Bigg Boss 8 Telugu: ‘నిన్న హాట్ హాట్.. నేడు హార్ట్ టు హార్ట్..’ బిగ్ బాస్ ప్రోమో వైరల్..

Bigg Boss 8 Telugu Latest Promo: తెలుగు టెలివిజన్ రంగంలో ఎన్నో రకాల షోలు ప్రసారం అవుతున్నా బిగ్ బాస్ సీజన్ 8 మాత్రం భారీ రెస్పాన్స్‌తో ముందుకు సాగుతోంది. బిగ్ బాస్ ఈ ఎనిమిదో సీజన్‌ను మాత్రం అన్‌లిమిటెడ్ కాన్సెప్టుతో నడుపుతున్నారు. అందుకు తగ్గట్లుగా ఎవరూ ఊహించని కంటెంట్‌ను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఈ సీజన్‌లో ట్విస్టులు, సర్‌ప్రైజ్‌లు, షాక్‌లు బిగ్ బాస్ లకు దిమ్మతిరిగేలా చేస్తున్నారు. దీంతో ఈ సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతూ ప్రేక్షకులకు మజాను పంచుతోంది. నిన్నటి ఎపిసోడ్ ( శనివారం) మాత్రం వేరే లెవెల్.. బిగ్ బాస్ చరిత్రలో నిలిచిపోయే ఎపిసోడ్ అని చెప్పుకోవచ్చు. భారీ స్థాయిలో రెస్పాన్స్‌ వస్తున్న బిగ్ బాస్ తాజా ప్రోమో నెట్టింట్లో తెగ వైరలవుతోంది.

ఇక బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 లో మూడో వారం ఆఖ‌రికి వ‌చ్చేసింది. ఈ వారం ఎవ‌రు ఎలిమినేషన్ కానున్నారనే దానిపై అంద‌రిలో ఉత్కంఠ నెల‌కొంది. ఈ వీక్ లో నామినేష‌న్‌లో మొత్తం ఎనిమిది మంది ఉన్నారు. అందులో విష్ణుప్రియ, నాగ మణికంఠ, పృథ్వీ, యష్మీ, ప్రేరణ, సీత, అభయ్, నైనిక ఉన్నారు. నిన్నటి ఎపిసోడ్లో నాగార్జున రెడ్ కార్డుతో కలకలం రేపాడు. బిగ్ బాస్ రూల్స్ బ్రేక్ చేసిన అభయ్ నవీన్ పై సీరియస్ అయ్యాడు. రెడ్ కార్డ్ ఇచ్చి బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోవాల్సిందిగా సీరియస్ వార్నింగ్ ఇచ్చాడు నాగార్జున. అలాగే.. ఇతర కంటెస్టెంట్లపై ఓ రేంజ్ లో ఫైరయ్యారు. నిన్నటి ఎపిసోడ్ చాలా హాట్ హాట్ గా ఉన్నా నేటీ ఎపిసోడ్ మాత్రం సండే.. ఫన్డే గా మారింది. నేటీ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో వ‌చ్చేసింది.

