BIGG BOSS TELUGU 8 : చీఫ్ పోస్ట్ కోసం పెంట, బేబక్కను ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారంటూ.. సోనియాతో యాష్మీ తాడోపేడో

బిగ్‌బాస్ తెలుగు 8 సీజన్ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. కంటెస్టెంట్స్ ఒక్కొక్కరిని హోస్ట్ నాగార్జున హౌస్‌లోకి పంపించారు. ఇంట్లో అడుగుపెట్టిన ఏడుగురు అబ్బాయిలు, ఏడుగురు అమ్మాయిల గురించి నెటిజన్లు ఆన్‌లైన్‌లో జల్లెడ పడుతున్నారు. ఎవరు వారు, ఇంతకు ముందు ఏం చేశారు, వారి నేపథ్యం ఏంటీ అనేది తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. నిన్నటి నుంచి బిగ్‌బాస్ కంటెస్టెంట్ల పేర్లు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. అయితే హౌస్‌లో ఏం జరుగుతుందో స్టార్ మా ఎప్పటికప్పుడు ప్రోమోల రూపంలో హింట్స్ ఇస్తోంది. ఈ క్రమంలోనే బిగ్‌బాస్ డే 2 మరో ప్రోమోను రిలీజ్ చేసింది.

బిగ్‌బాస్ లాంచింగ్ ఈవెంట్ ముగిసిన తర్వాత కంటెస్టెంట్స్ తమకు కేటాయించిన గదుల్లోకి మకాం మార్చుకున్నారు. ఫస్ట్ డే కావడంతో డైనింగ్ టేబుల్ వద్ద అందరూ కలిసి డిన్నర్ చేశారు. కంటెస్టెంట్స్ కోసం వెజ్, నాన్ వెజ్ వంటకాలను మేకర్స్ రెడీ చేయగా.. హౌస్ మెట్స్ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ లాగించేశారు. కంటెస్టెంట్స్ ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ట్రై చేశారు. కొందరికి ముందు నుంచే పరిచయం ఉండగా.. వీరిలో కొందరికి మాత్రం ఇదే కొత్త.

BIGG BOSS TELUGU 8 Day 2 Promo 2 heated argument between sonia akula and yashmi gowda here s the details

గత సీజన్లకు భిన్నంగా బిగ్‌బాస్‌ను డిజైన్ చేశారు మేకర్స్. ఈ సీజన్ రూల్స్‌ను ఒక్కొక్కటిగా చెబుతూ నాగార్జున ఫస్టే డే నాడే కంటెస్టెంట్స్‌కి, ఆడియన్స్‌కి షాకిచ్చారు. ఈ సీజన్‌కు కెప్టెన్ ఎవరూ ఉండరని, అలాగే ప్రైజ్ మనీ వివరాలు జీరో అని చెబుతూ బాంబు పేల్చారు. కంటెస్టెంట్స్ వారి వారి ఫర్ఫార్మెన్స్ ద్వారా ప్రైజ్‌‌మనీని పెంచుకుంటూ వెళ్తారని నాగ్ వెల్లడించారు. పలు రియాలిటీ షోలలో సక్సెస్ అయిన ఈ కాన్సెప్ట్‌ను బిగ్‌బాస్‌లోకి కూడా తీసుకొచ్చారు.

ఇక.. బిగ్‌బాస్ ప్రోమోలోకి వెళితే.. లేడీ కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగినట్లుగా ఉంది. ఆకలి అంటే ఇంత బాధ్యతారాహిత్యమా అని సోనియా ఆకుల ప్రశ్నించగా.. బేబక్క హర్ట్ అవుతుంది. నేనేం చేశానా అంటూ ఆమె బాధపడుతుంది. ఇంత మంది వెయిట్ చేసేది దీని కోసమే కదా అంటూ కిచెన్‌లోకి వెళ్లాకా కూడా సోనియా కేకలు పెడుతుంది. ఇంతలో బేబక్క, శేఖర్, యాష్మీ, నవీన్‌లకు మూడో చీఫ్ కోసం పోటీ పడే ఛాన్స్ ఇస్తాడు బిగ్‌బాస్.

ఇందుకోసం కంటెస్టెంట్స్ పేర్లు, ఫోటోలున్న మార్బుల్స్‌పై ఏదో వస్తువు పడి అవి ముక్కలు అయిపోతాయి. బహుశా ఎవరి నేమ్ బోర్డ్ సేఫ్‌గా ఉంటుందో వారికి చీఫ్ పోస్ట్‌కి పోటీ పడే అవకాశం దొరుకుందనుకుంటా. బేబక్కను ఎక్కువమంది సపోర్ట్ చేస్తుంటే, నైనిక అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. బేబక్కను కిర్రాక్ సీత ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తుందంటూ ఆరోపిస్తుంది. ఇంతలో ఇల్లు కంట్రోల్ చేసే సత్తా తనకు ఉందో లేదో చెబుతుండగా పృధ్వీ ఏదో జోక్యం చేసుకుంటాడు.

యాష్మీ గౌడను చీఫ్ పోస్ట్ కోసం కొందరు సపోర్ట్ చేస్తుండగా.. సోనియా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆమె కొన్నిసార్లు వాయిస్ రైజ్ చేస్తుందని అనడంతో యాష్మీ ఫైర్ అవుతోంది. ప్రతిసారీ తనను ఎందుకు లాగుతున్నారంటూ క్వశ్చన్ చేస్తుంది. యాష్మీని అందుకే వద్దు అన్నా, ఆమెకు లెక్కలేనితనమంటూ సోనియా అనడంతో..ఇంకోసారి ఆ మాట అంటే ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. ఇంతలో నిఖిల్ కలగజేసుకోవడంతో ప్రోమో ముగుస్తుంది. మరి హౌస్‌లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే కొద్దిగంటలు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: bigg boss telugu 8
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X