోస్..' బిగ్ బాస్ పై అభయ్ ఆగ్రహం
Bigg Boss 8 Telugu Latest Promo: బిగ్ బాస్ సీజన్ 8 బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుంది. చూస్తుండగానే రెండు వారాలను పూర్తి చేసుకుని మూడోవారంలోకి అడుగుపెట్టింది. నామినేషన్ల పర్వంలో హీటెక్కిన హౌస్ ను కూల్ చేయడానికి బిగ్ బాస్ టాస్కులు పెట్టారు. ఈ క్రమంలో ముందుగా రేషన్ టాస్కు పెట్టారు. కొత్తగా చీఫ్ అయిన అభయ్, పాత చీఫ్ అయిన నిఖిల్ టీమ్స్ మధ్య టాస్కులు పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో నిఖిల్ టీమ్ ఎక్కువ టాస్కులు గెలుపొంది.. ఎక్కువ రేషన్ పొందింది. వారితో పోలిస్తే అభయ్ టీమ్‌కు కాస్త తక్కువ రేషన్ వచ్చింది. ఆ తర్వాత హౌస్‌లో కిచెన్ లో కొత్త రూల్స్ పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో అభయ్ బిగ్ బాస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. మీరు కూడా ఓ లూక్కేయండి.
కంటెస్టెంట్ల మధ్య మరో చిచ్చు పెట్టడానికి బిగ్ బాస్ కొత్త ప్లాన్ వేశాడు. ఇంటి కిచెన్ లో ఒక్క కొత్త రూల్ మరో ఫిట్టింగ్ పెట్టాడు. 'ఇంటి కిచెన్‌లో ఇప్పటినుండి ఒక కొత్త రూల్ వచ్చింది. ఒక్క సమయంలో ఒక క్లాన్ కు చెందిన సభ్యులు మాత్రమే వంట చేసుకోవాలి. అలాగే.. వంటలో ముగ్గురు సభ్యులు మాత్రమే పాల్గొనాలి. కిచెన్ అందుబాటులో ఉన్న సమయంలో కూరగాయలు కోయడం కూడా పరిగణనలోకి తీసుకోబడుతుంది' అంటూ కిచెన్ ఉపయోగించుకోవడంపై లిమిట్ బిగ్ బాస్ పెట్టారు బిగ్ బాస్. ఆ రూల్స్ ను సీతా చదివి వినిపించింది.

ఆ కొత్త రూల్స్ నచ్చని అభయ్ ఆగ్రహంతో ఊగిపోయాడు.'వీళ్లు మనిషి పుట్టుక పుట్టారా లేదా నాకు అర్థం కావడం లేదు.. యూస్ లెజ్ ఫెలోస్.. అంత మందికి ముగ్గురు ఎలా వండుతార్రా..? ధమక్ లేదు ఏం లేదు.. అని చేతిలోని పిల్లోని విసిరి పారేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు అభయ్.. అంతతో ఆగకుండా.. కిచెన్ దగ్గరకు వెళ్లి.. ' తినడానికి టాస్కులు పెడుతున్నారా? తినకుండా ఉండటానికి టాస్కులు పెడుతున్నారో ? అర్థం కావడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
లాస్ట్ ఎపిసోడ్‌లో రెండు గ్రూపుల మధ్య ఎగ్స్ టాస్క్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే.. ఆ సమయంలో నిఖిల్ టీమ్ ఇష్టానుసారంగా ఆడి.. ఇతర టీమ్ సభ్యులకు గాయాలు అయ్యేలా చేసింది. ఆ టాస్క్ సమయంలో నానా రచ్చ జరిగింది. అయితే.. అలాంటి వైలెన్స్ జరగకుండా గుడ్ల సంఖ్య పెంచుకోవడం కోసం మరొక అవకాశం ఇచ్చారు బిగ్ బాస్ . కంటెస్టెంట్లందర్నీ గేమ్ పాయింట్ దగ్గరకు పిలిచి.. మరో టాస్క్ ఇచ్చారు.
గుడ్ల సంఖ్య పెంచుకోవడానికి ఇరు సభ్యులకు అవకాశం కల్పించారు బిగ్ బాస్. మరో టాస్క్ అంటూ 'మూవింగ్ ప్లాట్ ఫామ్' టాస్క్ ఇచ్చారు. ఆ మూవింగ్ ప్లాట్ ఫామ్ లో బాల్స్ ను బ్యాలెన్స్ చేస్తూ అందులోని హోల్స్ వేయాలని, హోల్స్ పడ్డ బాల్స్ ప్రకారం గుడ్లు లభిస్తాయని బిగ్ బాస్ చెప్పుతారు. ఈ గేమ్ లో అటు అభయ్ .. ఇటూ నైనిక ఆడారు. ఈ టాస్క్‌కు పృథ్వి సంచాలకుడిగా వ్యవహరించాడు. మొత్తానికి నైనికానే ఈ టాస్క్‌లో ఎక్కువ సంఖ్యలో గుడ్లను గెలుచుకున్నట్టు తెలుస్తోంది. ప్రొమో చివర్లో ప్రభావతి రెడ్ ఎగ్ పడేసింది. కానీ ఆ రెడ్ ఎగ్ ను ఎవరూ గమనించలేదనిపిస్తుంది.


Click it and Unblock the Notifications