Bigg Boss Telugu 8 Day 21 Promo 1 out Set or Cut Challenge Task promo viral

నేటీ ఎపిసోడ్‌ ప్రోమో ప్రారంభం కాగానే.. 'కొట్ట‌రా కొట్టు తీన్‌మార్'అనే సాంగ్‌తో నాగార్జున ఎంట్రీ ఇచ్చాడు. టు డే సండే.. ఫన్ డే నిన్నటిలాగా మాత్రం అసలు ఉండదంటూ.. చాలా కూల్ గా కనిపించారు. కంగారూ ఉన్న కంటెస్టెంట్లలకు కాస్త రిలీఫ్ ఇచ్చారు. ముందుగా ప్రుద్వీ మంచి హుషారుగా ఉన్నాడు అని నాగార్జున అన‌గా.. వెంట‌నే విష్ణు ప్రియ అవును సార్‌.. కానీ, ఆయన వేసుకున్న ష‌ర్ట్ త‌న‌ది కాదు అంటూ.. నవ్వుల పువ్వుల పూయించింది. మరీ ఎవరంటూ నాగ్ అడగ్గా.. అది నైఖిల్ ది అంటూ.. వింతగా సమాధానమిచ్చింది విష్ణు. ఇంతకీ నైఖిల్ ఎవరంటూ నాగ్ కూడా కాస్త షాకయ్యారు. సండే ఫ‌న్ డే భాగం 'సెట్ అండ్ కట్' అంటూ.. కంటెస్టంట్ల‌తో నాగ్ ఆట‌లు ఆడించారు. సెట్ అయిన వాళ్ల‌కు రెడ్ హార్ట్ ను గిప్టుగా ఇవ్వాల‌ని, సెట్ కాని వాళ్లకు హార్ట్‌ను బ్రేక్ చేయాల‌ని చెప్పాడు.

ముందుగా విష్ణు నువ్వు ఏం చేస్తావ్ ? అనగానే.. సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్ అంటూ.. డిపరేట్ ఎక్స్ ప్రెజన్ ఇచ్చింది. ఈ క్రమంలో నిఖిల్ ప్రుద్వీకి హర్ట్ ఇచ్చి.. ' వాడు సెట్. మాట వింటాడు సార్' అని చెప్పగా.. వెంటనే నాగ్ రియాక్ట్ అయి.. 'అంటే.. సోనియా మాట వినదా?' అన్ని ప్రశ్నించి.. నిఖిల్ ను ఇరకాటంలో పడేశారు. ఏదోకటి చెప్పాలని నిఖిల్ ప్రయత్నిస్తూ.. కొన్నిసార్లు కొన్నిమాటలు వింటే తనకు బాదేస్తుంది' అని చెప్పగా.. ' నీ కోసం సోనియా వెయిట్ చేస్తూంటే.. నువ్వు మాత్రం చెప్పకుండా తినేస్తే తనకు మాత్రం బాధగా అనిపిస్తుందిగా నిఖిల్ ' అని ప్రశ్నించారు నాగార్జున.

ఆ తరువాత మణికంఠ వంతు వచ్చింది. సోనియాకు హార్ట్ ఇచ్చి సెట్ అని.. నిఖిల్ కు బ్రోకెన్ హార్ట్ ఇచ్చి కట్ అని చెప్పాడు. నిఖిల్ తో ఎందుకంటే.. ఆయన కొన్ని సార్లు గేమ్ లో ఫిజికల్ అవుతున్నా.. పట్టించుకోడు.' అని ఓ రీజన్ చెప్పాడు మణికంఠ. వెంటనే నాగ్.. నిఖిల్ తన టీం కోసం ఆడుతాడు కానీ.. నీ టీమ్ కోసం ఎలా ఆడుతాడు మణికంఠ అని సెటైర్ వేశాడు నాగార్జున. ఆ తరువాత 'నైనిక.. అట్లా సూడకు.. భయమైతుంది.. ఈ మధ్య తగ్గువ మాట్లాడుతున్నావ్.. అందుకే బ్రేక్ హార్ట్ ఇగా తీసుకో'అని నబిల్ అనగానే.. నైనిక నవ్వుతూ.. ' సరే తీ.. ఈ సారి నుండి ఆ తక్కువకు కూడా మాట్లాడ' అంటూ సమాధానమిచ్చింది. తరువాత విష్ణు లేచి 'సెట్ సీతతో సీత నేను క్రుష్ణుడి భక్తులం' అంటూ ఇంట్రెస్టెంగ్ కామెంట్ చేసింది. ఇలా ఒక్కొక్క కంటెస్టెంట్ తనకు నచ్చిన వారి హర్ట్ తీచ్చేశారు. మొత్తంగా ప్రొమో చూస్తుంటే .. సండేను ఫ‌న్ ఫుల్‌గా మార్చేశారు బిగ్ బాస్..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X